అమృత ఇంట్లో మరో కలకలం.. అర్దరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఏం చేసాడంటే?

479

న‌ల్ల‌గొండ జిల్లా మిర్యాల‌గూడ ప‌ట్ట‌ణంలో ప్ర‌ణ‌య్ హ‌త్య దేశంలో ఎంతో ప్ర‌కంప‌న‌లు రేపింది ప్రేమ పెళ్లి చేసుకున్న‌వారిపై ఇలా కులాలు మ‌తాలు అడ్డువ‌స్తున్నాయి అని క‌డ‌తేర్చుతున్న తండ్రులు త‌ల్లుల‌పై యువ‌త పెద్ద ఎత్తున న‌రిస‌న తెలిపారు ప్ర‌ణ‌య్ హ‌త్య తర్వాత అమృత కూడా పోరాటం చేస్తోంది. అయితే ప్ర‌ణ‌య్ హ‌త్య ఉదంతం త‌ర్వాత అమృత కూడా న్యాయ పోరాటం చేస్తూ ఆమె అత్త‌మామ‌ల ద‌గ్గర ఉంటోంది. కుల మ‌తాల‌కు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకునేవారికి అండ‌గా ఉండేందుకుప్ర‌ణ‌య్ పేరుతో ఏదైనా చేయాలి అని భావిస్తోంది అమృత‌. ఇక స‌మాజం కూడా ఆమెకు ఎంతో అండ‌గా ఉన్నారు.

Image result for pranay and amrutha

మిర్యాలగూడ పట్టణంలో రెండు నెలల క్రితం హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌ ఇంట్లోకి ఓ ఆగంతుకుడు చొరబడ్డాడు. ఆదివారం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తుండగా.. శనివారం తెల్లవారు జామున దుండగుడు ఇంటి ఆవరణలో కలియతిరిగిన విషయాన్ని గుర్తించామని ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తెలిపారు. ఆగంతకుడు ముఖానికి ముసుగు ధరించాడని, అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసులను చూసి, పారిపోయినట్లు చెప్పారు. బాలస్వామి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు… ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఎంఏ కరీం, శ్రావణ్‌కుమార్‌పై మూడు రోజుల కిందటే పోలీసులు పీడీయాక్ట్‌ను ప్రయోగించారు.

ఇక బ‌య‌ట నుంచి వీరు ఏమైనా అమృత పై దాడి చేయ‌డానికి చూస్తున్నారా అని కూడా ఆలోచిస్తున్నారు, అయితే ఇంట్లోకి వ‌చ్చిన ఆ దుండ‌గుడు ప్ర‌ణ‌య్ కు సంబంధించిన ఫోటోలు తీసుకువెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించాడు అని అంటున్నారు అయితే అమృత పై దాడికి వ‌చ్చారా లేదా అమృత కు ప్ర‌ణ‌య్ కు సంబంధించిన విలువైన గుర్తుఉన్న వ‌స్తువులు తీసుకువెళ్ల‌డానికి వ‌చ్చారా అనేది పోలీసులు విచార‌ణ చేస్తున్నారు ఇక త‌న‌కు ప్రాణ హ‌ని ఉంది అని గ‌తంలో అమృత చెప్పింది అందుకే పోలీసులు రాత్రిపూట ఆ ఇంటి ద‌గ్గ‌ర గ‌స్తీ ఉంటున్నారు. ఇక ప్ర‌ణ‌య్ ని హ‌త్య చేసిన త‌న తండ్రి బాబాయ్ త‌న‌ని కూడా చంపుతారు అని చెబుతోంది అమృత‌. మ‌రి చూశారుగా ఆమెకు ఎటువంటి భ‌ద్ర‌త ఇస్తే మంచిది అని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.