అమృతకు కోర్టు నోటీసులు.. ప్రణయ్ తండ్రికి దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు

470

మిర్యాలగూడలో సంచలనం స్పృష్టించిన ప్రణయ్ హత్య ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది.ఒకవైపు నిందితులు అందరు దొరికిన కూడా ఈ ఘటనకు సంబంధించి ఏదో వార్త బయట పడుతూనే ఉంది.నిందితులు అందరు దొరికిన కూడా ప్రణయ్ విగ్రహం విషయంలో మిర్యాలగూడలో ఇంకా రభస జరుగుతూనే ఉంది.పెట్టాలని కొందరు పెట్టొద్దని కొందరు వాదోపవాదనలు చేస్తూనే ఉన్నారు.అయితే ఈ విషయం అటు ఇటు తిరిగి ఇప్పుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి దగ్గరకు చేరింది.అసలు మిర్యాలగూడలో ఎంజరుగుతుంది. ఆ విషయాల గురించి ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for pranya and amrutha

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది చేసిన నివేదనను హైకోర్టు నమోదు చేసింది. విగ్రహ ఏర్పాటును నిలుపుదల చేయాలని కోరుతూ సామాజికవేత్త చిన్నం వెంకటరమణారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి ముందు విచారణకు వచ్చింది. సంబంధిత అధికారుల అనుమతి లేనిదే మిర్యాలగూడలో ప్రణయ్‌ విగ్రహం నెలకొల్పరాదని టూటౌన్‌ పోలీసులు హతుడి తండ్రికి ఇచ్చిన నోటీసులో ఆదేశించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హోంశాఖ తరఫున న్యాయవాది చేసిన ఈ నివేదనను నమోదు చేసిన జస్టిస్‌ శేషసాయి విచారణను అక్టోబరు 23కు వాయిదా వేశారు. ప్రణయ్‌ భార్య అమృతవర్షిణి కోరిక మేరకు అతడి విగ్రహాన్ని మిర్యాలగూడలోని సాగర్‌ రోడ్డులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఇల్లు, కార్యాలయంలో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సోదాల్లో మారుతీరావు రాసుకున్న వీలునామాతో పాటు పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయి. ఈ పత్రాలను సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో సమర్పిస్తామని డీఎస్పీ తెలిపారు.విన్నారుగా మిర్యాలగూడలో ఏం జరుగుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రణయ్ ఏర్పాటులో జరుగుతున్న విషయాల గురించి అలాగే ప్రణయ్ తండ్రివెళ్లిన నోటీసుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి