సోషల్ మీడియాలో అమృతను దారుణంగా తిట్టాడు.. చివరికి అతనికి ఏం శిక్ష పడిందో తెలిస్తే షాక్

343

కొన్ని రోజుల కిందట మిర్యాలగూడ ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్టాలలో స్పృష్టించిన కలకలం అందరికి తెలిసిందే.ఈ కేసులో నిందితులందరు దొరకడంతో కేసు నమోదు చేసుకుని వారిని జైలుకు పంపారు.ఆ తర్వాత ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని అమృత ప్రణయ్ కుటుంబ సభ్యులు నానా హంగామా చేశారు.అయితే కోర్ట్ కలగజేసుకుని విగ్రహ ప్రతిష్టను నిలిపేసింది.అయితే ఈ విషయం మీద అమృత ఇంకా పోరాడుతూనే ఉంది.కొందరు సపోర్ట్ చేస్తుంటే కొందరేమో వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ విషయంలో కలగజేసుకున్నందుకు ఇప్పుడు ఒక యువకుడిని అరెస్ట్ చేశారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for pranay and amrutha

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి జస్టిస్ ఫర్ ప్రణయ్ పేరుతో ఫేస్‌బుక్ పేజ్ ఓపెన్ చేసింది. ఈ ఫేస్‌బుక్ పేజీకి వేలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు.కానీ అమృత వర్షిణికి కొందరు బాసటగా నిలిచినా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అసభ్యకరంగా కామెంట్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.ప్రణయ్ ఏమి చేశాడని విగ్రహం పెట్టాలి.మీరు ఏం ఘనకార్యం చేశారని మీకు సపోర్ట్ గా నిలవాలి.మీరు చేసింది తప్పని మాట్లాడుతూ కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడాడు.దీంతో అమృత వర్షిణి వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.నన్ను నా భర్తను నా కుటుంబాన్ని అవమానించేలా ఒక వ్యక్తి మాట్లాడాడని ఆమె పిర్యాదు చేసింది.అమృత ఫిర్యాదుపై స్పందించిన డీఎస్పీ శ్రీనివాస్‌ విచారణ చేపట్టాలని వన్‌టౌన్‌ పోలీసులను ఆదేశించారు. దీంతో ఐటీకోర్‌ టీమ్‌ సహకారంతో విచారణ మొదలుపెట్టిన సీఐ సదానాగరాజు అమృత వర్షిణిని కామెంట్‌ చేసిన యువకుడు కోసం అన్వేషించారు.

ఆ యువకుడు రంగారెడ్డి జిల్లా దూలపల్లి మండలం కొంపల్లి గ్రామానికి చెందిన గొట్టి ఈశ్వర్‌గా గుర్తించి ఐటీ అమెండెమెంట్‌ యాక్ట్‌, 354(డీ)ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.గొట్టి ఈశ్వర్‌ను స్వగ్రామంలోనే అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అంతేగాకుండా సోషల్‌ మీడియాలో ఇతరులను కామెంట్‌ చేస్తూ అసభ్యకర పదజాలంతో అవమాన పరిచేవిధంగా పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అమృత ప్రణయ్ ల విషయం గురించి అలాగే వాళ్ళను అసభ్యకరంగా తిట్టి ఇప్పుడు కేసులో ఇరుకున్న యువకుడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.