అంబాసిడర్ కారు మళ్ళి వస్తుంది.. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే షాక్..

577

బీయండబ్ల్యు, ఆడి, బెంజు, జాగ్వార్ లాంటి పెద్ద పెద్ద కార్లు ఎన్ని మార్కెట్లోకి విడుదలైనా అంబాసిడర్ కారుకు మాత్రం ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు. అందరికి బాగా తెలిసిన కారు మరియు ఎక్కువమంది ఇష్టపడే కారు అంబాసిడర్.హిందుస్థాన్ మోటార్స్ 1948 లో అంబాసిడర్ కారును తయారు చేయాలని, వెస్ట్ బెంగాల్ లోని ఉత్తర పారాలో కేంద్ర ప్రభుత్వ అనుమతితో కారు ఫ్యాక్టరీని స్థాపించారు. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ కారును ప్రత్యేకంగా తాయారు చేసారు. 1948లో అంబాసిడర్ కారు తయారీకి శ్రీకారం చుట్టినా.. అది తయారవడానికి 8సంవత్సరాల సమయం పట్టింది. 1956లో ఉత్పత్తికి పూర్తి చేసుకొని 1959లో మొట్టమొదటి కారును విడుదల చేసారు. ఆ తరువాత అంబాసిడర్ ఎప్పుడు వెనుదిరగలేదు. దాదాపు 50 సంవత్సరాల పాటు కింగ్ అఫ్ కార్స్‌గా వెలిగిపోయింది.

Image result for అంబాసిడర్

1970-80 లో కార్ల రారాజులా ఒక వెలుగు వెలిగింది. రాజకీయ నాయకుల దగ్గర నుండి పెద్ద పెద్ద బిసినెస్ పర్సన్స్ కూడా అంబాసిడర్ కారునే ఉపయోగించేవారు. మన పాత సినిమాలలో కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువగా అంబాసిడర్ కార్లలోనే చేసేవారు. కానీ 2000 సంవత్సరం నుండి ఈ కార్ల మార్కెట్ తగ్గుతూ వచ్చింది. దాని కారణంగానే 2014లో అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని ఆపేసారు. అయితే ఈ కార్లు ఇప్పుడు మళ్ళి మార్కెట్ లోకి రాబోతున్నాయి.ఇండియాలో అంబాసిడర్ బ్రాండ్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా అంబాసిడర్‌కు మళ్లీ ప్రాణం పోయనుంది. హిందూస్తాన్ సంస్థ అంబాసిడర్ పేరుతో కార్లను పరిచయం చేయన్నాయి.ఈ సంవత్సరం చివర్లో గాని వచ్చే సంవత్సరంలో గాని అంబాసిడర్ కారు మరల విడుదల కాబోతుంది. ప్రస్తుత ఆటోమొబైల్ రంగంలో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా అంబాసిడర్ కార్లను కొత్త రూపంతో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీనిలో 800సీసీ ఇంజిన్ ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా పాత అంబాసిడర్ కంటే కొత్త అంబాసిడర్ కార్లు మైలేజీ కూడా బాగా ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. కొత్త అంబాసిడర్‌ను కొత్త స్టైల్‌లోనే కాకుండా విశాలంగా ఉండేలా దీని డిజైన్ మార్చారు. ప్రపంచ వ్యాప్తంగా అంబాసిడర్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దీని తయారీ జరుగుతుందని హిందుస్థాన్ మోటార్స్ అధికారులు తెలియజేసారు. దీని నార్మల్ కారు ప్రారంభ ధర వచ్చేసి 3,20,000/- గా నిర్ణయించామన్నారు. అప్పట్లో దీనికున్న క్రేజ్ కారణంగా విడుదలయ్యే కొత్త మోడల్ కార్లు కూడా అందరి మన్ననలు పొందితే, ప్రస్తుత టాప్ 10 కార్ల జాబితాలో చేరిపోతుందని మార్కెట్ వర్గాల నిపుణులు తెలియజేసారు. ఏది ఏమైనా రాయల్టీకి మారుపేరు ఈ అంబాసిడర్ అని అందరూ అంటుంటారు. మరి రాబోయే మోడల్స్ ఎలా ఉంటాయో విడుదలవరకు వేచిచూడాల్సిందే. మరి అంబాసిడర్ కారు గురించి మళ్ళి లాంచ్ అవ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.