పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన అంబానీ.. ఏం చేశాడో చూడండి

377

మొన్న జరిగిన పుల్వామా దాడిలో మొత్తం 49 మంది వీర మరణం చెందారు. ఈ ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు.ఈ ఘటన కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు యావత్తు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదులు ఇంతపని చేశారా అని వాళ్ళ మీద ధ్వజమెత్తుతున్నారు. యావత్తు ప్రపంచం భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదం నశించాలని కోరుకుంటున్నారు.

Image result for anil ambani

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విధించింది.అలాగే మోడీ కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే పనిలో ఉన్నాడు. పాకిస్థాన్ ను వాణిజ్య ప్రకటనలను రద్దు చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే ఇండియా ప్రధానికి పాక్ ప్రధానికి కూడా మాటల యుద్ధం జరుగుతుంది. యుద్దానికి సై అంటే సై అంటున్నారు.ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడిపై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి 

పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకోవాలని ఐఎంజీ రిలయన్స్ సంస్థ నిర్ణయించింది. పీఎస్‌ఎల్‌కు అఫీషయిల్ ప్రొడక్షన్ పార్టనర్‌గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్‌తో ఎలాంటి భాగస్వామ్యాన్ని కొనసాగించదని సంస్థ తెలిపింది. తక్షణం నిర్ణయం అమల్లోకి వచ్చినట్లేనని, ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు కూడా తెలిపింది. పీఎస్ఎల్‌తో ఒప్పందం మేరకు ఐఎంజీ రిలయన్స్ పలు మ్యాచ్‌ల లైవ్ కవరేజ్‌కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సి వుంది. టీవీ ఛానెళ్లు, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్‌లు ఇతర మౌలిక వసతుల కల్పనకు పీసీబీ-ఐఎంజీ రిలయన్స్ ఒప్పందం చేసుకున్నాయి. మరోవైపు ఇండియాలో పీఎస్ఎల్‌ ప్రత్యక్ష ప్రసారాల నుంచి తప్పుకుంది. ఉగ్రదాడులకు పాల్పడే పాకిస్తాన్ వంటి దేశాలతో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పాకిస్థాన్ మీద అంబానీ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.