ఉల్లిపాయల తొక్కలను పాడేస్తున్నారా… వాటితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా..

89

తల్లి చెయ్యని మేలు ఉల్లి చేస్తుంది అని మనకు ఒక సామెత ఉంది. ఉల్లిపాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఉల్లిపాయలు రేటు ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా వండుకుంటాం. తక్కువగా ఉంటే లైట్ తీసుకుంటాం. ఉల్లి లేనిదే కూర తిరగమోత పెట్టడం సాధ్యం కాదు. అలాగే కొందరు పచ్చి ఉల్లిని కూడా పచ్చడిలో మలుచుకుని తింటారు. మరికొందరు మజ్జిగలో వేసుకుని తాగుతారు. అయితే మనలో చాలా మంది ఉల్లి తొక్కలను పారేస్తూ ఉంటాం. నిజానికి వాటితో చాలా ప్రయోజనాలున్నాయి. వాటి గురించి తెలిస్తే ఇక నుంచి వాటిని పడేయరు. మరి ఉల్లితోక్కలతో కలిగే లాభాల గురించి తెలుసుకుందామా.

Image result for onions
  1. మీ ఇంట్లో దోమల బెరద ఎక్కువగా వుంటే.. ఓ గిన్నెలో నీరు పోసి అందులో కొన్ని ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పెడితో దోమలు ఉండదు. ఎందుకంటే.. దోమలకు ఉల్లిపాయల వాసన, ఘాటు పడదు.
  2. ఉల్లి తొక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. మరునాడు ఉదయాన్నే ఆ నీటితో శరీర నొప్పులు ఉన్నప్రాంతాల్లో రాసుకుంటే నొప్పులు త్వరగా తగ్గుముఖం పడుతాయి. ఆ నీటిని చర్మానికి రాసుకుని అరగంట తరువాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి.
  3. జుట్టు రాలుతున్నా, చుండ్రు సమస్య ఉన్నా.. ఉల్లి తొక్కల్ని వాడేసుకోవాలి. ఎలా అంటే, ఉల్లి తొక్కల్ని మెత్తగా నూరి తలకు పట్టించాలి. పావుగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే.. జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు, తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఉల్లిలోని సల్ఫర్ పాడైన, సన్నబడిన వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. ముఖ్యంగా తెల్లజుట్టును గోధుమ, బంగారం రంగులోని మార్చుతుంది.

ఈ క్రింద వీడియో చూడండి

  1. ఉల్లి తొక్కలతో సూప్ చేసుకోవచ్చు. అది తాగితే చాలు బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెట్టే బెడా సర్దుకొని బయటకు పోతుంది. అది పోయిందంటే అధిక బరువు తగ్గి, సన్నగా, చక్కటి శరీర ఆకృతి వస్తుంది. దాంతోపాటు గుండె సమస్యలు రాకుండా ఉంటుంది.. అంతేకాదు ఆనియన్ సూప్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
  2. కొంతమందికి గాళ్లు వాపు ఎక్కుతాయి. లేదా మంట పెడతాయి. అలాంటి వాళ్లు ఉల్లి తొక్కల్ని 10 నుంచీ 20 నిమిషాలు నీటిలో మరగబెట్టాలి. ఆ తొక్కల్ని తీసేసి, నీటిని టీ లాగా తాగేయాలి. నిద్రపోయే ముందు ఇలా చేస్తే మంచిది. నాలుగైదు రోజుల్లో గాయాలు మటుమాయం అవుతాయి.
    6.ఉల్లి తొక్కలు మొక్కలకు కూడా మందు. మొక్కల మొదళ్లలో ఉల్లి తొక్కలను ఉంచినట్లైతే వాటికి మంచి ఎరువులా పనిచేస్తుంది. చెట్టునిండా పూలు పూసి పరిమళాలను వెదజల్లుతుంది. మనసుకి ఆహ్లాదాన్ని అందిస్తుంది.

ఇవేనండి ఉల్లి తొక్కలతో పొందే లాభాలు. కాబట్టి ఉల్లి తొక్కలను డస్ట్ బిన్ లో పడేయకుండా జాగ్రత్తగా దాచుకోండి. మరి ఉల్లి తొక్కలతో ఉండే ఈ లాభాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.