Breaking News:యంగ్ హీరోను రెండవ పెళ్లి చేసుకోబోతున్న అమలా పాల్..హీరో ఎవరో తెలిస్తే షాక్

499

సినిమా నటులు పెళ్లిచేసుకోవడం విడిపోవడం మళ్ళి మంచి భాగస్వామి దొరికితే పెళ్లి చేసుకోవడం లాంటివి సర్వసాధారణం.ఇప్పటికే చాలామంది నటులు పెళ్లి చేసుకుని విడిపోయి మళ్ళి వేరే వాళ్ళను పెళ్లి చేసుకున్నవాళ్ళు ఉన్నారు.ఇప్పుడు ఈ జాబితాలోని అమలాపాల్ కూడా వస్తుందని తమిళ మీడియా కోడై కూస్తుంది.ఆమె ఇప్పుడు మరొక పెళ్ళికి సిద్ధపడుతుంది.ఈసారి కూడా ప్రేమ వివాహం చేసుకోబోతుంది అని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మరి ఆ వార్తల గురించి ఆమె ఎవరిని చేసుకోబోతుంది.అసలు అందులో నిజమెంత.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమలాపాల్ రెండో పెళ్ళికి సిద్ధమవుతోందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు.ఆమె తన సహా నటుడు విష్ణు విశాల్ ను పెళ్లి చేసుకుంటుందని ఇద్దరు ప్రేమలో ఉన్నారని తమిళ మీడియా అంటుంది.యువ హీరో విష్ణు విశాల్, అమలా పాల్ రాట్సాసన్ చిత్రంలో జంటగా నటించారు. అప్పటి నుంచే మీడియాలో వీరి రిలేషన్ గురించి గాసిప్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరు పెళ్లి చేసుకొన్నారనే వార్త తమిళ పరిశ్రమలో దావానలంగా మారింది. సినీ వర్గాల్లో ఎక్కడ చూసిన అదే ముచ్చట వినిపించింది. అమలాపాల్‌తో పెళ్లి జరుగబోతున్నదనే వార్తతో విష్ణు విశాల్‌ కంగుతిన్నాడు. వెంటనే సోషల్ మీడియాలో స్పందించారు. తన పెళ్లి గురించి వచ్చిన వార్తలను ఖండించాడు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. తన పెళ్లి వార్తలను ఎవరూ నమ్మవద్దు అని రిక్వెస్ట్ చేశాడు. నా పెళ్లి వార్త ఓ స్టుపిడ్ న్యూస్. బాధ్యతగా మాట్లాడండి.. వ్యవహరించండి. మనం మనుషులమనే విషయం మరిచిపోకండి. మాకు ఫ్యామిలీలు ఉన్నాయి. పబ్లిసిటీ కోసం ఏదో రాయవద్దు అని ట్వీట్ చేశారు. దాంతో పెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చాయి.

విష్ణు విశాల్ ఇటీవలే తన భార్య రజనీ నుంచి విడాకులు పొందారు. కాలేజీ నుంచే స్నేహితులుగా ఉన్న వారిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు. రాట్సాసన్ రిలీజ్ తర్వాత రజనీ నేను విడాకులు తీసుకొన్నామని సోషల్ మీడియాలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అందాల నటి అమలా పాల్, దర్శకుడు ఏఎల్ విజయ్‌ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఏడాది తిరుగకముందే వారి దాంపత్య జీవితంలో విభేదాలు నెలకొన్నాయి. అప్పటి నుంచి అమలా పాల్ ఒంటరిగానే ఉంటున్నది. గత కొద్దికాలంగా విష్ణు విశాల్‌తో సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి.