గోవాకు వెళ్లే వారంతా తప్పక చదవాల్సిందే!

451

వెకేషన్ కు వెళ్లాలనుకుంటే అందరి మైండ్ లో వచ్చే మొదటి ప్లేస్ గోవా. ఇండియాలో ఉన్న మంచి ప్రదేశాలలో గోవా బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఎంజాయ్ చేసినోళ్లకు చేసినంత. ఇక్కడ ఉన్న ప్రతి ప్రదేశం జనాలను ఆకర్షిస్తుంది. కొన్ని పేర్లు విన్న వెంటనే మనసులో ఒకరకమైన సంతోషం కలుగుతుంది. అలాంటి కోవకే చెందింది గోవా. ఆ రాష్ట్రం పేరు విన్నంతనే ఎంజాయ్ చేయటానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. అంతేనా.. పార్టీ చేసుకోవటానికి.. నచ్చినట్లుగా గడపటానికి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఎన్నో రీజన్స్ ను చెప్పేస్తారు.

Image result for goa

గోవా అంటే కేవలం సముద్రం, సూర్యుడు, ఇసుక మాత్రమే కాదు. బీచ్‌లు, పార్టీ సంస్కృతికి మించి మరెన్నో ఇక్కడ ఉన్నాయి. ఇది జల క్రీడల ప్రేమికులకు స్వర్గం. జెట్-స్కీయింగ్ మరియు పారాసైలింగ్ అనుభవించడానికి భారతదేశంలో ఉత్తమమైన ప్రదేశం. భారతదేశ పర్యటనలకు గోవా ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. గ్రాండ్ ఐల్యాండ్‌ వెళ్లి స్కూబా డైవింగ్ చేసి చేపలు, జలచరాలతో స్నేహం చేయచ్చు. ఉత్తర గోవా తీరాలలో వాటర్ స్కీయింగ్ మరియు పారాసైలింగ్ చేయవచ్చు. దూధ్‌సాగర్ జలపాతాలకు ట్రెక్కింగ్ చేయడంతో పాటు కొన్ని అద్భుతమైన ప్రాంతాలు సమీపంలో ఉన్నాయి.ఇలా ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు బతకవచ్చు. అలాంటి గోవాకు వెళ్లాలనుకున్న వారంతా ఇప్పుడీ వార్త చదవాల్సిందే. ఎందుకంటే.. గోవాలో కొత్త రూల్ పెట్టారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అదేంటంటే బీచ్ లో మద్యం తాగినా పబ్లిక్ గా వంట చేసినా రూ.2వేల ఫైన్ వేయాలని గోవా రాష్ట్ర సర్కారు డిసైడ్ అయ్యింది. ఈ కొత్త నిర్ణయాన్ని తాజాగా జరిగిన గోవా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.పర్యాటకులకు స్వర్గ ధామంగా అభివర్ణించే గోవాలో ఇటీవల కాలంలో వస్తున్న కొందరు టూరిస్టుల కారణంగా మిగిలిన పర్యాటకులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టే పనిలో భాగంగా ఆ రాష్ట్ర సర్కారు కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. పబ్లిక్ ప్రదేశాల్లో వంట చేసినా.. బీచుల్లో మందు తాగితే విధించే ఫైన్ కట్టని వారికి మూడు నెలల జైలుశిక్ష విధిస్తామని పర్యాటక శాఖా మంత్రి అజ్ గోంకర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే గోవా బీచుల్లో ఫుట్ పాత్ లపై మద్యం తాగటం బాటిళ్లు పగలకొట్టటం దుస్తులు లేకుండా పరుగులు తీయటం లాంటి పనుల్ని కూడా నిషేధించాలని కోరారు. అయితే వీటి మీద మాత్రం నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. గోవా గురించి అక్కడ చేసే ఎంజాయ్ మెంట్ గురించి అలాగే ఇప్పుడు అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.