మా వ్యాపారాలన్నీ కుటుంబ రావు అన్యాయంగా లాక్కున్నాడు:ప్రణయ్ పెదనాన్న

366

మిర్యాల‌గూడ‌లో ప్ర‌ణ‌య్ హ‌త్య‌కేసు త‌ర్వాత ఒక్కొక్క‌టిగా వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్ర‌ణ‌య్ హ‌త్య‌కు స్కెచ్ వేసిన గ్యాంగ్ మొత్తం పోలీసుల అదుపులో ఉన్నారు.. ఇక ఈ దారుణానికి పాల్ప‌డిన మారుతిరావుని వెంట‌నే ఉరి తీయాల‌ని అంద‌రూ కోరుతున్నారు.. ఈ స‌మ‌యంలో మారుతిరావు మిర్యాల‌గూడ‌లో చేసిన అన్యాయ‌లు అక్ర‌మాలు ఒక్కొక్క‌టి వెలుగులోకి వ‌స్తున్నాయి. 1983 లో కిరోసిన్ వ్యాపారంతో ప్రారంభం అయిన మారుతిరావు ప్ర‌స్ధానం, నేడు 100 కోట్ల రూపాయ‌లు సంపాదించే స్దితికి వెళ్లింది.. దీని వెనుక మారుతి రావు అనేక మోసాలు చేసి పైకి వ‌చ్చాడు అని అంటున్నారు, ఈ స‌మ‌యంలో మారుతిరావు గురించి పలు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు ప్ర‌ణ‌య్ పెద‌నాన్న.

Image result for pranay and amrutha

మారుతిరావు 40 ఏళ్ల నుంచి తెలుసు, ప్ర‌ణ‌య్, అమృత 9వ త‌ర‌గ‌తిలో ప్రేమించుకున్నారు, ఈ స‌మ‌యంలో మారుతిరావు న‌న్ను పిలిచి మీ త‌మ్ముడు కుమారుడు ఇలాంటి ప‌నిచేస్తున్నాడు, త‌న‌ని అదుపులో పెట్టుకోమ‌ని హెచ్చ‌రించాడు.. నేను ప్ర‌ణ‌య్ ని హెచ్చ‌రించాను, వాళ్ల అమ్మాయి జోలికి వెళ్ల‌ద్దు అని చెప్పాను, ఆ స‌మ‌యంలో నేను మారుతిరావుకి స‌పోర్ట్ చేశాను, వారికి ఒక్క కూతురు అని మేము కూడా వారి ఫ్యామిలీ జోలికి వ‌ద్దు అని మా ప్ర‌ణ‌య్ ని కంట్రోల్ లో పెట్టుకున్నాం, చిన్న‌త‌నంలో ఇలాంటి ప్రేమ‌లు వ‌ద్దు అని చెప్పాను, అయినా వారు ఇద్ద‌రూ వినిపించుకోలేదు.

Image result for pranay and amrutha

ఇక వీరు ఇద్ద‌రూ పెళ్లి చేసుకుని వ‌చ్చిన త‌ర్వాత మారుతిరావు క‌బురు పంపించారు, ఆయ‌న ఇంటికి వెళ్లాను, త‌న కుమార్తెను నా ఇంటికి పంపించ‌మ‌ని బ్ర‌తిమాలాడాడు, ఆ స‌మ‌యంలో ఆమెకు ఇంటికి వెళ్లిపోమ‌ని చెప్పినా, మా ఇద్ద‌రిని విడ‌గొట్ట‌ద్దు అని క‌న్నీరు పెట్టుకుంది.. నేను కూడా మీ అమ్మాయి రాను అంటోంది కావాలి అంటే మీరు, నాత‌మ్ముడి ఇంటికి వ‌చ్చి మీ అమ్మాయిని తీసుకువెళ్లండి, మేము అడ్డు రాము అని చెప్పాము, అయినా స‌రే ఆయ‌న దానికి ఒప్పుకోలేదు, త‌న‌ని తానుగా మీరు పంపించాలి అని కోరాడు, దీంతో మేము అమృత‌కు ఎంత చెప్పినా ఆమె విన‌లేదు, ఆయ‌న డ‌బ్బులు ఇస్తాను అన్నాడు, మా ద‌గ్గ‌ర లేని డ‌బ్బా అని మేము అస‌లు వ‌ద్దు అని చెప్పాము.. చివ‌ర‌కు పెద్ద మ‌నుషులు కూడా మాకు చెప్పారు మారుతిరావు ఎంత‌కైనా తెగిస్తాడు అని, చివ‌ర‌కు అలాగే మా ప్ర‌ణ‌య్ ని చంపేశాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మేము పుట్టుక‌తో బీద‌వాళ్లం కాదు, మేము రైతు కుటుంబం, మా త‌మ్ముళ్లు అంద‌రిని చ‌దివించి పెద్ద వారిని చేయించాను, ఉద్యోగాలు చేసుకుంటున్నారు నా సోద‌రులు, ప్ర‌ణ‌య్ హ‌త్య‌ మ‌మ్మ‌ల్ని క‌లిచి వేసింది అని క‌న్నీరు మున్నీరు అయ్యారు ప్ర‌ణ‌య్ పెద‌నాన్న‌, నేను పొలిటిక‌ల్ గా రైతుగా ఉన్నాను, మాకు 20 నుంచి 30 కోట్ల ఆస్తి ఉంది, మాది మంచి ఫ్యామిలీ మారుతిరావు పుట్టుక‌తో పోలిస్తే మాదే ధ‌నిక కుటుంబం త‌ర్వాత కోట్ల ఆస్తి సంపాదించాడు…ఇంటికి ఇంటికి తిరిగి కిర‌సనాయులు అమ్ముకున్నాడు, గ‌తంలో నా పేరు మీద ఉన్న‌రేష‌న్ షాపు తీసుకున్నాడు నాలుగేళ్లు ఆ షాపు న‌డుపుకున్నాడు, మావారి వ్యాపారాలు, స్ధ‌లాలు అన్యాయంగా క‌బ్జా తీసుకున్న దుర్మార్గుడు అని ఆయ‌న విమ‌ర్శించారు, చూశారుగా అత‌ని వ్య‌వ‌హారం ఎలాంటిదో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.