త‌ల్లిశ‌వం పై కూర్చుని అఘోరా పూజ‌లు భయపడిపోతున్న గ్రామ‌స్తులు.!

306

అఘోరాలు హిమాల‌యాల్లో శివుని నామ‌స్మ‌ర‌ణ చేస్తూ మంచు కొండ‌ల్లో ఉంటారు… హిమాల‌యా ప‌ర్వాతాల్లో ఉంటారు.. పెద్ద పెద్ద పూజ‌లు కుంభమేలాలు జ‌రిగే స‌మ‌యాల్లో మాత్ర‌మే వారి ద‌ర్శ‌నం ఉంటుంది.. ఇక కాశీ లాంటి పుణ్య‌క్షేత్రాల్లో వారు ఎక్కువ‌గా తిరుగుతూ ఉంటారు.. ఇదే అఘోరాల గురించి ఎవ‌రిని అడిగినా చెప్పేది.. తాంత్రిక శ‌క్తులు అనేక ప్ర‌య‌త్నాల‌తో వారి వ‌శం చేసుకుంటారు.. ఇక ఇలాంటి ఓ అఘోరా చేసిన ప‌ని ఇప్పుడు పెద్ద చ‌ర్చకు దారి తీసింది. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ ఇన్సిడెంట్ ఇప్పుడు పెను వార్త‌గా మారింది. ఇంత‌కీ ఈ అఘోరా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌ని ప‌నిని చేశాడు, మ‌రి ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

త‌మిళ‌నాడులోని తిరుచ్చూ జిల్లాలోని, తిరువంబిపూరు అకియ‌మంగ‌రంలో జై అఘోరా ఖాళీ దేవాల‌యం నిర్మించి పూజ‌లు చేస్తున్నాడు. ఈ నెల 10న వార్షికోత్స‌వం జ‌రుగ‌నుంది, కాని ఈ స‌మ‌యంలో అత‌ని త‌ల్లి అనారోగ్యంతో మృతిచెందింది. ఈ స‌మ‌యంలో ఆమె పై కూర్చుని తాంత్రిక పూజ‌లు చేశాడు, దీనికి అనేక మంది వ‌చ్చారు, మ‌ణికంఠ త‌ల్లి మేరి చ‌నిపోయిన వెంట‌నే ఆమెని ఊరిలో తిప్పి, స్మ‌శానంలోకి తీసుకువ‌చ్చి ప్ర‌త్యేకంగా పూజ‌లు చేశారు అత‌ని తల్లిశవంపై కూర్చుని పూజ‌లుచేసి గ‌ట్టిగా మంత్రాలు చ‌దివాడు ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌లో అఘోరాలు వ‌చ్చారు. అయితే ఇలా పూజ‌లు చేసిన స‌మ‌యంలో అనేక వీడియోలు తీసి అక్క‌డ వారు చూస్తూ ఉండిపోయారు ఓ రెండు గంట‌ల పాటు పూజ‌లుచేసిన త‌ర్వాత ఆమె అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు.

ఇలా తాంత్రిక పూజ‌లు చేయ‌డంతో గ్రామ‌స్తులు త‌మ‌కు ఎంతో భ‌యంగా ఉంది అన్నారు..త‌మ త‌ల్లి దేవుడి గురించి ఆత్మ‌త్యాగం చేసింది అని అందుకే ఇలా పూజ‌లు చేశాను అని చెబుతున్నాడు మ‌ణికంఠ‌. త‌మిళ‌నాడులోని ఈ మ‌ద్య కాలంలో ఇలా కొత్త గుడిల‌ను ఏర్పాటు చేసి ఇలా పూజ‌లు చేస్తున్నారు, దీనికి శిక్ష‌ణ పొందిన కొంద‌రు ఆయా దేవాల‌యాల్లో కొంత‌మంది అఘొరాల‌ను నియ‌మిస్తున్నారు. మ‌ణికంఠ కూడా ఇక్క‌డ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గుడులు నిర్మిస్తున్నారు అని అంటున్నారు. ఇలా నిర్మించిన ఓ ఆల‌యం వార్షికోత్స‌వ ఉన్న స‌మ‌యంలో ఆమె త‌ల్లి మ‌ర‌ణంతో ఇలా పెద్ద సంఖ్య‌లో పూజ‌లుచేశారు అని గ్రామ‌స్తులు చెబుతున్నారు. మ‌రి దీనిపై పోలీసులు విచార‌ణ చేస్తారు అని అంటున్నారు చూడాలి ఈ కేసు ఎటువంటి ఫ‌లితాన్ని ఇస్తుందో.