Breaking News:విలక్షణ నటుడుపై రేప్ కేస్ నమోదు..షాక్ లో సినీ ఇండస్ట్రీ

365

సినీ ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ అనేది పట్టిపీడిస్తోంది.అవకాశం కోసం వచ్చిన వారిని కామకుక్కలు వాడుకుంటున్న తీరు అందరిని బాధపెడుతోంది.అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.ఉద్యమం స్టార్ట్ అయ్యింది.విదేశాల్లో ప్రారంభమైన మీటూ ఉద్యమం ఇప్పుడు మనదేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.పలువురు సపోర్ట్ కూడా ఇవ్వడంతో ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్ళింది.పెద్ద మనుషుల ముసుగులో సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటీగా వెలుగులోకి వస్తున్నాయి.అమ్మాయిలు దైర్యం చేసుకుని వాళ్లకు ఎదురైనా అనుభవాలను పంచుకుంటున్నారు.ఇప్పుడు ఒక ప్రముఖ నటుడి మీద ఆరోపణలు రావడమే కాకుండా అతని మీద కేసు కూడా నమోదు అయ్యింది.మరి ఆ నటుడు ఎవరు అతని మీద కేసు వేసిన వాళ్ళు ఎవరు.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

‘మీటూ ఉద్యమం’లో భాగంగా సినిమాల్లో, టీవీ షోలలో సంస్కారవంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు అలోక్‌ నాథ్‌.. తనపై అత్యాచారం చేశాడంటూ నిర్మాత వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ విషయం గురించి పెద్ద వివాదమే చేలరేగింది. అలోక్‌ నాథ్‌ ఈ ఆరోపణలను ఖండిచడమే కాకా వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశారు. ఇలాంటి సమయం​లో అలోక్‌ నాథ్‌కి మరో భారీ షాక్‌ తగిలింది. నిర్మాత వింటా నందా ఫిర్యాదు మేరకు నటుడు అలోక్‌ నాథ్‌పై రేప్‌ కేస్‌ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఓషివారాకు చెందిన పోలీసులు అలోక్‌ మీద ఎఫ్‌ఐఆర్ బుక్ చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి మనోజ్ శర్మ వెల్లడించారు.

అయితే అలోక్‌ నాథ్‌కు వ్యతిరేకంగా వింటా నందా మీడియాతో మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ అతని భార్య గతంలో సెషన్‌ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫిటిషన్‌ను కూడా కోర్టు కొట్టేసింది. వింటా నందా ఆరోపణల తర్వాత, పలువురు మహిళలు అలోక్‌ తమను కూడా లైంగికంగా వేధించాడంటూ ఆరోపించారు. దాంతో అలోక్‌ నాథ్‌ వింటా నందాపై పరువు నష్టం దావా కూడా వేశాడు. లిఖితపూర్వక క్షమాపణతోపాటు పరిహారంగా రూ.1 ఇవ్వాలని గతంలో అలోక్ డిమాండ్ చేశాడు. అలోక్‌ నాథ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో సినీ, టీవీ ఆర్టిస్ట్‌ల సంఘం అతన్ని అసోసియేషన్ నుంచి బహిష్కరించింది. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ పంపిన నోటీసుపై కూడా అలోక్‌ స్పందించలేదు.విన్నారుగా మీటు ఉద్యమంలో భాగంగా ఇరుకున్న మరొక నటుడి వివరాలు.