కేరళ తరువాత ఈ 2 రాష్ట్రాలకు జలగండం, భారీ విధ్వంసం జరగనుంది.. హెచ్చరించిన శాస్త్రవేత్తలు

502

దేవ‌భూమి – టెంపుల్ సిటి- బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇలా ఏమి చెప్పినా కేర‌ళ గురించి త‌క్కువే.. ఈప్రాంతం ప్ర‌కృతి ప‌చ్చ‌ని పైరుగా ఉంటుంది.. కాని ఇప్పుడు ఈ సీన్ రివ‌ర్స్ అయింది. ఇక్క‌డ వ‌ర‌ద‌లు ఈ ప్రాంతాన్ని అత‌లాకుతలం చేశాయి…ప్ర‌కృతితో నెల‌వైన అందాల భువి సీమ, ఇప్పుడు క‌కావిక‌లం అయింది.. ప‌చ్చ‌టి ముగ్ద‌మ‌నోహ‌ర‌మైన అందాల‌ను కోల్పోయింది ఈ ప్రాంతం… కేర‌ళ‌లో 185 అంద‌మైన ప్ర‌కృతి ప్రాంతాలు క‌లిగి దేశంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ గా ఉంది.. కాని ఇందులో ఇప్పుడు 80 ప్రాంతాలు దారుణంగా దెబ్బ‌తిన్నాయి… ఇక్క‌డకేర‌ళ త‌ర్వాత మ‌రో రెండు ప్రాంతాల‌కు ఇలా ముప్పు పొంచి ఉంది. ఆ ముంపు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for water flood

ప్ర‌తీ ఏడాది ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు విప‌త్తుల గురించి హెచ్చ‌రిక‌లు చేస్తూ ఉంటారు …హెక్టార్ల కొల‌దీ భూమిని అభివృద్ది పేరుతో తొలిచేస్తున్నారు.. ముఖ్యంగా ప‌ర్యాట‌క సీమ ను మ‌రింత అందంగా తీర్చిదిద్దేందుకు చేయాల్సిందిపోయి.. క‌మ‌ర్షియ‌ల్ భావ‌న‌లో ప్ర‌భుత్వం కూడా ఇక్క‌డ కొండ‌ల‌ను తొల‌చి పెద్ద పెద్ద నిర్మాణాలు చేప‌ట్టింది…ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ ఇటువంటి నిర్మాణాలు క‌ట్ట‌డాలు వ‌ద్దు అనిచెప్పినా ఇక్క‌డ ప్ర‌భుత్వాలు ముందుకువెళ్లాయి. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న త‌న మాట‌ల‌ని చెబుతున్నారు వింటే దేశానికి మంచిది అని చెబుతున్నారు మ‌రి దేశంలో కేర‌ళ త‌ర్వాత ఈ ప్రాంతాలు కూడా ఇటువంటి ప‌రిస్దితిని ఎదుర్కొంటాయి అని చెబుతున్నారు.

Image result for earthquake

మహారాష్ట్ర, గోవాల్లో కూడా కేరళ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరించారు. పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణపై 2011లో తాను సమర్పించిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే ఆ రెండు రాష్ట్రాలకు ముప్పు తప్పదన్నారు. కేరళ, మహారాష్ట్ర, గోవాల్లో వర్షపాత తీవ్రత మధ్య వ్యత్యాసం ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాల కారణంగా పర్యావరణ ముప్పు మాత్రం ఒకే విధంగా ఉంటుంది…అని గాడ్గిల్ పేర్కొన్నారు. కేరళలో కురినట్టు భారీ వర్షాలు కురవకపోయినప్పటికీ… వరదలు ముంచెత్తడంతో పాటు, 2014లో పుణే జిల్లాలో జరిగిన విధంగా కొండచరియలు విరిగిపడే అవకాశాలున్నాయన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్ జిల్లాల్లో పర్యావరణ పరంగా చాలా సమస్యలున్నాయి.. వీటిపై క్షేత్రస్థాయిలో గ్రామగ్రామాన చర్చలు జరగాలి. అక్రమ క్వారీలు, నిర్మాణాల వంటి మానవ తప్పిదాల కారణంగానే కేరళలో కల్లోల పరిస్థితి తలెత్తింది అని గాడ్గిల్ వివరించారు. కాగా గోవా పర్యావరణంపైనా గాడ్గిల్ విస్తృత అధ్యయనం చేశారు. ముడి ఇనుము కంపెనీలు తమ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ)లో సమర్పించిన డేటా ఆధారంగా ఆయన 2011లో నివేదిక రూపొందించారు. తవ్వకాల వల్ల తలెత్తే జల సంబంధమైన ప్రభావాలు ఎంతో తీవ్రంగా ఉంటాయి. ఇక ఆయ‌న చెప్పిన విధంగా ఆ రెండు రాష్ట్రాలు కూడాకేర‌ళ‌ను చూసి చాలా భ‌య‌ప‌డుతున్నాయి.

Image result for earthquake

మహారాష్ట్ర గోవా ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే అధికారుల‌తో మైనింగ్ కు సంబంధించి, అడ‌వుల న‌రికివేత‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెప్పించుకున్నారట ఇక ఎక్క‌డైతే మైనింగ్ అతిగా జ‌రిగిందో, అక్క‌డ ఇక నిలుపుద‌ల చేసే యోచ‌న‌లో ప్ర‌భుత్వాలు ఉన్నాయి అని తెలుస్తోంది.. ఆయ‌న తాజాగా చెప్పిన వాస్త‌వాలు ఇప్పుడు కాక‌పోయినా మ‌రో సంవ‌త్స‌రం అయినా ముంచ‌డం ఖాయం అని, ఆప్ర‌భుత్వాలు మేల్కొన్నాయి.. మ‌రి మీరేమంటారు ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చ‌రిక‌ల‌పై మీ కామెంట్ల‌ను అభిప్రాయాలుగా తెలియ‌చేయండి.