హైదరాబాద్‌లో మరో మారుతీరావు! కూతురు, ప్రియుడిపై దాడి

390

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన రెండు తెలుగు రాష్టాల్లో సంచలనం స్పృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు. ప్రణయ్ హత్య మరిచిపోకముందే హైదరాబాదులో అలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి కూతురు, ఆమె ప్రియుడి పైన దాడి చేశారు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

సందీప్, మాధవిలపై దాడి, యువతి పరిస్థితి విషమం

హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ సమీపంలో నివసించే సందీప్ (నవదీప్), మాధవిలు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.ఈ మధ్యనే వీరి వ్యవహారం ఇంట్లో తెలిసిపోయింది.అతనితో పెళ్లి చెయ్యడం నాకిష్టం లేదని అమ్మాయి తండ్రి చెప్పాడు.ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది.సందీప్ మాధవి ఇద్దరు కలిసిరోడ్డు మీద వెళ్తుండగా ఒక వ్యక్తి వచ్చి సందీప్ మాధవి మీద కత్తితో దాడి చేశారు.ఆ దాడిలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. యువతి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.దాడి చేసిన అనంతరం పారిపోతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకునే ప్రయత్నించారు. కానీ, అతడు తప్పించుకొని పరారయ్యాడు.అతనెవరో పసిగట్టడం కష్టం అవుతుంది.దాడి చేసింది తండ్రా లేక ఇతరులా కచ్చితంగా తెలియాల్సి ఉందని చెబుతున్నారు.

అయిదేళ్లుగా ప్రేమించుకొని, పెళ్లి

మాధవీ, నవదీప్ ఇటీవలే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కులాంతర వివాహం కావడంతో ఈ పెళ్లి మాధవి తల్లిదండ్రులకు ఇష్టంలేదని నవదీప్ సోదరుడు చెబుతున్నాడు. అతడే ఈ దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నాడు. నవదీప్ ఎస్సీ వర్గానికి చెందినట్లుగా తెలుస్తోంది. మాధవిని ఆమె మేనబావకు ఇచ్చి వివాహం చేయాలని తండ్రి భావించాడని, కానీ ఆమె నవదీప్‌తో అయిదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది..ప్రేమ వ్యవహారం మీద అమ్మాయి తండ్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా..లేక వేరే ఎవరైనా వేరే కారణం వలన చంపాలని చూశారా అన్న విషయం తెలియాల్సి ఉంది. వారిపై దాడి జరగగానే దగ్గరలో ఉన్న ప్రయివేటు ఆసుపత్రి నీలిమ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వారికి చికిత్స జరుగుతోంది.ఘటనాస్థలికి చేరుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. యువతీ, యువకుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాడి వెనక ప్రేమ వ్యవహారమే కారణమా? కన్నవాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకోవడం వల్లే యువతిపై దాడి జరిగిందా తెలియాల్సి ఉంది. దాడి చేసింది యువతి తండ్రి చేసినట్లుగా ప్రచారం సాగుతున్నప్పటికీ పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.మిర్యాలగూడ ఘటన మరవకముందే మరో సంచలనం చోటు చేసుకోవడం కలకలం రేపింది.చూడాలి మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ ప్రేమికులను అమ్మాయి తండ్రి చంపాలనుకున్నాడా..లేక వేరే కారణం అయ్యి ఉంటుందా..అలాగే ఇలా వరుసగా ప్రేమికుల మీద జరుగుతున్న దాడుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.