భార్యను బ్రతికించుకోడానికి భుజంపై మోస్తూ 3కి మీ ప్రయాణం చివరికి ఎంత దారుణం జ‌రిగిందంటే.!

344

ఒరిస్సాలో కాడి క‌ట్టి త‌న భార్య శ‌వాన్ని 30 కిలోమీట‌ర్లు త‌న ఇంటికి తీసుకువెళ్లిన ఘ‌ట‌న ఇప్ప‌టికీ దేశంలో ఓ పెను సంచ‌ల‌న‌మే అని చెప్పాలి ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత ప్ర‌భుత్వాలు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.. పేద ప్ర‌జ‌ల‌కు ఎటువంటి స‌దుపాయాలు అంద‌చేస్తున్నాయి అనే దానిపై అంద‌రిలో ఆలోచ‌న వ‌చ్చింది. తాజాగా ఇలాంటి ఓ దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగింది.అది మ‌న తెలుగు రాష్ట్రాల్లో, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమినిలో ఒక ఘటన జరిగింది . అసలు వివరాల్లోకి వెలితే ఈ గ్రామానికి చెందిన రథయోడ్ రామ్ పుష్ప వీరిద్దరూ భార్యాభర్తలు ఒక వ్యవసాయ భూమిని తీసుకుని ఐదు ఎకరాలు పత్తి పట్టాను సాగు చేస్తారు.

అకాల వ‌ర్షాల‌తో వీరి పంట చేతికి రాకుండా పోయింది, ఈవ‌ర్షానికి పంట పూర్తిగా నాశనం అవటం తో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కలత చెందారు. తన భార్య అప్పులు ఎలా తీరుతాయి అని చాల బాధపడుతూ ఏమి చేయాలో అర్ధం కాకా ఇంట్లో వున్న పురుగుల మందు తాగింది. తన భార్యను కాపాడుకోవాలి అని హాస్పిటల్ కు తీసుకెళ్దాం అంటే ఎటు చుసిన చుట్టూ చెట్లు అడవి తప్ప ఏమి కనబడలేదు అతనికి ఎవరు సాయం చేయడానికి లేరు దాంతో తన భార్య ను తన బుజాల పైన 3km మోసుకొని వెళ్ళాడు . అంతే కాదు దారిలో చెరువు అడ్డు వచ్చిన అలాగే తిసుకేలడు కానీ అక్కడ వున్న హాస్పిటల్ వారు మల్లి వేరే హాస్పిటల్ కు మార్చారు.

ఇలా మార్గమధ్యలోనే తన భార్య చనిపోయింది. తాను ఇంత అలా కస్టపడి తన భార్యను కాపాడుకోవాలని చాలా దూరం నడచి తన భార్య భుజాలపై 3km మోసుకొని వెళ్లినా త‌న భార్య ద‌క్క‌లేదు అని కంటినిండా నీరు తెచ్చుకున్నాడు ఆ వ్య‌క్తి, కానీ చివరకు ఆ దేవుడు మాత్రము కరుణించక చివరి క్షణం లో కూడా కాపాడుకోలేక‌పోయాము అని బాధ‌ప‌డ్డాడు. ముఖ్యంగా ఇలాంటి దారుణ‌మైన స్దితి రావ‌డానికి ఏజెన్సీ అలాగే అటవీ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ది లేక‌పోవ‌డం వారికి కనీస ఆస్ప‌త్రి సౌక‌ర్యాలు కూడా లేక‌పోవ‌డం అని చెబుతున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు.ఇలాంటి ప‌రిస్దితుల్లో తాము దుర్బ‌ర జీవితం అనుభ‌విస్తున్నామని చెబుతున్నారు ఇలాంటి దారుణాలు మ‌రిన్ని జ‌రుగ‌కుండా మాలాంటి దుస్తిది ఎవ‌రికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని కోరుతున్నారు, మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి, చూశారుగా ఇలాంటి దారుణాలు జ‌రుగుకుండా ముందే జాగ్ర‌త్త వ‌హించేలా మీ ద‌గ్గ‌ర్లో ప్రాంతాల‌లో వారికి ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా వారిని అల‌ర్ట్ చేయండి.