నిత్యానంద‌తో న‌టి రంజిత జంప్ ఎక్క‌డికో తెలిస్తే షాక్ అవుతారు

478

నిత్యానంద పేరు చెబితే… ఆయన రాసలీలలు గురించి చటుక్కున గుర్తుకు వస్తాయి. అలాంటి నిత్యానంద గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన భారతదేశం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు రాసలీలల వివాదంలో చిక్కుకున్న నటి కూడా కనిపించడం లేదని సమాచారం. దీనితో ఇద్దరూ కలిసి ఎస్కేప్ అయినట్లు చెప్పుకుంటున్నారు. కేమన్ దీవుల్లో రాజకీయ ఆశ్రయం కోరారనీ, గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి పలాయనం చిత్తగించినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా నిత్యానంద సినీ నటితో కలిసి రాసలీలల్లో పాల్గొన్నట్లు ఆమధ్య నెట్లో ఓ వీడియో హల్చల్ చేసింది. ఐతే అందులో వున్నది తను కాదని నిత్యానంద కొట్టిపారేశారు.

Image result for nithyananda

మరోవైపు ఇటీవలే పలు ఆధ్యాత్మిక క్షేత్రాల్లో నిత్యానంద కనబడుతూ వచ్చారు. కానీ కొన్ని రోజులుగా ఆయన ఆచూకి లేకుండా పోయింది. బెంగళూరులో వున్న ఆయన ఆశ్రమంలో నిత్యానంద ఆచూకి గురించి అడిగితే… గురువుగారు ఉత్తరాది పర్యటనకు వెళ్లారంటూ సమాధానం వస్తోంది. కాని కొన్ని మీడియాలు అస‌లు నిత్యానంద ఇక్క‌డ ఉన్నారా, లేదా మ‌రే లీల‌ల్లో అయినా ఉన్నారా అనేది కూడా చూస్తున్నారు. ఇక లీల‌ల స్వామిగా ఆయన‌కు పేరు ఉంది. ఇక నిత్యానంద ఇలాంటి వివాదంలో చిక్కుకోక‌ముందు ఆయ‌న ఆశ్ర‌మానికి వేలాది మంది జనం వ‌చ్చేవారు, ఈయ‌న మాట‌ల‌కు ఎంద‌రో ఆక‌ర్షితులు అయ్యారు .ఇక కోట్ల రూపాయ‌ల డ‌బ్బులు కూడానిత్యానంద ట్ర‌స్ట్ పేరు మీద ఉన్నాయి అని తెలుస్తోంది …కాని ఆయ‌న రాస‌లీల‌ల టేప్ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న ప‌త్తాలేకుండా పోయారు. ఆయ‌న గ‌తంలో తిరుమ‌ల వెళ్లిన స‌మ‌యంలో కూడా అస‌లు స్వామీజీ అని కూడా అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు, ఇక ఆమెకు త‌న‌కు ఎటువంటి సంబంధం లేదు.

త‌న‌ని కొంత‌మంది డ‌బ్బులు అడిగారు. తాను ఇవ్వ‌ను అనేస‌రికి ఇటువంటి చెత్త‌ప‌ని చేశారు అని ఆయ‌న అన్నారు. ఐతే నిత్యానంద దేశం విడిచి పెట్టి వెళ్లే అవకాశమే లేదని పోలీసులు చెపుతున్నారు. మరి ఆయన దేశం వదిలి పారిపోయాడా లేదంటే ఉత్తరాదిలోనే వున్నారా… మ‌రెక్క‌డైనా ఉన్నారా అనేది వేచి చూడాల్సిందే.. ఇక ఆ న‌టి కూడా క‌నిపించ‌కపోవ‌డంతో ఇది మ‌రింత ఆలోచ‌న‌కు దారితీస్తుంది, నిత్యానంద క‌నిపించ‌డం లేదు అంటూ సోష‌ల్ మీడియాలో కూడా పోస్టులు వ‌స్తున్నాయి. మ‌రి ఆయ‌న ఎక్క‌డ ఉన్నారు అని మీరు భావిస్తున్నారు కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.