షూటింగ్ లో అక్కడ గట్టిగా నొక్కాడు…బరించలేక దర్శకుడి చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్ ..చివరికి ఏం చేసిందో తెలిస్తే షాక్

465

సమాజములో స్త్రీ ప్రతిచోట లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉంది.అయితే సినిమా ఇండస్రీలో ఈ వేధింపుల ఘటనలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.ఈ మధ్య మీ టూ ఉద్యమం ఒకటి స్టార్ట్ అయ్యింది.చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల విషయాలను సమాజానికి తెలియజేస్తున్నారు.పెద్ద పెద్ద వ్యక్తుల గురించి చెప్పడంతో ఈ ఉద్యమం తారాస్థాయికి చేరింది.అయితే ఇప్పుడు ఈ విషయం మీద ఒక దర్శకుడి చెంపను పగలగొట్టింది ఒక ప్రముఖ నటి.అంతేకాకుండా దానిని సోషల్ మీడియాలో పెట్టింది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ బాలీవుడ్‌ దర్శకుడి చెంప చెళ్లుమనిపించింది సినీ నటి గీతిక త్యాగి. బాలీవుడ్‌లో వచ్చిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ దర్శకుడు సుభాష్‌ కపూర్‌ తనను లైంగికంగా వేధించాడని గీతిక ఆరోపిస్తున్నారు. సుభాష్‌కు ఎడమ చేయి లేదు. అయినప్పటికీ ప్రతిభతో మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు తీస్తారని బాలీవుడ్‌లో అతనికి పేరుంది. కానీ సుభాష్‌ నిజ స్వరూపం ఇది అంటూ ఆయనకు సంబంధించిన ఓ వీడియోను గీతిక ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. సుభాష్‌ ఎలాంటివాడో చెప్పడానికి గీతిక అతన్ని, అతని భార్య డింపుల్‌ను ఓ స్టూడియోకు రమ్మన్నారు.ఆ సమయంలో సుభాష్‌ తన భార్యకు జరిగినదంతా చెబుతూ తన తప్పేంలేదని సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు వీడియోలో కన్పించారు. సుభాష్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ గీతిక ఏడ్చారు. భార్య పక్కనుండగానే గీతిక అతని చెంపపై కొట్టారు. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవడంతో బయటకు వచ్చింది. సుభాష్‌ తన భార్య ముందు ఏదో చెబుతున్న వీడియోను గీతిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

అయితే గీతిక పోస్ట్‌ చేసిన వీడియోలో సుభాష్‌ను తిడుతున్నట్లు మాత్రమే ఉంది. అతన్ని కొట్టిన దృశ్యాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. కానీ ఆ దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అవడంతో బయటికి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.ఈ ఆరోపణలు బయటికి రావడంతో సుభాష్‌ కపూర్‌తో దర్శకత్వం వహిస్తున్న ‘మొఘల్’ సినిమా నుంచి ఆమిర్ ఖాన్‌ తప్పుకొన్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్ర నిర్మాత భూషణ్‌ కుమార్‌ సుభాష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారట.చూడాలి మరి ఇతని వ్యవహారం ఎంతదూరం వెళ్తుందో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు .