పాక్ గుట్టురట్టు చేసిన అభినందన్

229

బుధవారం ఉదయం పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ గగనతలంలోకి వెళ్లిన భారత యుద్ధవిమానంను కూల్చామని పాక్ చెప్పింది. ఆ సమయంలో భారతవాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ పైలట్ అభినందన్‌ను కస్టడీలోకి తీసుకుంది. అయితే తాను పాక్ భూభాగంలో పడిపోయినట్లు గ్రహించిన అభినందన్ వర్ధమాన్ ఏమి చేశాడు… తప్పించుకునేందుకు ప్రయత్నించాడా..?

Image result for abhinandan

భారత్ పాక్‌ల మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. మంగళవారం భారత్ పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై వైమానికదాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ బుధవారం సరిహద్దులు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించి దాడులకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే భారత వాయుసేన దాడులను తిప్పికొట్టడంతో పాక్ యుద్ధవిమానాలు తోకముడిచాయి. అయితే దాడులను తిప్పికొడుతున్న క్రమంలో భారత యుద్ధవిమానం దురదృష్టవశాత్తు పాక్ దాడుల్లో కూలింది. ఇందులో ఉన్న పైలట్ అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా కిందకు దిగారు. కానీ తాను పాక్ భూభాగంలో దిగినట్లు గ్రహించిన వెంటనే అక్కడి స్థానికుల నుంచి తప్పించుకునే క్రమంలో అతని దగ్గర ఉన్న తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు శత్రువులకు తన దగ్గర ఉన్న ఆధారాలు ఏమీ దొరక్కూడదన్న ఆలోచనతో ఆ డాక్యుమెంట్లను మింగేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక యుద్ధఖైదీగా పట్టుబడ్డ అభినందన్ వర్ధమాన్ ఆయన నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు పాక్ మీడియా డాన్ కథనాలను ప్రచురించింది.

Image result for abhinandan

యుద్ద ఖైదీగా పట్టుబడితే వారు ఎలా నడుచుకోవాలో అనేదానిపై ముందుగానే వారికి కొన్ని సూచనలు చేయడం జరుగుతుంది. అభినందన్ విషయంలో కూడా ఆయన ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక పాక్ విడుదల చేసిన వీడియోలో అభినందన్‌ను ప్రశ్నిస్తున్న సమయంలో ఎక్కడే కానీ ఆయన ఎలాంటి యుద్ధ విమానం నడిపాడో, అతని నివాసం ఎక్కడో లాంటి విషయాలపై పాక్ అధికారులు గుచ్చి గుచ్చి అడిగినా వాటిని వెల్లడించలేదు. తన దేశానికి సంబంధించిన విషయాలను బయటపెట్టలేదు.ఇక పాక్ మీడియా ప్రచురించిన కథనాల ప్రకారం ముందుగా అభినందన్ దగ్గరకు వెళ్లింది అక్కడి స్థానికులు అని తెలుస్తోంది. ఇక స్థానికులు అభినందన్‌ను పట్టుకోగానే తను పాకిస్తాన్‌లో ఉన్నానా లేక భారత్‌లో ఉన్నానా అని వారిని అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్న అడగగానే అక్కడికి గుమికూడిన యువత తాను భారత్‌లోనే ఉన్నట్లు ముందుగా చెప్పినట్లు పాక్ మీడియా తన కథనంలో ప్రచురించింది. అయితే అక్కడి యువత కొన్ని నినాదాలు చేస్తుండటం విన్న అభినందన్…. భారత్ అయితే ఏప్రాంతంలో ఉన్నామో చెప్పాల్సిందిగా స్థానికులను కోరాడట. దీనికి సమాధానంగా ఖిల్లాన్ అని అదే వ్యక్తి సమాధానం చెప్పడంతో ప్రస్తుతం తను గాయపడి ఉన్నట్లు తాగేందుకు మంచినీరు ఇవ్వాలని కోరినట్లు కథనంలో పేర్కొంది. ఇంకా నమ్మకం కుదరకపోవడంతో అభినందన్ భారత్‌కు అనుకూలంగా కొన్ని నినాదాలు చేయడంతో వెంటనే అక్కడి స్థానికులు పాక్ ఆర్మీకి అనుకూలంగా నినాదాలు చేసినట్లు కథనం పేర్కొంది.

ఇక తాను పాక్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత తన వద్ద ఉన్న పిస్తోలుతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్కడి పాక్ స్థానిక యువత రాళ్లు పట్టుకుంది. వారి నుంచి తప్పించుకునేందుకు వారిపై గన్ ఎక్కుబెట్టి ఒక అరకిలోమీటర్ వరకు అభినందన్ పరిగెత్తాడు. ఆ తర్వాత చిన్న కుంటలోకి ఆయన దూకినట్లు కథనంలో వెల్లడించింది. కుంటలోకి దూకిన వెంటనే అభినందన్ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను, మ్యాపులను, కొన్ని మింగి మరికొన్ని నీటిలో పడేశాడు. ఇక ఒక స్థానికుడు ఓ తుపాకీతో వచ్చి అభినందన్ దగ్గర ఉన్న తుపాకీని తమకు ఇచ్చేయాల్సిందిగా కోరాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి అభినందన్ కాలికి తూటా పేల్చాడు. అయితే తను బయటకు వస్తానని తనను చంపరాదని అభినందన్ మాటతీసుకున్నాడు. ఇక నీటి కుంట నుంచి బయటకు వచ్చాక యువత పట్టుకుని స్థానిక ఆర్మీకి అప్పగించింది. అయితే పాక్ విడుదల చేసిన వీడియోలో అభినందన్‌పై యువత దాడి చేస్తున్నట్లుగా ఉంది. వారు దాడి చేయడంతోనే ఆయన ముఖం తీవ్ర రక్తస్రావానికి గురైంది. జెనీవా ఒప్పందాన్ని తుంగలో తొక్కినా పాక్ ను ప్రపంచ దేశాల మధ్య దోషిగా నిలబెట్టింది. అయితే మరొక వీడియో ద్వారా పాక్ అభినందన్ ను క్షేమంగా చుస్కుంటున్నామని అందరికి తెలిసేలా మరొక వీడియోను విడుదల చేసింది.అయినా కానీ పాక్ మీద ట్రోల్స్ రావడం ఆగలేదు. దాంతో ఇక ఆపేద్దామని పాక్ ప్రధాని కోరాడు.ఇంతకూ అంతలా అభినందన్ ఏం చేశాడా అని అనుకుంటున్నారా..చెబుతాను వినండి. మీరు పాక్ ఆర్మీకి చెందిన స్పోక్ పర్సన్ ఇంటర్వ్యను గమనిస్తే మేము కేవలం JF17 యుద్ధ విమానాలను మాత్రమే వాడమని చెప్పారు.F16 ఉపయోగించారా అన్న ప్రశ్నకు లేదు అని బదులిచ్చాడు.అలా ఎందుకు చెప్పాడో తెలుసా..

Image result for abhinandan

F 16 యుద్ధ విమానాలు అమెరికా తయారుచేసినవి. పాక్ లో ఆఫ్గనిస్తాన్ లో చెలరేగిపోతున్న తాలిబన్లను చెక్ పెట్టడానికి పాక్ కు ఇచ్చింది.ఒప్పందం ప్రకారం వీటిని తాలిబన్ల మీద తప్పా మరెవరి మీద వాడకూడదని స్పష్టంగా రాసి ఉంది.కానీ ఇప్పుడు అభినందన్ దెబ్బకు పాక్ బండారం మొత్తం బయటపడింది. F16 సంబందించిన శకలాలు భారత్ భూభాగంలో పడిపోయాయి.దాంతో ఆ శకలాలను ఇంటర్నేషనల్ మీడియా ముందు పెట్టేశారు.దాంతో అబద్దాలు ఆడిన పాక్ గుట్టురట్టయింది.దీంతో అమెరికా అధ్యక్షుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఫోన్ చేసిన మొట్టికాయలు వేశాడు.అంతేకాదు త్వరలో భారతీయులకు ఒక గుడ్ న్యూస్ వస్తుందని జోస్యం చెప్పాడు.ట్రంప్ చెప్పిన కొద్దినిమిషాలకే అభినందన్ ను విడుదల చేస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.మొత్తానికి అభినందన్‌ను శుక్రవారం రోజున అంటే ఈరోజు అభినందన్ ను భారత్ కు అప్పగిస్తామని పాక్ అధ్యక్షుడు ప్రకటించాడు. దీంతో భారతావనిలో ఆనందోత్సవాలు అంబరాన్ని అంతటి. అభినందన్ రాకకోసం భారతీయులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి అభినందన్ పాక్ కు దొరికినప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన ఈ పరిస్థితుల గురించి పాక్ కు చిక్కిన కూడా గుండెధైర్యంతో ఉన్న అభినందన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.