ఈరోజు అభినందన్ పెళ్లిరోజు… భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ప్రపంచమే షాక్..

469

అభినందన్ వర్ధమాన్.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ భారత వాయుసేన వింగ్ కమాండర్‌ ధైర్యసాహసాలకు అందరూ ఫిదా అయ్యారు.. ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. దేశం మొత్తం అభినందన్‌ శత్రు దేశానికి బందీగా చిక్కినా గుండె నిబ్బరంతో ప్రతి భారతీయుడు తల ఎత్తుకునేలా హుందాతనాన్ని ప్రదర్శించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అభినందన్ మిలిటరీ హాస్పిటల్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.వైద్యుల పర్యవేక్షణలో అభినందన్‌కు పరీక్షలు నిర్వహించి.. చిన్న, చిన్న గాయాలైనట్లు తేల్చారు. స్థానికులు దాడి చేయడంతో ఈ గాయాలు తగిలాయంటున్నారు. మరికొన్ని రోజులు ఆయనకు విశ్రాంతి అవసరమంటున్నారు డాక్టర్లు.

Image result for abhinandan family

వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెబుతుంటే.. అభినందన్ మాత్రం ఆదివారం తన మనసులో మాట బయటపెట్టారు. తనను త్వరగా పంపిస్తే తిరిగి విధుల్లో చేరతానన్నారట. ఈ విషయాన్ని భారతవాయుసేన అధికారులు తెలిపారు. అభినందన్ చెప్పిన ఈ మాట విని అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. మళ్లీ ఉరకలేసే ఉత్సాహంతో విమానం నడిపేందుకు సిద్ధమైన వింగ్ కమాండర్‌ను ప్రశంసిస్తున్నారు. అయితే మీకొక విషయం తెలుసా.. ఈరోజు కమాండర్ అభినందన్ పెళ్లిరోజు..ఢిల్లీలోని విశ్రాంతి గృహంలోనే అభినందన్ తన పెళ్లిరోజును సెలెబ్రేట్ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కూడా అక్కడికే రావడంతో ఎంతో సంతోషంగా గడిపాడు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే సెలెబ్రేషన్ సమయంలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు జరిగాయి. పెళ్లి రోజు కాబట్టి అభినందన్ భార్య అతని కోసం ఒక కానుకను తీసుకెళ్లింది. ఆ కానుక చూసి అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ అధికారులు అందరు సెల్యూట్ చేశారంట.ఇంతకూ అభినందన్ భార్య ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా…ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన గిఫ్ట్ అది. దేశభక్తిని చాటేలా ఉందంట ఆ గిఫ్ట్.మూడు రంగుల జెండాతో పాటు ఎయిర్ ఫోర్స్ సత్తా తెలిసేలా ఆ గిఫ్ట్ ను డిజైన్ చేయించింది అభినందన్ భార్య. ఆ గిఫ్ట్ చుసిన మిగతా ఆఫీసర్స్ దేశం కోసం పోరాడుతున్న మాలోనే కాదు మమ్మల్ని పెళ్లి చేసుకున్న వాళ్లకు కూడా మీలాగే దేశభక్తి మెండుగా ఉండాలని చెప్పారంట.ఆ మాటలకు అభినందన్ పొంగిపోయాడు. ప్రేమతో భార్యను కౌగించుకుని పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాడు.ఇలా అక్కడ కొంత భావోద్వేగం చోటుచేసుకుంది.మరి అభినందన్ భార్య గురించి అలాగే పెళ్లిరోజు కానుకగా దేశభక్తిని చాటే గిఫ్ట్ ఇవ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.