అభినందన్ బయోపిక్..రంగం సిద్దం ఆ పాత్రపోషించేది ఎవ‌రో తెలిస్తే మైండ్ బ్లాంక్

210

ప్రస్తుతం మ‌న దేశంలో ఎక్క‌డ చూసినా బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. రాజ‌కీయ నాయ‌కులు సినీ దిగ్గ‌జాలు బ‌యోపిక్ లు వారి వార‌సులు వారిపై అభిమానం ఉన్న వారు తీస్తున్నారు.. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో పలు బయోపిక్ సినిమాలు వచ్చాయి. త్వరలో మరిన్ని బయోపిక్ సినిమాలు రాబోతున్నాయి. ప్రముఖుల జీవితాల‌కి సంబంధించి తెర‌కెక్కిన చిత్రాల‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో బ‌యోపిక్‌ల‌కి బ్రేక్ ప‌డ‌డం లేదు. తమిళంలో స్వర్గీయ జయలలిత జీవిత కథ ఆధారంగా వరుసగా నాలుగు బయోపిక్ లు రాబోతున్నాయి. తాజాగా ఇప్పుడు అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ జీవిత చ‌రిత్ర‌ని వెండితెర‌పై చూపించే దిశ‌గా బాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అవును రీల్ హీరోల కంటే రియ‌ల్ హీరోల జీవితాల‌ను ఓ సినిమాగా తీయాలి అని భావిస్తున్నారు.

Image result for abhinandan

అభినందన్ వర్ధమాన్..భారత్ లో ఇప్పుడొక రియల్ హీరో! శత్రు సైన్యానికి చిక్కినాగానీ అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించి దేశ రక్షణ రహస్యాలను కాపాడిన ధీరుడు ఈ భారత వాయుసేన వింగ్ కమాండర్. పాక్ సైన్యం కస్టడీలో దాదాపు రెండున్నర రోజులు గడిపినా చెదరని స్థయిర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్ ఆక్రమిత ప్రాంతంపై దాడి జరిపి మూడు వందల మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. దాంతో ప్రతీకారంతో పాక్ భారత భూభాగంపై వైమానిక దళాన్ని పంపించింది. వాటిని నిలువరించేందుకు పాకిస్థాన్ ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.

ఈ క్రింది వీడియో చూడండి 

అనుకోకుండా ఆయ‌న పాక్ ఆర్మీకి చిక్క‌డం, దాదాపు 60 గంట‌లు వారి అధీనంలో ఉండ‌డం, ఆ స‌మ‌యంలో ఏ మాత్రం చ‌లించకుండా ఎంతో ధైర్యంగా ఉండ‌డం ప్ర‌తి ఒక్క భార‌తీయుడి హృద‌యాన్ని క‌దిలించి వేసింది. మార్చి 1 రాత్రి 9.20ని.ల‌కి భార‌త భూభాగంలోకి అభినందన్ అడుగుపెట్టిన త‌ర్వాత భారతీయు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్ర‌మంలోనే ఆ ధీరుడి జీవిత చరిత్రను తెరకెక్కించాలని బాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇక అభినంద‌న్ పాత్ర‌లో ఏ హీరో అయితే బాగుంటుంద‌నే చ‌ర్చ న‌డుస్తుండ‌గా, ఇటీవ‌ల జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో అభినంద‌న్ పాత్ర పోషించేందుకు మీరు సిద్ధ‌మా అని జాన్ అబ్ర‌హం అని ఓ విలేక‌రి ప్ర‌శ్నించారు. అభినంద‌న్ మ‌న దేశ రియ‌ల్ హీరో, ఆయ‌న జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం. ఆఫ్‌స్క్రీన్‌పైన అభినంద‌న్ పాత్ర‌లో న‌టించే ఛాన్స్ వ‌స్తే త‌ప్ప‌క న‌టిస్తాన‌ని జాన్ అబ్ర‌హం అన్నాడు. ఇక ఈ బ‌యోపిక్ కూడా స్టార్ట్ అవ్వ‌డానికి పెద్ద స‌మ‌యం తీసుకోరు అని బీటౌన్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి బాలీవుడ్ క్రేజీ థాట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.