ఆర్డర్ చేసి ఆహారంలో 40పైగా బొద్దింకలు కనుగొన్న మహిళ!

179

మనలో అనేకమంది ఇంటర్నెట్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. కానీ మీరు తినే ఆహారం ఎంతవరకు తాజాగా మరియు పరిశుభ్రంగా ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా ? అస్సలు ఆలోచించరు. ఆర్డర్ చేశామా..ఇంటికి పార్సిల్ వచ్చిందా.. పార్సిల్ ఓపెన్ చేసి తిన్నామా.. ఇదే చేస్తారు కానీ అది బాగుందా.. అసలు అది మంచి ఫుడ్ యేనా. ఫుడ్ లో ఏమైనా పురుగులు లాంటివి ఉన్నాయా అని కూడా చూడరు. ఇప్పుడు ఒక మహిళకు ఎదురైనా పరిస్థితి గురించి చెప్పబోతున్నాను. అది విని అయినా ఇకపై ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు వహిస్తారని అనుకుంటున్నాం. మరి ఆ మహిళా ఎదుర్కొన్న సమస్య గురించి పూర్తీగా తెలుసుకుందామా.

చైనాలో ఇంటర్నెట్లో “బాతు కూర” ను ఆర్డర్ చేసిన మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 బొద్దింకలు దర్శనమిచ్చాయి.ఈ మహిళ పేరు వివరాలను వెల్లడించకపోయినా, ఇతర వివరాల ప్రకారం ఈమె చైనాలోని, చాసోన్లో, గువాంగ్డాంగ్ పరిసర ప్రాంతాలలో ఈ సంఘటన జరిగినట్లు స్పష్టమైంది. ఆమె డెలివరీ అయిన మీల్స్ పాకెట్ తెరిచిన వెంటనే బొద్దింకలు కుప్పలు తెప్పలుగా కనిపించాయి. ముందుగా కనపడడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ఆ మహిళ తన భోజన౦ పార్సిల్ తెరవగానే, దాని ను౦డి విసురుగా బొద్దింకలు బయటకు వెదజల్లాయి. క్రమంగా వాటిని టిష్యూ పేపర్లతో సేకరించింది.

Image result for insects in food

ఆ హఠాత్పరిణామానికి దిక్కుతోచని స్థితికి లోనైన ఆ మహిళ, వారంరోజుల పాటు భోజనమంటేనే భయపడింది కూడా. క్రమంగా విషయం జరిగిన వెంటనే ఆ మహిళ రెస్టారెంట్ కు ఫిర్యాదు చేసింది. కానీ ఆ భోజనానికి డబ్బులయితే తిరిగి ఇచ్చారు కానీ, ఆ పరిస్థితికి మాత్రం సరైన సమాధానం లేదు. ఈ సంఘటన మీద పోలీసులకు కూడా ఫిర్యాదు అందింది. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మనం కూడా తరచుగా ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. కొన్ని సందర్భాలలో ఇంటికి వచ్చిన ఆహారంలో తరచుగా ఈగలు లేదా ఇతర కీటకాలు ప్రత్యక్షమవడం, వాటి గురించి ఫిర్యాదును ఇస్తే, మాకు సంబంధం లేదని బుకాయించడం వంటివి చూస్తుంటాము. తరచుగా వీటి గురించి కొన్ని వీడియోలు కూడా సోషల్ నెట్వర్క్లలో తిరుగుతుంటాయి. కావున జాగ్రత్త తప్పనిసరి. మరి ఈ బొద్దింకల ఘటన గురించి అలాగే ఆన్ లైన్ ఫుడ్ విషయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.