సమాధి నుండి బయటకు తీయండి అంటూ అరుస్తున్న మహిళ.. భయంతో వణుకుతున్న ప్రజలు

256

ఎవరికైనా చావు ఒకసారి వస్తుంది. పుట్టిన ప్రతి జీవి చస్తుంది. అయితే ఒక్కసారి చస్తే ఇక వాళ్లకు ఎలాంటి జీవితం ఉండదు. అయితే చనిపోయిన వ్యక్తి మళ్ళి బ్రతకడం సాధ్యమంటారా..! కానీ ఇటీవల చనిపోయిన వ్యక్తి నిద్రలేచి అరటిపండు తిన్నాడు.. పాడె మీద నుంచి నిద్రలేచాడంటూ వచ్చిన వార్తలను చాలానే విన్నాం.. టీవీ చానెళ్లలో చూస్తుంటాము కూడా. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన పై రెండింటి కంటే మరీ విచిత్ర ఘటన. ఒక మహిళ తనను సమాధి నుంచి బయటకు తీయండి అని అరుస్తుంది. నమ్మడం లేదా.. అయితే పూర్తీ వివరాలతో చెబుతా వినండి.

Image result for burial grounds

గిల్ కిల్ అనే ఒక ప్రదేశంలో ఒక యువకుడు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తున్నాడు. అయితే అతనిని ఎవరో పిలుస్తున్నారని అతనికి అనిపించింది. అయితే అది అతని భ్రమ అనుకుని ముందుకు వెళ్ళాడు. కొద్దీ ముందుకు వెళ్లిన తరువాత కూడా ఆ మాటలు అతనికి వినిపిస్తున్నాయి. నన్ను ఈ సమాధి నుంచి బయటకు తీయండి.. నేను మా ఇంటికి వెళ్లిపోవాలి అని అమ్మాయి అరుస్తున్న సౌండ్ అతనికి వినిపిస్తుంది. వెంటనే అతను ఆ గ్రామ ప్రజలను పిలిచి తనకు ఎదురైనా సంఘటనను చెప్పాడు. ఆ గ్రామ ప్రజలందరూ ఆ ప్రదేశానికి వెళ్లారు. అందరికి కూడా అదే శబ్దం వినిపించింది. అప్పుడు ఆ గ్రామ ప్రజలు అక్కడే దగ్గరలో ఉన్న మసీద్ దగ్గరకు వెళ్లి ఏం చెయ్యాలా అని అడిగారు. ఒకవేళ మీకు నిజంగానే వినిపిస్తే ఆమెను అందులో నుంచి బయటకు తీయండి అని చెప్పారంట. గ్రామ ప్రజలు కొంత దైర్యం తెచ్చుకుని ఆ సమాధిని తవ్వగా అక్కడ ఒక ఆడమనిషి శవం బట్టలు లేకుండా కనిపించిందట. అప్పుడు ఆమె మా ఇంటికెళ్లి ఎవరైనా బట్టలు తీసుకురండి. అవి వేసుకుని నేను బయటకు వస్తా అని చెప్పిందంట. అప్పుడు అక్కడి వాళ్ళు బట్టలు తీసుకొచ్చి ఆమె శవం మీద వెయ్యగా ఆమె అవి ధరించి లేచి బయటకు వచ్చి పరుగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికెళ్లి ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందంట.

ఈ క్రింద వీడియో చూడండి

అయితే ఇదంతా చుసిన గ్రామ ప్రజలు ఆమె ఏ ఇంట్లోకి అయితే వెళ్లిందో ఆ ఇంటి దగ్గరకు వెళ్లి ఆమె ఎక్కడ అని అడగగా లోపలికి వెళ్లి గడియ వేసుకుందని చెప్పారంట. అప్పుడు తలుపు కొట్టి బయటకు రమ్మని పిలిచారంట గ్రామస్థులు. అప్పుడు ఆమె నా పరిస్థితి బాగాలేదు. నన్ను చూసి మీరు తట్టుకోలేరు. ఒకవేళ తట్టుకుంటామని దైర్యం ఉంటేనే లోపలికి రండి అని ఆమె చెప్పింది. ఆ మాట విన్న గ్రామ ప్రజలందరూ భయపడిపోయారు. అయితే ఇద్దరు ముగ్గురు దైర్యం చేసి లోపలికి వెళ్ళారంట. లోపలికి వెళ్లిన వాళ్ళ ముందు ఆమె తల మీద ఉన్న వస్త్రాన్ని తీసిందంట. అయితే ఆమె తల మీద జట్టు లేకుండా గుండుతో ఉందంట. నీ జుట్టు ఏమైంది అని అడిగారట. నేను బతికున్నప్పుడు నాకు పెద్ద జుట్టు ఉండేది. దానిని అలంకరించుకుని రోడ్డు మీదకు వెళ్లేదానిని. అందుకే ఇప్పుడు నాకు జుట్టు పోయింది అని చెప్పింది. ఆ తరువాత మొహం మీద ఉన్న వస్త్రాన్ని తీసిందంట. అయితే ఆమెకు పెదాలు లేవంట. చూడటానికి దంతాలు మాత్రమే కనపడుతున్నాయంట. నీ పెదాలు ఏమయ్యాయి అని అడిగితే నేను బతికున్నప్పుడు లిప్ స్టిక్ వేసుకుని అందరి ముందు తిరిగేదానిని అందుకే ఇప్పుడు నాకు పెదాలు లేవని చెప్పిందంటా. ఆ తరువాత ఆమె పాదాల మీద ఉన్న వస్త్రాన్ని తొలగించిందంటా. కాళ్లకు గోర్లు లేవంట. అదేమిటి అని అడిగితే… నేను బతికున్నప్పుడు గోర్లకు నెయిల్ పాలిష్ వేసుకున్నా. అందుకే ఇప్పుడు నాకు గోర్లు లేవని చెప్పిందంటా. ఈ మూడు విషయాలు చెప్పి ఆమె అక్కడికక్కడే పడిపోయిందంట. ఆమె చనిపోయిందని డిసైడ్ అయ్యి మళ్ళి ఆమెను అదే పునాదిలో పాతిపెట్టారు. జరిగిన దీనిని పరిశీలించి ఆ మత పెద్ద ఏమని చెప్పాడంటే.. ఆ భగవంతుడు ఈమె రూపంలో వచ్చి ఆడవాళ్ళూ ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదో చెప్పాడు. కాబట్టి బతికున్నప్పుడు వీటిని ఎక్కువగా వాడకండి.