క‌న్న కొడుకు ఆప‌రేష‌న్ కోసం డాక్ట‌ర్ ని నిల‌దీసిన తండ్రి.. ఆ డాక్ట‌ర్ చెప్పింది విని క‌న్నీరు పెట్టుకున్నాడు

588

కొన్ని సార్లు జీవితంలో ఉద్వేగ‌భరిత‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి.. మ‌నం ఎంత క‌ఠినంగా ఉన్నా అలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన స‌మ‌యంలో, వెంట‌నే శాంత మూర్తులము అవుతాము… అలాగే శాంతంగా ఉండేవారు కూడా కఠినంగా మారిపోతారు..ఇక మ‌న అనేవారికి ఎటువంటి ప్ర‌మాదం సంభ‌వించినా త‌ట్టుకోలేము.. వెంట‌నే వారు కోలుకోవాలి అని కోరుకుంటాము.. తాజాగా ఇలాంటి ఓ ఘ‌ట‌న గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ య‌ధార్ధ గాద విన్న ఎవ‌రికైనా క‌న్నీరు రాక మాన‌దు..

Related image

పిల్లల్ని అల్లారు ముద్దుగా త‌ల్లిదండ్రులు పెంచుతారు… వారికి ఏమైనా క‌ష్టం వ‌స్తే త‌ట్టుకోలేరు.. ఇక వారికి ఆరోగ్య స‌మ‌స్య వ‌స్తే వీరు నిద్రాహారాలు మాని పిల్ల‌ల‌కు సేవ చేస్తూ ఉంటారు.. ఇక తాజాగా ఓ పిల్లాడ్ని ఆసుప‌త్రిలో చేర్పించారు తల్లి దండ్రులు.. ఆ స‌మ‌యంలో హాస్ప‌ట‌ల్ సిబ్బంది ఆ పిల్ల‌వాడికి స‌ర్జీరీ చేయాలని తెలియ‌చేశారు.. వెంట‌నే ఎమెర్జ‌న్సీ సిబ్బంది ఆస్ప‌త్రి మెయిన్ డాక్ట‌ర్కి ఫోన్ చేసి ఆస్ప‌త్రిలో ఓ పెషెంట్ ప‌రిస్దితి సీరియ‌స్ గా ఉంద‌ని స‌ర్జ‌రీకిరావాలి అని క‌బురు పంపారు.. ఓ గంట‌కు డాక్ట‌ర్ హస్ప‌ట‌ల్ కు వ‌చ్చారు..

Related image

వెంట‌నే డ్రెస్ చేంజ్ చేసుకుని నేరుగా ఆప‌రేష‌న్ రూమ్ కు వెళ్లాడు.. అక్క‌డ ఆ అబ్బాయి తండ్రి ఫోన్ చేసి ఎంత సేపు అయింది.. ఇప్పుడా రావ‌డం అని డాక్ట‌ర్ ని చెడా మెడా తిట్టాడు.. ఈ స‌మయంలో డాక్ట‌ర్ వెంట‌నే నేను ప‌ని ఉండి బ‌య‌ట‌కు వెళ్లాను.. ఎమెర్జెన్సీ అని కాల్ రాగానే వ‌చ్చాను అని ఆ తండ్రికి తెలియ‌చేశాడు. నీ కొడుక్కు ఇలాంటి ప‌రిస్దితి వ‌స్తే నువ్వు ఇలానే ఉంటావా అని సీరియ‌స్ అయ్యాడు ఆ తండ్రి… ఇక డాక్ట‌ర్ చిరున‌వ్వుతో కంగారు ప‌డ‌కండి మ‌నం మ‌ట్టినుంచే పుట్టాం మ‌ట్టిలోనే కలిసిపోతాం.. ఇదంతా భ‌గ‌వంతుని లీల.. మ‌నం ఎవ‌రి జీవితాన్ని పొడిగించ‌లేం మీరు వెళ్లి మీ బిడ్డ కోసం దేవుణ్ణి ప్రార్ధించండి ని తెలియ‌చేశాడు.

ఇక ఆప‌రేష‌న్ చేసిన త‌ర్వాత డాక్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చి మీ ప్రార్ధ‌న‌లు ఫ‌లించాయి.. మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు అని ఆ తండ్రికి చెప్పాడు.. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్క‌డ న‌ర్సుని అడ‌గండి అని అక్క‌డ నుంచి వెళ్లిపోయాడు డాక్ట‌ర్ .. ఈ డాక్ట‌ర్ ఏమిటి ఇలా ఉన్నాడు నా కొడుకు గురించి ఏమైనా అడిగేవాడిని క‌ధా అని అన్నాడు ఆ పేషెంట్ తండ్రి.. ఇక వెంట‌నే ప‌క్క‌నే ఉన్న న‌ర్స్ క‌న్నీరు పెట్టుకుంటూ ఆ డాక్ట‌ర్ గారు అలా వెళ్ల‌డానికి కార‌ణం ఆయ‌న కొడుకు నిన్న యాక్సిడెంట్లో చ‌నిపోయాడు.. కొద్దిసేప‌టి క్రితం మీ అబ్బాయి స‌ర్జ‌రీ కోసం ఆయ‌న‌కు ఫోన్ చేసిన స‌మ‌యంలో ఆయ‌న స్మ‌శానం ద‌గ్గ‌ర ద‌హ‌న సంస్కారాలు చేస్తున్నారు.. కాని ఆయ‌న అవి ఆపి మీ అబ్బాయి స‌ర్జ‌రీ కోసం వ‌చ్చారు.. అందుకే ఇప్పుడు ఆ కార్య‌క్ర‌మాలు చేసేందుకు మ‌ర‌లా వెళుతున్నారు అని చెప్పింది.. దీంతో ఆ అబ్బాయి తండ్రి కూడా క‌న్నీరు పెట్టుకున్నాడు. త‌న‌కు వ‌చ్చిన బాధ ఏ తండ్రికి రాకూడ‌దు అని.. ఆ డాక్ట‌ర్ వచ్చి త‌న కొడుకుని ర‌క్షించాడు అని ఆయ‌న భావించాడు.. ఎవ‌రు ఏ ప‌రిస్దితుల్లో ఉన్నారో తెలియ‌కుండా ఎవ‌రిని జ‌డ్జ్ చేయ‌కూడ‌దు… త‌ప్పుగా భావించకూడ‌దు.. చూశారుగా ఈ డాక్ట‌ర్ చేసిన ప‌ని పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ‌చేయండి.

జగన్ కు దగ్గరవుతున్న కమ్యూనిస్టులు