ఓ టీచర్ ఆవేదన…. నేను స్కూల్ లో డస్టర్ కోసం వంగితే వాటిని చూసే స్టూడెంట్స్ ఎక్కువయ్యారు.

1148

నేనొక టీచర్ . నా వృత్తి అంటే నాకు ఎంతో ఇష్టం. నా పిలల్లు అంటే నాకు ఎంతో ప్రేమ. నా పిల్లలకు నేనంటే ఎంతో గౌరవం. కానీ ఇప్పుడదంతా గతం. ప్రతి రోజు నాకిప్పుడు భయం భయం. పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే. ఇది గతం. టీవీ లు, ఇంటర్నెట్ , బిజీ లైఫ్ తల్లితండ్రులు, అంతా కలిసి తెలిసో తెలియకో పిల్లల మనసు కల్మషం చేసేసారు. ఇప్పుడు నాకు స్కూల్ కు పోతున్నట్టు లేదు. పాఠం చెబుతుంటే నా నడుము వైపు హై స్కూల్ పిల్లాడి చూపు. డస్టర్ కోసం వంగి తీసే లోపే ఏదో పది కళ్ళు నన్ను తినేసేలా చూశాయని ఫీలింగ్. క్లాస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఏదో లోకం లో వుంటారు. ఆరవ తరగతి నుంచే జంటలు జంటలు. మొన్న బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు ముద్దులాడు కొన్నారని మా సోషల్ టీచర్ చెబితే మనకెందుకు తెలిస్తే గొడవ లవుతాయని ప్రిన్సిపాల్ దాపరికం. 15 ఏళ్ళ అనుభవం. నా పాఠాన్ని పిల్లలు ఎంతో శ్రద్ధగా వినేవారు. ఇప్పుడు పరిస్థితి వేరు. లెసన్ ఎంత ఇంటరెస్టింగ్ గా చెప్పిన వినని పిల్లలు. అర్ధరాత్రి దాకా మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడిన వారు , నీలిచిత్రం చుసిన వారు. చాటింగ్ చేసిన వారు ..క్లాస్ రూమ్ లో కూర్చొంటే అదో లోకం లో వున్న అధిక శాతం పిల్లలు .

Image result for school teachers

పరీక్ష వస్తే తల్లితండ్రులకు మార్కు లు కావాలి. లేదంటే PTA మీటింగ్ లో పిల్లల ముందే అమ్మ నా బూతులు. పిల్లడు చదువు పై శ్రద్ధ చూపడం లేదంటే నీకే చేత కాదు అని క్లాస్ లో అందరు తల్లితండ్రులకు ఎదురుగా అవహేళన. సపోర్ట్ కోసం ప్రిన్సిపాల్ వైపు చుస్తే తల దించుకొని ఆయన. హోమ్ వర్క్ ఇవ్వొద్దు. కనీసం పాఠం చదువుకొని రమ్మంటే పట్టించుకోని పిల్లలు. క్లాస్ లో అదేమని అడిగితే నువ్వు తిడుతున్నావని మా నాన్నకు చెబుతా ఆయన మీడియాకు చెబుతాడు అని పిల్లాడి హుంకరింపు. చాలా మంది టీచర్స్ కు శిక్ష కూడా పడింది. మీడియా కూడా దీనిని పెద్ద తప్పుగా చూపిస్తుంది. మాకెందుకు ఈ ముళ్ల కిరీటం. లేదు నేడు ఈ వృత్తికి గౌరవం. లేదు నేడు ఈ వృత్తికి ఆదరణ. బతికుంటే బలుసాకు తినొచ్చు బతక లేక పోయినా బడిపంతులుగా రావొద్దు అని అందరికి చెబుతా. నా ఆవేదనకు సమాధానం చెప్పేవారెవరు? పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి. ఉపాధ్యాయులను ప్రతీ విషయంలో విమర్శిస్తూ వేలెత్తి చూపడం కాదు.. ఒక తప్పు జరిగితే ఆ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఉపాధ్యాయులు తల్లిదండ్రుల స్థానంలో వున్న గౌరవనీయులు అనే విషయాన్నీ గమనించాలి. పిల్లలు తప్పు చేస్తే దండన అనివార్యం, తల్లిదండ్రులు కూడా పిల్లల్లోని మార్పును చేదు అలవాట్లను గమనించి గుర్తించి సత్వరమే పరిష్కారమార్గాన్ని అన్వేషించాలి. దయచేసి మీడియా కూడా ఒక విషయాన్నీ గమనించాలి. ఏ భాగం కుళ్ళిపోతే ఆ భాగానికే శస్త్రచికిత్స జరగాలి. తప్పుచేసిన వారికీ శిక్ష పడేయాలి. కానీ వ్యక్తి తప్పు చేస్తే ఆ శిక్షకు బాధ్యతను వ్యవస్థకు ఆపాదించకూడదు. టీచర్స్ ను తప్పుడు కోవలో చూసే ప్రతి స్టూడెంట్ ఇప్పటికైనా మారతారని ఆశిస్తున్నాను అని ఆ టీచర్ తన ఆవేదనను చెప్పుకుంది. బాగా ఆలోచిస్తే ఈ టీచర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. కానీ ఆలోచించేవారు లేరు. ఒకప్పటి కన్నా పిల్లలలో నేర వృత్తి ఇప్పుడు పెరిగింది. దీనికి కారణం అప్పుడు టీచర్స్ అంటే భయం ప్రేమ ఉండేది. కానీ ఇప్పుడు అదేమీ లేదు. ఇక మీద అయినా టీచర్ ను గౌరవించి ఉన్నత భవిష్యత్ ను స్టూడెంట్స్ సంపాదిస్తారని అనుకుంటున్నాం. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఈ టీచర్ ఆవేదన గురించి రోజురోజుకు తప్పుడు మార్గంలో వెళ్తున్న స్టూడెంట్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.