ఆమె 6 వారాల గ‌ర్భ‌వ‌తి..అయినా మ‌రోసారి ప్రెగ్నెంట్ అయింది ఎలాగో తెలిస్తే మ‌తిపోతుంది

921

మ‌హిళ‌ల‌కు మాతృత్వం అనేది ఓ వ‌రం అనే చెప్పాలి.. పెళ్లి చేసుకున్న ప్ర‌తీ మ‌హిళ త‌ల్లికావాలి అని క‌ల‌లు కంటుంది..అయితే కొంద‌రు మాత్రం మాతృత్వాన్ని పొంద‌లేక‌పోతారు. కొంద‌రు చాలా స‌మ‌యం త‌ర్వాత ఆ ఆనందాన్ని పొందుతారు… ఇక వారు త‌ల్లి అయ్యేందుకు చాన్స్ ఉండ‌ద‌ని తెలిసిన మ‌హిళ‌లు కొంద‌రు బ‌య‌ట పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డ‌మో లేదంటే స‌రోగ‌సీ, ఐవీఎఫ్ ద్వారా పిల్ల‌ల‌ను క‌న‌డ‌మో చేస్తారు. అయితే ఎలా పిల్ల‌ల్ని క‌న్నప్ప‌టికీ ఒక మ‌హిళ‌కు ఒకేసారి గ‌ర్భం వ‌స్తుంది. అది పూర్త‌యి నెల‌లు నిండి డెలివ‌రీ అయ్యాకే మ‌రో శిశువును క‌న‌వ‌చ్చు. కానీ ఇప్పుడు ఈ విష‌యం మీరు తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు… ఈ మ‌హిళ ఓ వైపు 6 వారాల‌ ప్రెగ్నెంట్‌గా ఉన్న‌ప్ప‌టికీ మ‌రోసారి ప్రెగ్నెంట్ అయింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

ఆమె పేరు జెస్సికా అలెన్‌. ఈమె పిల్ల‌లు లేని ఓ జంట‌కు స‌రోగ‌సి (అద్దె గ‌ర్భం) ప‌ద్ధ‌తిలో పిల్ల‌ల్ని క‌నిచ్చేందుకు ఒప్పుకుంది. అందులో భాగంగానే ప్రెగ్నెంట్ కూడా అయింది. అలా జెస్సికా గ‌ర్భం దాల్చాక 6 వారాల‌కు మ‌రోసారి ఆమె ప్రెగ్నెంట్ అయింది. దీంతో ఆ విష‌యం తెలుసుకున్న జెస్సికా దంప‌తులు ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే వైద్య ప‌రిభాష‌లో చెప్పాలంటే దీన్ని superfetation అంటారు. ఇది కోటి మందిలో ఎవ‌రో ఒక‌రికి ఇలా అవుతుంద‌ట‌.

జెస్సికా అద్దె గ‌ర్భం దాల్చ‌గానే భ‌ర్త‌తో క‌లిసింది. దీంతో ఆమె భ‌ర్త వీర్యంలో ఉండే శుక్ర క‌ణాలు ఆమెకు ఎక్స్‌ట్రాగా విడుద‌లైన అండానికి క‌లిశాయి. దీంతో మ‌రో కొత్త పిండం ఏర్ప‌డింది. ఫ‌లితంగా జెస్సికాకు రెండో గ‌ర్భం వచ్చింది. ఈ క్రమంలో జెస్సికా దంప‌తులు మొద‌టి శిశువును అద్దె గ‌ర్భం దంప‌తుల‌కు ఇచ్చేశారు. రెండో గ‌ర్భం వారి ఫ‌లిత‌మే కాబ‌ట్టి ఆ శిశువును వారు అట్టే ఉంచుకున్నారు. అయితే ఆ ఇద్ద‌రు శిశువులు ట్విన్సే అయిన‌ప్ప‌టికీ జెస్సికా భ‌ర్త న‌లుపు రంగులో ఉండ‌డంతో ఆ శిశువుకు న‌లుపు రంగు వ‌చ్చింది. అంతే తేడా. ఏది ఏమైనా ఈ గ‌ర్భం భ‌లే విచిత్రంగా ఉంది.

ఇలా జ‌ర‌గ‌డంతో అక్క‌డ డాక్ట‌ర్లు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు… ఇప్పుడు ఉన్న మా హాస్ప‌ట‌ల్ లో ఇలాంటి వింత జ‌ర‌గ‌లేదు అని, మా సీనియార్టీలో కూడా ఇలాంటి కేసు రాలేదు అని చెబుతున్నారు డాక్ట‌ర్ మాక్.. మొత్తానికి ఆమెకు ఒకేసారి ఇద్ద‌రు పిల్ల‌లు క‌ల‌గ‌డంతో ఆమె ఆనందానికి అవ‌దుల్లేకుండా పోయాయి.