నిండు గర్భిణీ ఒంటిపై 20వేల తేనెటీగలతో ఫోటోషూట్ చేసింది త‌ర్వాత ఏమైందో తెలుసా

1291

మాతృదేవోభవ అంటారు. అమ్మను మించిన దైవం లేదని, ఆమె ప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటిరాదని అంటుంటారు.ఏ ఆడపిల్లకైనా అమ్మతనం అనేది చాలా గొప్ప వరం. త‌ల్లి అయిన క్షణం నుంచి బిడ్డ పుట్టే వరకు ప్రతీ క్షణం మధురానిభూతిని క‌లిగిస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి.

దాన్ని మరింత మధురం చేసుకునేందుకు ఈ మధ్య ఫొటోషూట్‌లు కూడా ప్రారంభించారు కొంద‌రు .ఈ క్ర‌మంలో తాజాగా ఒకమ్మాయి విలక్షణంగా ఆలోచించి సూప‌ర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో మెటర్నిటీ ఫొటోషూట్‌కు విప‌రీతంగా క్రేజ్ పెరుగుతుంది .

Image result for pregnant woman with bees

దీంతో సంతోషంగా దాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కొందరు దంపతులు. కొంత‌మంది వినూత్నంగా ఫోటో షూట్ లు చేయించుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఓ మ‌హిళ ఏం చేసిందో తెలిస్తే మీరు నివ్వెర‌పోవ‌డం ఖాయం.

Image result for pregnant woman with bees

కొంతమంది కొత్త కొత్త లొకేషన్లలో, వింతగా ఫొటోలు షూట్ చేయడం సహజం. కానీ యూఎస్‌ఏకి చెందిన ఓ మ‌హిళ కాస్త వింతగా ఆలోచించింది.ఈమె పేరు ఎమిలీ మ్యుయెల్ల‌ర్‌. అమెరికా వాసి. ఆమె త‌న భ‌ర్త ఇద్ద‌రూ క‌లిసి 2015వ సంవ‌త్స‌రంలో మ్యుయెల్ల‌ర్ బీ కంపెనీ పేరిట ఓ కంపెనీని నెల‌కొల్పారు వందల సంఖ్య‌లో తేనెటీగలు వెంట‌బ‌డితే భ‌యాదోంళ‌న‌కు గురై ఎవ‌రైనా ప‌రుగులు పెడ‌తారు. వాటి నుంచి త‌ప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు.

Related image

ఎందుకంటే ఒక్క తేనెటీగ కుట్టినా అది క‌లిగించే నొప్పి, బాధ భ‌రించ‌డానికి చాలా క‌ష్టంగా ఉంటుంది .కానీ ఏకంగా ఈమె మాత్రం 20వేల తేనెటీగ‌ల‌ను ఒంటిపై వాలించుకుంది. అంత‌టితో కూడా ఊరుకోలేదు. అలా తేనెటీగ‌లు వాలిన‌ప్పుడు ఫొటోషూట్ చేసింది ఈ మ‌హిళ‌. దీంతో ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అయ్యాయి.

Image result for pregnant woman with bees
తేనెటీగ‌ల‌తో ఫోటో షూట్ చేసింది కానీ ఈ ఫోటో షూట్ ఇంత పెద్ద చ‌ర్చ‌గా ఏందుకు మారిందంటే.. ఆ మ‌హిళ నిండు గ‌ర్భ‌వ‌తి. ఈ క్ర‌మంలోనే ఆమె త‌మ కంపెనీలో ఉండే తేనెటీగ‌ల ఫాం వ‌ద్దకు వెళ్లి వాటిని ఒంటిపై వాలించుకుంది. మొత్తం 20వేల తేనెటీగలు ఆమెపై వాలాయి. అలా అవి చేర‌గానే వాటితో ఫొటోషూట్ చేసింది ఈ మ‌హిళ‌. అంతటితో ఊరుకోలేదు. ఈ ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.దీంతో అవి ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. ఓ వైపు గ‌ర్భంతో ఉండి మ‌రో వైపు తేనెటీగ‌ల‌తో అంత‌టి సాహ‌సం చేసినందుకు ఆమెపై నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌ర్భంతో ఉండి ఇలా చేయ‌డం ఏంట‌ని కొంత‌మంది అంటుండ‌గా, మ‌రికొంద‌రు మాత్రం డేరింగ్ అని అంటున్నారు