నాగ‌క‌న్య‌గా పుట్టిన అమ్మాయి చూసేందుకు త‌ర‌లివ‌స్తున్న జ‌నం

333

కొంద‌రిని చూస్తే నాగ‌క‌న్య ల‌క్ష‌ణాలు ఉన్నాయి అంటారు ఆమె శ‌రీరం అలాగే క‌ళ్లు చూసి నాగ‌కన్య అంటారు మ‌రి ఇప్పుడు ఇలాంటి ఓ స్టోరీ గురించి తెలుసుకుందాం, అసలు నాగ‌క‌న్య‌లు ఉన్నారా లేదా ఓ బూట‌క‌మా అనేదానికి ఏం చెబుతున్నాయి శాస్త్రాలు. ఆమెని 34 సార్లు పాములు కరిచాయి. ఒక్కసారి కాటువేస్తే బతికి బట్ట కట్టడమే కష్టం. అటువంటిది ఇన్నిసార్లు కాటువేసిన తర్వాత ఎవరైనా బతుకుతారంటే నమ్ముతారా? చూపరులను విస్తుగొల్పే ఈ ఘటన హిమచల్ ప్రదేశ్లో ని శ్రీమౌర్లో జరిగింది. 18 ఏళ్ల మనీషాను చివరి మూడేళ్ల కాలంలో 34 సార్లు పాములు కరిచినా వాటి విషం ఆమెను ఏమీ చేయలేకపోయింది. మొదటిసారి ఆ అమ్మాయిని స్థానిక నది సమీపంలో పాము కరిచింది.

ఈ క్రింది వీడియో చూడండి

స్కూల్ రోజుల్లో తనను చాలా సార్లు పాము కరిచిందని, ఒక్కోసారి రోజుకు రెండు లేదా మూడు సార్లు కూడా కరిచేవని మనీషా చెబుతుంటే వినేవాళ్లు నోరెళ్లబెడుతున్నారు. అయితే తనకు నాగ దేవతకు ఏదో సంబంధం ఉండటం వల్లే పాము కాటు తనను ఏం చేయలేకపోతుందని జ్యోతిష్యులు, పూజారులు చెప్పినట్టు ఆ అమ్మాయి చెబుతోంది.కానీ విషం లేని, తక్కువ విషం కలిగిన పాములు కుట్టడం వల్లనే మనీషా ప్రాణానికి ప్రమాదం తప్పుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్ రిపోర్టుల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 18 వరకు మనీషాకు 34 సార్లు పాములు కరిచినట్టు వైద్యుల టెస్టింగ్ లో వెల్లడైంది. ఫిబ్రవరి 18న పాము కరిచిన కారణంగా మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయిందని డాక్టర్ వైఎస్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మెడికల్ సూపరిటెండెంట్ చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

Image result for nagakanya

పాము కాటుకు గురైన లక్షణాలతో మనీషా ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఇది విషం లేని పాముగా గుర్తించాం. ఇక్కడ ఉండే 80 శాతానికి పైగా పాముల్లో విషం ఉండదు” అని డాక్టర్ తెలిపారు. మనీషా పాము కాటుకు గురవ్వడం రొటీన్ అయిపోయిందని ఆమె తండ్రి సుమెర్ వర్మ చెబుతున్నాడు. అయితే తరచు ఆమెను పాములు కరవడంతో మనీషా శరీరంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పెరిగి, పాము కాటు నుంచి తప్పించుకునే ప్రక్రియ ఉత్పన్నమవుతుందని హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ అటవీ శాఖ పశువైద్యుడు డాక్టర్ రోహిత్ చెబుతున్నారు.ఎంత తక్కువ విషం ఉన్న పాములయినా అన్ని సార్లు కరిచినా ఏమీ కాలేదంటే అది వండర్ కాకపోతే మరేమిటని స్థానికుల ప్రశ్న.. ఆమె నిజమైన నాగకన్య అని స్థానికులు బలంగా వాదిస్తున్నారు. ‘మనీషా నాగకన్య అనేందుకు ఇదే సాక్ష్యం’అంటూ చెబుతున్నారు. మ‌రి ఆమెని చూసేందుకు కూడా ప‌క్క గ్రామాల నుంచి పెద్ద సంఖ్య‌లో జ‌నాలు వ‌స్తున్నారు. చూశారుగా మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ల రూపంలో తెలియ‌చేయండి