ఎర్రగడ్డ ఘ‌ట‌న కూతురుపై దాడిలో కొత్త కోణం… షాకైన పోలీసులు

410

ఎస్సార్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు మాధవి, అల్లుడి సందీప్‌పై మామ నర్సింహాచారి కత్తితో దాడి చేసిన విషయం సంచ‌ల‌నం క‌లిగించింది, ఇంకా మారుతిరావు అంశం చ‌ల్లార‌క‌ముందే ఇలాంటి మ‌రో దారుణం జ‌రిగింది,ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన 21 ఏళ్ల సందీప్, బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన 20 ఏళ్ల మాధవిలకు నాలుగేళ్ల క్రితం ఇంటర్‌ ఎగ్జాం సెంటర్లో పరిచయమైంది. నాటి నుంచి తరచు కలుసుకునేవారు.

సందీప్ కూకట్‌పల్లిలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతూ సాయంత్రం పూట ఓ బిర్యానీ సెంటర్‌లో పనిచేస్తుండేవాడు. మాధవి సనత్‌నగర్‌లో డిగ్రీ చదువుతోంది. మాధవి తండ్రి మనోహరాచారి. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను తండ్రి వ్యతిరేకించాడు. కుమార్తెతో పాటు సందీప్‌ను పలుమార్లు హెచ్చరించాడు. మాధవిని ఆమె మేనబావకు ఇచ్చి పెళ్లిచేసేందుకు ప్రయత్నించాడు. దీంతో మాధవి నేరుగా తాను ప్రేమిస్తున్న సందీప్‌ ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పడంతో కొందరు మిత్రులు కలిసి వీరి పెళ్లిని ఈ నెల 12న ఆర్య సమాజ్‌లో చేశారు.

Image result for love marriage

సందీప్, మాధవిలపై జరిగిన దాడికి కులాంతర వివాహమో, పరువు కోసమో కాదని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కేవలం కుమార్తె తనకు తెలియకుండా పెళ్లి చేసుకుందన్న కారణంతోనే తండ్రి మనోహరాచారి ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపారు. మాధవి ప్రేమ విషయం మనోహరాచారి భార్య లక్ష్మి, కొడుకు నవీన్‌లకు తెలుసు. ప్రేమిస్తున్న కూతురు, విషయం తెలిసిన తల్లి, కొడుకులు ఎవరూ ఆయనకు చెప్పలేదన్నారు. ఆమె బావతో మనోహరాచారి కూతురుకు పెళ్లి చేయాలనుకున్నాడని, అంతలో ప్రేమ వ్యవహారం తెలియడంతో ఆయనకు ఆగ్రహం కలిగిందన్నారు. ఇది కులాంతర వివాహం కోసం చేసిందో, పరువు కోసం చేసిన దాడో కాదన్నారు. తాను ఒకరితో పెళ్లి చేద్దామని సిద్ధం కావడం, తనకు తెలియకుండా పెళ్లి చేసుకోవడంతో మనోహరాచారి తీవ్ర మనోవేధనకు గురై నాలుగైదు రోజులుగా విపరీతంగా తాగుతున్నాడు. ఈ బాధలో కూతుర్ను చంపాలనుకున్నాడు. ఆమెను చంపేందకు కొబ్బరిబొండాం దుకాణంలో కత్తిని దొంగిలించాడని డీసీపీ తెలిపారు.

Image result for love marriageబుధవారం మధ్యాహ్నం మనోహరాచారి కూతురు మాధవికి ఫోన్ చేసి.. అమ్మా… చూడాలని ఉందని చెప్పారు. ఈ నెల 17 నుంచే వారి హత్యకు ప్రణాళిక వేశాడు. బుధవారం మధ్యాహ్నం ఫోన్‌ చేసి ఇద్దరికీ కొత్తబట్టలు పెడతానని, ఎర్రగడ్డ గోకుల్‌ థియేటర్‌ వద్ద ఉన్న హ్యుండాయ్ షోరూం వద్దకు రమ్మని చెప్పాడు. మాధవి, సందీప్‌లు బైక్ పైన వచ్చారు. మనోహరాచారి తాను కూడా కొద్దిసేపటికే తన బైక్ పైన వచ్చాడు. అప్పుడు ముందు సందీప్ పైన దాడి చేయగా, అతను పారిపోయాడు. ఆ తర్వాత కూతురుపై దాడి చేశాడు. కూతురే టార్గెట్ అనుకున్నప్పుడు సందీప్ పైన ఎందుకు దాడి చేశాడని డీసీపీని మీడియా అడగ్గా… సందీప్‌ భయంతో పారిపోతే కుమార్తెను చంపొచ్చనేది తన ఉద్దేశమని తెలిపారు.

మనోహరాచారి 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. బోరబండలో ఉంటూ చిన్న, చిన్న పనులు చేసేవాడు. కొన్నేళ్ల నుంచి సమీపంలోని బంగారం దుకాణంలో పని చేస్తూనే సన్నిహితులు, బంధువులకు బంగారు ఆభరణాలు ఆర్డర్‌పై తయారు చేసి ఇచ్చేవాడు. భార్య లక్ష్మి హైటెక్‌ సిటీ ప్రాంతంలో పని చేస్తున్నారు. కొడుకు నవీన్‌, కూతురు మాధవిలను డిగ్రీ చదివారు. మాధవికి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో రెండు నెలల క్రితం బోరబండలోని వినాయక్‌నగర్‌ నుంచి రాజ్‌నగర్‌ బస్తీకి వచ్చి పెద్ద ఇంటిని కిరాయికి తీసుకున్నారు. తండ్రి పెళ్లి కోసం ఇంత సిద్ధం చేస్తున్నా ఆయనకు కూతురు ప్రేమ, పెళ్లి విషయం చెప్పలేదు. తెలియకుండా పెళ్లి చేసుకుంది. దీంతో అతనికి కోపం వచ్చింది. సందీప్ తన తల్లి రమాదేవితో కలిసి ప్రేమ్‌నగర్‌లో నివసిస్తున్నారు. సందీప్‌కు తండ్రి లేడు. బంధువులు నిర్వహించే బిర్యానీ సెంటర్లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. అని తెలియ‌చేశారు పోలీసులు, మొత్తానికి ఇద్దరూ కూడా ఆస్ప‌త్రిలో చికిత్స్ పొందుతున్నార‌ని ఆమె ప‌రిస్దికి కొంచెం విష‌మంగా ఉంద‌ని చెబుతున్నారు డాక్ట‌ర్లు, మ‌రి ఇలాంటి సంఘ‌ట‌ను జ‌రుగ‌కుండా కొత్త చ‌ట్టాలు తీసుకువ‌చ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాలు సిద్దం అవ్వాలి అని అంటున్నారు యువ‌త‌, చూశారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి