గీతామాధురి సామ్రాట్ మ‌ధ్య కొత్త అఫైర్ చూపుల‌తో ప‌డేసిన గీతామాధురి

381

బిగ్ బాస్ హౌస్ మ‌రింత మ‌సాలాతో సాగుతోంది. టాస్క్ లో భాగంగా ఇంటి స‌భ్యులు కొత్త అనుభూతిని పొందుతున్నారు…
బిగ్‌బాస్ హౌస్ 67 ఎపిసోడ్‌లోనూ ‘కాల్ సెంటర్’ టాస్క్ కొనసాగింది. సునైనా కాల్ కట్ చేయకుండా వెళ్లిపోవడంతో.. బిగ్‌బాస్ కాల్ సెంటర్‌కు ఒక పాయింట్ ఇచ్చి, పబ్లిక్‌ టీమ్‌ను టాస్క్‌ మళ్లీ మొదలుపెట్టాలని సూచించాడు. దీంతో, పబ్లిక్ టీమ్ సభ్యులు బిగ్‌బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేమ్ రూల్స్‌లో ఆ విషయం ప్రస్తావించలేదన్నారు.

బిగ్‌బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ప్రకారం.. తనీష్, సునయనాలు రాత్రి నిద్రపోకూడదు. అయితే, వారు ఆ రూల్ తప్పి నిద్రించడంతో బిగ్‌బాస్ అర్ధరాత్రి వారిని నిద్రలేపాడు. దీంతో తనీష్ భావోద్వేగానికి గురయ్యాడు. సునయన తనీష్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించింది.కౌశల్‌ను టార్గెట్ చేసుకున్న పబ్లిక్ టీమ్.. బుధవారం కూడా అదే విధానం కొనసాగించారు. ఈ సారి గణేష్‌కు ఆ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్.. తనకు, బాబు గోగినేనికి మధ్య ఉన్న బంధాన్ని కౌశల్ వ్యతిరేకించడాన్ని ఫోన్ కాల్‌లో ప్రస్తావించాడు. చెప్పాలంటే, గణేష్ తన ఒరిజినాలిటీ చూపే ప్రయత్నం చేశాడు. కొంతవరకు కౌశల్‌ను విసిగించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, కాల్ సెంటర్లోని శ్యామలా.. కౌశల్‌ను కూల్ చేయడంతో సహనంతో కాల్ కొనసాగించాడు. ఈ సందర్భంగా గణేష్.. ‘‘ఐ యామ్ నాట్ గెట్టింగ్ మర్యాదా, విడ్డూరం, అంటూ రెట్టించే ప్రయత్నం చేసినా కౌశల్ అతడికి తగిన సమాధానాలు ఇచ్చాడు.

టాస్క్‌లో భాగంగా కాల్ సెంటర్ సభ్యులు, పబ్లిక్‌గా.. పబ్లిక్, కాల్ సెంటర్ సభ్యులుగా మారారు. దీంతో మొదటి కాల్ శ్యామలా మాట్లాడింది. ఈ సందర్భంగా గణేష్ తెలుగు మాటలు విని శ్యామలా షాకైంది. మీరు తెలుగేంటి అలా మాట్లాడుతున్నారని శ్యామలా ప్రశ్నించగా.. తనకు తెలుగులో 32 మాటలు మాత్రమే వచ్చని చెప్పాడు.

తనీష్: కాల్ సెంటర్లో ఉన్న తనీష్‌తో కౌశల్ ఫోన్లో మాట్లాడాడు. ఈ సందర్భంగా హౌస్‌లోని సభ్యుల గురించి తనీష్‌ను అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మీరు అమ్మాయిలను బాగా పడేస్తారని తెలిసిందని కౌశల్ అంటే.. ఈ విషయంలో తనకు కౌశల్ గురువంటూ తనీష్ సమాధానం ఇచ్చాడు. నందిని బాగుంటుందని, అందుకే లైన్ వేశానని తనీష్ చెప్పాడు. నందినీకి మీరు కూడా లైనేశారు కదా అని కౌశల్‌కు చురకలు అంటించాడు. సునయనా మిమ్మల్ని బ్రో అని పిలుస్తుంది. మీరు ఆమెకు అన్న అవుతారా?’’ అని కౌశల్ అడిగిన ప్రశ్నకు తనీష్ ఔను అని తెలిపాడు.