ఇది కథ కాదు నిజం: ఈ తల్లీకూతుర్లు చేసిన పనికి ఊరుమొత్తం షాక్

798

కుటుంబ సభ్యుల మద్య ఉండే ప్రేమానురాగాలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.అమ్మానాన్న అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ళు తండ్రిబిడ్డ ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి రిలేషన్ ఒక అద్బుతమే.అయితే మన కుటుంబంలో ఒక్కరు పోయిన కూడా మనం చాలా కాలం కోలుకోలేము.ముఖ్యంగా మనకు జన్మనిచ్చిన వారు పోయిన మనం జన్మనిచ్చిన వారు పోయినా,మనకు తోడుగా పుట్టిన వారు పోయినా అస్సలు తట్టుకోలేము.ఆవేదనలో ఏమేమో చేస్తాం.ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఒక తల్లికుతుళ్ళకు వచ్చింది.అందరు వారిని వదిలేసిపోయరని మనస్తాపం చెంది దారుణానికి పాల్పడ్డారు.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ బొక్కలగడ్డకు చెందిన మనుగొండ సరిత(40) హన్మకొండలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. పదేళ్ల కిందట భర్త పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యానికి గురై మృతి చెందారు. కారుణ్య నియామకాల కింద భర్త ఉద్యోగం సరితకు రావడంతో రెవెన్యూ విభాగంలో ఆర్ఐగా విధులు నిర్వరిస్తున్నారు. కూతురు మధుమిత(17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నాలుగు నెలల క్రితం ఆమె కుమారుడు రోహిత్(21) హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.కట్టుకున్న భర్త, కన్న కొడుకు మరణంతో సరిత తీవ్ర మానసిక వేదనకు గురైంది. రోహిత్ మరణించిన తర్వాత ఉద్యోగానికి వెళ్లడం లేదు. బంధువులు, తోటి ఉద్యోగులు ధైర్యం చెప్పడంతో కొంతకాలంగా విధులకు హాజరవుతోంది. ఉద్యోగం చేస్తూ సుబేదారి ప్రాంతంలో నివాసం ఉంటోంది. గురువారం దేశాయిపేటలో బంధువుల పెళ్లి ఉండటంతో సరిత తల్లిదండ్రులు వెళ్లారు. సరితను పెళ్లికి రమ్మని ఎంత బ్రతిమిలాడినా వెళ్లలేదు.

Related image

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెళ్లి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు తలుపులు తీసేందుకు బయటి నుంచి సరితను పిలిచారు. లోపల గడియ పెట్టి ఉండి ఎంత పిలిచినా సరిత, మధుమిత పలుకలేదు.దీంతో బలవంతంగా తలుపులను తెరిచి చూడగా సరిత, మధుమిత ఇంటి దూలానికి వేలాడుతూ ఉరివేసుకుని కనిపించాచారు.దూలానికి వేలాడుతున్న వారిని చూసి తల్లిదండ్రులు, అన్నావదినలు కన్నీరుమున్నీరుగా విలపించారు. 11 ఏళ్లలో కుటుంబంలో అందరూ చనిపోయారంటూ సరిత, మధుమితల మృతదేహాలను చూసి బంధువులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు.కాగా, సరిత కుమారుడు రోహిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్‌ ధరించి ఉంటే బతికేవాడని బంధువులు తెలిపారు. తన కొడుకులా మరెవరికీ అలాంటి పరిస్థితి రావొద్దని సరిత రోహిత్‌ స్నేహితులు, బంధువులకు 100 మందికిపైగా హెల్మెట్లు కొనిచ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ సారి రాఖీ పండుగకు తన బంధువుల్లో ద్విచక్రవాహనాలు ఉన్న వారందరికీ హెల్మెట్లు కొనివ్వడానికి కూడా ఏర్పా ట్లు చేసిందని వారు చెప్పారు.భర్త, కుమారుడి మరణంతో మనస్తాపం చెంది ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన మనుగొండ సరిత, కూతురు మధుమిత మృత దేహాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి కాట, జేసీ దయానంద్, హన్మకొండ తహసీల్దార్‌ ఖాజామోయినోద్దిన్‌లు సందర్శించి నివాళులర్పించారు.గురువారం రాత్రి కావడంతో మృత దేహాలకు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు.విన్నారుగా భర్త కొడుకు దూరమయ్యారని ఈ తల్లి తన కూతురితో సహా ఎలా ఆత్మహత్య చేసుకుందో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఈ ఆత్మహత్య గురించి అలాగే ఇలా ఎవ్వరు లేరని బాధపడి ఆత్మహత్య చేసుకునే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.