లగేజ్‌ స్కానింగ్‌ మిషన్‌లోకి దూరిన చిన్నారి త‌ర్వాత జ‌రిగింది చూసి క‌న్నీరు పెట్టిన త‌ల్లి

224

భద్రతపరమైన ఏరియాల్లో ముఖ్యంగా సున్నితపు ఏరియాల్లో అణువణువు కూడా శోదిస్తూ, పరిశోదిస్తూ ఉంటారు. ఎక్క‌డ చిన్న అనుమానాస్ప‌ద వ‌స్తువు క‌నిపించినా ఇట్టే ప‌సిగ‌ట్టే స్కాన‌ర్లు పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ప్రతి చిన్న వస్తువును కూడా ప‌ట్టిస్తున్నాయి… ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా తీక్షణంగా చూసే టెక్నాలజీ వచ్చింది. బ్యాగుల్లో బాంబులు, గన్స్‌, కత్తులు వంటివి క్యారీ చేయకుండా ఉండేలా లగేజ్‌ స్కానింగ్‌ మిషన్‌లు వచ్చాయి. లగేజ్‌ స్కానింగ్‌ మిషన్‌లోక ఏదైనా బ్యాగ్‌ను పెట్టామంటే దాన్ని క్షుణ్ణంగా సదరు మిషన్‌ పరిశీలిస్తుంది.

Related image

అందులో ఏ లోహపు వస్తువు ఉన్నా కూడా వెంటనే ఐడెంటిఫై చేస్తుంది. అలాంటి లగేజీ మిషన్‌లోకి మనుషులు వెళ్తే ఎలా ఉంటుంది. ఈ ప్రశ్న ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది కదా అనుకోకుండా ఒక పాప లగేజీ స్కానింగ్‌ మిషన్‌లోకి వెళ్లింది. ఆ పాప కావాలని వెళ్లలేదు, అధికారులు ఆ పాపను స్కానింగ్‌ మిషన్‌లోకి పంపించలేదు. కాని ఆ పాప ఆడుకుంటూ లగేజ్‌ మిషన్‌ను పట్టుకుంది. దాంతో లగేజ్‌ మిషన్‌లోకి ఆ పాప వెళ్లి పోయింది.లగేజీ మిషన్‌లోకి వెళ్లి పోయినా ఆ పాపను అన్ని వస్తువుల మాదిరిగానే స్కానింగ్‌ చేసింది. స్కానింగ్‌లో చూసి అంతా కూడా అవాక్కయ్యారు. అధికారులు ఇలాంటి పని జరగడంతో అప్రమత్తం అయ్యారు… పాపాయికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కనుక సరిపోయింది. లేదంటే చాలా సీరియస్‌ ఇష్యూ అయ్యేది అంటూ ఆందోళన చెందుతున్నారు..

ఈ క్రింది వీడియో చూడండి 

ఈ సంఘటన చైనాలో జరిగింది. చైనాలోని షాన్‌ డోంగ్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వైరల్‌ అయ్యింది. పాపాయి విమానాశ్రయం స్కానింగ్‌ మిషన్‌లోకి వెళ్లి క్షేమంగా వెళ్లి రావడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. చిన్న పిల్లలు అల్లరి చేయడం చాలా కామన్‌. అయితే ఈ పాపాయి మరీ అల్లరి పిల్లలగా ఉందే అంటూ అంతా ఆ పాపను అంటున్నారు. ఈ పాపాయితో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మ‌రి చూశారుగా చిన్న‌పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే ఎలాంటి ప్ర‌మాదాలు వ‌స్తాయో మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.