ఫోన్ కు న్యూడ్ ఫోటోలు పంపింది చివరకు ఎవరు చూశారో తెలిస్తే షాక్

212

న్యూడ్ ఫోటోలు పంపితే ఉద్యోగమిస్తానని ఇద్దరు వ్యక్తులు ఓ యువతిని నమ్మించి మోసం చేశారు. కలకలం రేపుతున్న ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.మియాపూర్‌కు చెందిన యువతి ఉద్యోగం కోసం ఎదురు చూస్తోంది. ఈ సమయంలో ప్రదీప్ అనే యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. ‘మేము ప్రముఖ హోటల్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు ఈ హోటల్లో రిసెప్షనిస్టుగా ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాం’ అని చెప్పాడు. దానికి సదరు యువతి.. ‘నేను ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేదు. నా వివరాలు మీకెల వచ్చాయి’ అని గట్టిగా ప్రశ్నించింది. దానికి కాల్ చేసిన వ్యక్తి ‘మేము ఓ వైబ్‌సైట్ నుంచి మీ రెజ్యూమ్‌ను సేకరించాం’ అని చెప్పాడు. ఆ మాటలు నమ్మిన యువతి ఉద్యోగం చేసేందుకు తాను సిద్ధమని చెప్పింది. దీంతో ఆమెకు అర్చనా జగదీశ్ హెచ్ఆర్ ఆఫీసర్ వాట్సాప్‌లో ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత రోజు మళ్లీ ఆ యువతికి ఫోన్ చేసి, మీరు ఉద్యోగానికి సెలక్ట్ అయ్యారని తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే దానికి ఓ కండిషన్ పెట్టారు. ‘నీ న్యూడ్ ఫోటోలను వాట్సాప్‌లో పంపించు. చూశాక డిలీట్ చేస్తాం. లేదంటే ఈ ఉద్యోగం వేరేవాళ్లకు ఇస్తాం.’ అని చెప్పడంతో యువతికి వేరే గత్యంతరం లేక తన నగ్న చిత్రాలను వారికి పంపించింది. అంతే.. ఆ తర్వాత నుంచి సదరు యువతికి ప్రదీప్ అనే యువకుడు ఫోన్ చేస్తూ.. నగ్న చిత్రాల గురించి అసభ్యంగా మాట్లాడుతూ, లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. తన కోరిక తీర్చాలని లేదంటే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. యువతి వద్దని ఎంత వేడకున్నా వినలేదు. తాను చెప్పిన చోటికి రావాలని, కోరింది ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో మానసిక క్షోభకు గురైన యువతి షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. రంగంలోకి సైబరాబాద్ షీ టీమ్స్ బృందం.. ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.