చనిపోయిన పాప మళ్ళీ బ్రతికింది.. ఎలానో తెలుసా

6886

విజ‌య‌వాడ‌లో దారుణం చోటు చేసుకుంది. బ్ర‌తికున్న బాలిక‌ను చ‌నిపోయింద‌ని చెప్పారు ప్ర‌భుత్వాసుప‌త్రి వైద్యులు . అయితే అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేస్తుండ‌గా బాలిక క‌దిలింది. సాయిదుర్గ అనే చిన్నారి క‌ళ్లు తిరిగి కింద ప‌డిపోయింది. దీంతో ఆమెను ప్ర‌భుత్వాసుప‌త్రిలో జాయిన్ చేయించారు కుటుంబ స‌భ్యులు.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే సాయి దుర్గ చ‌నిపోయింద‌ని చెప్పారు ప్ర‌భుత్వాసుప‌త్రి డాక్ట‌ర్లు. దాంతో బాలిక‌ను ఇంటికి తీసుకెళ్లారు త‌ల్లితండ్రులు. డాక్ట‌ర్లు చ‌నిపోయింద‌ని చెప్ప‌డంతో బాలికకు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేశారు కుటుంబ స‌భ్యులు. అయితే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే స‌మ‌యంలో బాలిక క‌దిలింది. దీంతో విజ‌య‌వాడ‌లో ప్ర‌భుత్వాసుప‌త్రి వైద్యుల నిర్య‌క్షం బ‌య‌ట‌ప‌డింది. బ్ర‌తికున్న బాలిక‌ను చ‌నిపోయిన‌ట్లే తేల్చేసిన డాక్ట‌ర్ల నిర్వాకం బ‌ట్ట‌బ‌య‌లైంది.

Image result for girl in hospital
అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే స‌మ‌యంలో సాయిదుర్గ క‌ద‌ల‌డంతో త‌ల్లితండ్రులు ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.ఈ క్ర‌మంలో పాప‌ను విజ‌య‌వాడ‌లోని గ్లోబ‌ర్ ఆసుప‌త్రితో పాటు మరో హ‌స్పిట‌ర్ కు తీసుకెళ్లారు. విజ‌య‌వాడ న‌గ‌రంలోని రాజ‌రాజేశ్వ‌రి పేట‌కు చెందిన చిన్నారి సాయిదుర్గ క‌ళ్లు తిరిగి సోమ‌శిల్లిప‌డిపోయింది.

Image result for girl in hospital

దీంతో వెంట‌నే త‌ల్లిండ్రులు ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్ల‌గా మొద‌ట కోమాలోకి వెళ్లింద‌న్న డాక్ట‌ర్లు, ఆ త‌ర్వాత చ‌నిపోయింద‌ని చెప్పారు. అయితే అంత్య‌క్రియ‌లు చేస్తున్న సంద‌ర్బంగా బాలిక క‌ద‌ల‌డంతో వేరే ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా బాలిక బ్ర‌తికే ఉంద‌ని చెప్పారు అక్క‌డి డాక్ర‌ర్లు. దీంతో ప్ర‌భుత్వ వైద్యాల నిర్య‌క్ష్యం మ‌రోసారి విజ‌య‌వాడ‌లో బ‌య‌ట‌ప‌డింది.

Image result for girl in hospital

ప్ర‌భుత్వ వైద్యుల నిర్య‌క్షంపై కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చిన్నారికి బ్ల‌డ్ కావాల‌ని త‌మ ద‌గ్గ‌ర తీసుకున్నార‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. డాక్ట‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు బాలిక త‌ల్లితండ్రులు .త‌మ ఆర్థిక ప‌రిస్థితి బాగాలేక ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకొస్తే త‌మ నుంచి డ‌బ్బులు డిమండ్ చేశారంటున్నారు.

Image result for hospital

బాలిక చ‌నిపోయింద‌ని త‌మ చేతిలో పెట్టార‌ని, త‌మ‌కు స‌ర్టిపికేట్ కూడా ఏమీ ఇవ్వ‌లేద‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. మా లాంటి పేద‌వారికి గ‌వ‌ర్నెంట్ హ‌స్పిట‌ల్స్ గ‌తి అని, వారి ఇలా చేస్తే ఇక త‌మ‌లాంటి ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రి డాక్ట‌ర్ల నిర్వాకం ఇప్పుడు చ‌ర్చ‌నీయంశంగా మారింది.