విమానంలో తాగడానికి పెగ్గు ఇవ్వలేదని ఈ మహిళ ఎంత దారుణమైన పని చేసిందో తెలిస్తే షాక్…

345

ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ విదేశీ ప్రయాణికురాలు తాగి రచ్చరచ్చ చేసింది. మరో పెగ్ ఎందుకు ఇవ్వరంటూ విమాన సిబ్బందితో గొడవకు దిగి పచ్చి బూతులు తిట్టింది. విమానం లండన్ హిత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే విషయాన్ని చెప్పిన సిబ్బంది ఆమెను పోలీసులకు అప్పగించారు. నవంబర్ 10వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెగ్ ఇవ్వకపోయినా కిక్కు ఎక్కిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఐర్లాండ్‌కు చెందిన మహిళ ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించింది. జర్నీలో మద్యం సేవించింది. ఆమె పరిస్థితి గమనించిన సిబ్బంది మరో గ్లాస్ మద్యం ఇచ్చేందుకు నిరాకరించారు. ఇక అది మొదలుకుని ఐర్లాండ్ ప్రయాణికురాలు విమాన సిబ్బందిని అభ్యంతరకరంగా తిట్టడమే కాకుండా వారిపై ఉమ్మివేసింది. విమానంలోని తోటి ప్రయాణికులు జరిగిన తతంగాన్ని వీడియో తీశారు.

సిబ్బంది ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గ్లాస్ వైన్ నిరాకరించేందుకు మీకెంత ధైర్యమంటూ నోరు తెరిచిన ఐర్లాండ్ ప్రయాణికురాలు ఆపై పచ్చి బూతులు తిడుతూ హంగామా చేసింది. కంట్రోల్‌లో లేదని ఆమె పరిస్థితిని పైలట్‌కు వివరించగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో గ్లాస్ మద్యం ఇవ్వొద్దని చెప్పారని సిబ్బంది వివరించారు.