నా తండ్రే నాపాలిట కాలయముడు ఒక అమ్మాయి కన్నీటి గాధ

203

ప్రపంచం కంప్యూటర్‌ యుంగంగా మారిపోయింది. అంతా కూడా ఒకరిని చూసి ఒకరు ముందుకు పరిగెత్తేందుకు ప్రయత్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇంకా వెనుకబడే ఉంటామని అంటున్నారు. మారుతున్న ప్రపంచంతో మారాలనే ఆలోచన వారికి కలగడం లేదు.. అసలు మారాలని వారు కోరుకోవడం లేదు. ఎందుకు వారు అలా ప్రవర్తిస్తున్నారనే విషయం వారికి అయినా అర్ధం అవుతుందో లేదో వారికే తెలియాలి. ఒక అమ్మాయి చదువుకుంటాను అంటూ ఆమె కన్న తండ్రి కత్తితో పొడిచిన ఘటన యూపీలో జరిగింది. అక్కడ పరిస్థితికి ఈ సంఘటన అద్దం పడుతుంది. మరి ఏమైందో తెలుసుకుందామా.

Related image

ఉత్తరప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌లో ఒక కాలువ కట్టపై 15 ఏళ్ల బాలికకు మరియు ఆమె తండ్రికి గొడవ జరుగుతుంది. తండ్రి పెళ్లి సంబంధం తీసుకు వచ్చాడు. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని భావిస్తున్నాడు. కాని ఆ బాలిక మాత్రం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన చదువు కొనసాగిస్తానంటూ తండ్రితో తెగేసి చెప్పింది.. మొదట బతిమిలాడిన ఆ తండ్రి ఆ తర్వాత ఆగ్రహంతో రగిలి పోయాడు. కోపంతో అతడు కూతురు అనే విషయాన్ని చూడకుండా పిడి గుద్దులు గుద్డాడు. కొద్ది సేపటికి ఆమె అన్నయ్య కూడా అక్కడకు వచ్చాడు. అన్నయ్య ఆమె చేతులను పట్టుకొని ఉండగా తండ్రి పాకెట్‌లో ఉన్న కత్తిని తీసి విచక్షణ రహితంగా పొడిచాడు. పలు చోట్ల పొడిచిన అతడు పక్కనే ఉన్న కాలువలో ఆమెను తోసేయడం జరిగింది. ఈదడం వచ్చిన ఆ బాలిక మెల్ల మెల్లగా ఈదుకూంటూ కొద్ది దూరం వెళ్ళింది. కాసేపటి తరువాత కూతురి బతికుందో లేదో తెలుసుకోవడానికి తండ్రి మళ్లా అక్కడికి వచ్చాడు. అయితే తండ్రి కంట పడితే ప్రమాదం అనుకున్న బాలిక మరి కొంత దూరం ఈదుకుంటూ వెళ్లి దాక్కుంది. ఆ తర్వాత పైకి ఎక్కింది. రక్తం కారుతున్న గాయాలతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లింది. వెంటనే ఆమెను హాస్పిటల్‌లో జాయిన్‌ చేసిన పోలీసులు ఆమె నుండి వాంగ్మూలం సేకరించి కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ క్రింది వీడియో చూడండి

కాగా బాలిక చెప్పిన విషయాలు నిజమేనని ఆమె బావ(సోదరి భర్త) పోలీసులకు తెలిపారు. “ఆమె గత రెండు నెలలుగా మాతోనే ఉంటోంది. ఆమె చదువుకోవటం తండ్రీ కొడుకలకు ఇష్టం లేదు. రెండు రోజుల క్రితం వారు మా ఇంటికొచ్చారు. పెళ్లి చేస్తానంటూ ఆమెను తీసుకెళ్లిపోయారు. ఆమె కాలువ దగ్గర కత్తి గాయాలతో పడి ఉందంటూ ఫోన్ రావటంతో నేను వెంటనే అక్కడికి వెళ్లాను,” అని ఆయన పోలీసులకు చెప్పారు. ఆ బాలిక తండ్రిపై హత్య కేసును నమోదు చేసి విచారణ ఎంక్వౌరీ ప్రారంభించారు. మరో వైపు హాస్పిటల్‌లో అమ్మాయికి చికిత్స చేయిస్తున్నారు. ఆమె మెల్ల మెల్లగా కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది.. సాక్షాధారాలను బట్టి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. చూశారుగా చదువుకుంటా అని అన్నందుకు ఈ తండ్రి ఎంతటి దారుణానికి ఒడిగట్టారో.. మరి కూతురిని చంపాలని చుసిన ఈ తండ్రి ఘటన గురించి అలాగే ఆడపిల్లలను చదువుకోనివ్వకుండా చేస్తున్న తల్లిదండ్రుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.