9 ఏళ్లుగా కనిపించని అక్క కోసం ఒక తమ్ముడు పడిన ఆరాటం చివరికి ఏమైందో తెలిస్తే కన్నీళ్ళే

926

ఈ ప్రపంచంలో మనుషుల మద్య ఉండే ప్రతి బందం మధురమైనదే.అమ్మ దగ్గర నుంచి అక్క చెల్లి భార్య స్నేహితుడు స్నేహితురాలు..ఇలా ప్రతి రిలేషన్ మనకు ఇంపార్టెంటే.అయితే ఇప్పుడు మీకొక విషయం చెప్పబోతున్నాను.ఇది ఒక అక్కతమ్ముడి కథ.తొమ్మిదేళ్ళుగా కనిపించని అక్క కోసం ఆరాటపడిన ఒక తమ్ముడి కథ.కనిపించిన ప్రతి ఒక్కరిని మా అక్క మీకు ఎక్కడైనా కనిపించిందా అని అడిగిన ఒక తమ్ముడి కన్నీటి కథ.మరి ఆ అక్క ఎక్కడికి వెళ్ళింది,చివరికి ఏమైంది.అక్క కోసం ఆ తమ్ముడు ఎందుకు వెతుకుతున్నాడు.మరి ఆ అక్క తమ్ముడి కథ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for brother and sister

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకేపల్లికి చెందిన మోర హన్మంతు భాగ్యనగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. నార్కట్‌పల్లి సమీపంలోని మాండ్ర గ్రామానికి చెందిన లక్ష్మయ్య, జంగమ్మ దంపతులు ఎల్బీ నగర్‌లో స్థిర పడ్డారు. వీరికి ఉపేంద్ర చారి, ప్రియాంక అని ఇద్దరు పిల్లలు. ప్రియాంకతో పరిచయం చేసుకున్న హన్మంతు ఆమెను మెల్లగా ప్రేమలోకి దింపాడు. హన్మంతును పెళ్లాడటం కోసం ప్రియాంక 2006లో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది.హైదరాబాద్ వచ్చి ఎల్బీ నగర్ లో నివాసం ఉన్నారు.అయితే ఎల్బీ నగర్ లో మూడేళ్ల తర్వాత ప్రియాంక తన సోదరుడైన ఉపేంద్ర చారికి కనిపించింది. అప్పటికే ఓ బాబుకు జన్మనిచ్చిన ఆమె.. మరోసారి గర్భం దాల్చింది. ఎల్బీనగర్‌లోని కేర్ హాస్పిటల్ సమీపంలో ప్రియాంక దంపతులు ఉంటున్న ఇంటికి ఉపేంద్ర చారి వెళ్లాడు.

Related image

కొద్ది రోజుల తర్వాత అమ్మానాన్నలను అక్కడికి వెంటబెట్టుకొని వచ్చాడు.కానీ అప్పటికే ప్రియాంక దంపతులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలిసింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో ఉపేంద్ర ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించాడు.ఉపేంద్ర చారి అక్క ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అతడు హన్మంతు వివరాల కోసం గాలించాడు.అయితే సోషల్ మీడియా ద్వారా అతని ఆచూకీ తెలుసుకుందామనుకున్న అతని ప్రయత్నం ఫలించింది.ఫేస్ బుక్ ద్వారా అతని పేరు సెర్చ్ చెయ్యగా అతని డీటెయిల్స్ వచ్చాయి.అందులో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా వెతకగా అతని ఊరు ఇల్లు ఎక్కడ ఉన్నాయో తెలిశాయి.ఇక అక్క దొరుకుంతుంది అన్న ఆనందంలో వెళ్ళిన ఉపేంద్ర చారికి అక్కడికి వెళ్ళాక ఒక షాకింగ్ విషయం తెలిసింది.తన అక్క ఉండాల్సిన ప్లేస్ లో వేరే ఎవరో మహిళా ఉంది.మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సొంతూర్లో ఆమెతో కాపురం పెట్టాడు.రెండో భార్యతో కాపురం చేసి పిల్లలను కన్నాడు లాంటి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.అక్క ఏమైందో అతనికి అర్థం కాలేదు.అయితే ఏమైంది అని తన బావను అడిగాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అప్పుడు అతను అసలు విషయం చెప్పాడు.మీ అక్క చనిపోయింది అని.అనుకోకుండ చనిపోయింది అని చెప్పాడు.అయితే ఈ విషయం గురించి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు.పోలీసుల విచారణలో.. భార్యను చంపి బావిలో పడేసినట్టు హన్మంతు అంగీకరించాడు. కొడుకును, కుమార్తెను విక్రయించినట్టు తెలుస్తోంది.ఇదంతా తెలుసుకుని ప్రియాంక తమ్ముడు ఉపేంద్ర చారి కన్నీటి పర్యంతం అయ్యాడు.తన అక్క పిల్లలను వేరు వేరుగా పెరగడానికి వీలు లేదని నేనే పెంచుకుంటా అని అతను అంటున్నాడు.వారిద్దరూ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడో తెలుసుకునే పనిలో ఉన్నాడు ఉపేంద్ర చారి.విన్నారుగా అక్క కోసం ఈ తమ్ముడు పడిన కష్టం ఎలాంటిదో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ప్రేమించానని చెప్పి ఇద్దరు పిల్లలు పుట్టాకా ఆమెను చంపిన ఆ రాక్షసుడి గురించి అలాగే అక్క కోసం ఆరాట పడిన ఆ తమ్ముడి గురించి అలాగే అక్కాతమ్ముళ్ళ మద్య ఉండే రిలేషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.