జుట్టు రాలిపోతుందని బ్యూటీపార్ల‌ర్ కు వెళ్లింది చివ‌ర‌కు ఎంతకు తెగించిందో తెలిస్తే..ఛీ కొట్టకుండా ఉండలేరు

536

జుట్టు అంటే ఏ అమ్మాయికి అయినా ఇష్టం అస‌లు అబ్బాయిలు అమ్మాయిలు జుట్టు పై ఎంతో ఇష్టం పెంచుకుంటారు ఇక జుట్టు ఊడిపోతుంది అంటే ఎంతో కృసించిపోతారు. అలాగే అమ్మాయిలు విష‌యంలో జుట్టు ఉన్నమ్మ ఎన్ని కొప్పులైనా చుడుతుంది అన్నది ఎప్ప‌టి నుంచో వినిపించే నానుడి. ఆడవాళ్లకు తమ జడ అంటే ఎంతో ఇష్టమే కాదు.. అది వారికి అలంకారం కూడా. అయితే తన జుట్టుపై పెంచుకున్న మమకారం చివరికి ఏ విద్యార్థిని ప్రాణాలను బలితీసుకుంది.. కర్ణాటకలో జరిగిన ఆ ఘటన అంద‌రికీ క‌న్నీరు తెప్పిస్తోంది..

కర్ణాటకలోని మడికెరికి చెందిన చెందిన నేహా గంగమ్మ (18) మైసూరులో బీబీఏ చదువుతోంది. ఆమెకు తల వెంట్రుకలు బాగా ఉన్నాయి. అయితే కాస్త రింగు రింగులుగా ఉన్న వెంట్రుకలను మైసూర్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌లో స్ట్రెయిటెనింగ్ చేయించింది.. ఇక అప్పటినుంచీ ఆమె జట్టు రాలడం బాగా ఎక్కువైంది. ఈ సమ‌యంలో విద్యార్థిని నేహా కనిపించకుండా పోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పెమ్మయ్యా, షైలాలు మైసూర్ జయలక్ష్మిపురం పోలీసులను ఆశ్రయించారు. గత కొద్ది రోజులుగా తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. జుట్టు సమస్యతో బాధ పడుతున్న విషయాన్ని పోలీసులకు తెలిపారు.

విచారణ చేపట్టిన పోలీసులకు శనివారం రాత్రి లక్ష్మణ తీర్థ నదిలో ఓ యువతి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందింది. నేహా వేలికి ఉన్న ఉంగరాన్ని చూసి తమ కూతురు మృతదేహమేనని గుర్తించి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్నేహ స్నేహితులను విచారించగా అసలు నిజం వెలుగుచూసింది. హెయిర్ ట్రీట్‌మెంట్ తర్వాత తన జట్టు బాగా రాలిపోతుందని నేహ బాధపడేదన్నారు. జట్టు రాలిపోయి గుండు అవుందని నేహ తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు స్నేహితులు తెలిపారు. స్నేహితులకు తన ముఖం ఎలా చూపించాలన్న దిగులుతో కొన్ని రోజుల తర్వాత కాలేజీకి రావడం మానేసింది. ట్రీట్‌మెంట్ వికటించడంతో పాటు ఎలర్జీ లాంటి సమస్యలతో, సతమతమై నేహ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని పోలీసులు నిర్ధారించుకున్నారు.

నేహ జట్టు శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పోలీసులు లాబోరేటరికి పంపించారు. జట్టుపై ఎంతో ప్రేమ పెంచుకున్న విద్యార్థిని స్ట్రెయటెనింగ్ తర్వాత తల వెంట్రుకలు మొత్తంగా ఊడిపోవడంతో బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. బ్యూటీ పార్లర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేప‌ట్టారు పోలీసులు. చూశారుగా అంద‌మైన అలంక‌ర‌ణ కోసం ఎగ‌బడితే ఇటువంటి ఫ‌లితాలే వ‌స్తాయి.