ముహూర్త టైమ్‌కు వరుడు పరార్…21 ఏళ్ళ వధువును పెళ్లాడిన 65 ఏళ్ళ ముసలాడు

367

పెళ్లి అంటే అందరికి సంతోషమే.పిల్లలు కొత్త జీవితంలోకి అడుగుపెడతారని ఇక వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి.అయితే కొందరి పెళ్లిళ్లు మండపం వరకు వచ్చి వివిధ కారణాల వలన ఆగిపోతుంటాయి.ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి కూడా పెళ్లి మండపం వరకు వచ్చి ఆగిపోయింది.ఇంకొక గంటలో పెళ్లి అనగా పెళ్లి కొడుకు జంప్ అయ్యాడు.అయినా కానీ ఆ అమ్మాయికి పెళ్లి అయ్యింది.మరి ఎవరితో అయ్యిందో తెలిస్తే వాళ్ళు అసలు మనుషులేనా అని ఖచ్చితంగా తిట్టుకుంటారు.మరి ఆ అమ్మాయికి ఎవరితో పెళ్లి అయ్యిందో అసలు ఆ అమ్మాయి పెళ్లి ఎందుకు ఆగిపోయిందో పూర్తీ వివరాలతో తెలుసుకుందాం.

Image result for marriage

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా సమీపంలోని సమష్టిపూర్‌కు చెందిన రోషన్ లాల్ (65) అనే వ్యక్తి కుమారుడుకి అదే ప్రాంతానికి చెందిన స్వప్న (21) అనే యువతినిచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.ముహూర్తం ఫిక్స్ చేసి పత్రికలూ కూడా పంచారు. వీరిద్దరి పెళ్లి ఆదివారం జరగాల్సి వుంది. ఇందుకోసం అన్ని రకాల ఏర్పాట్లూ కూడా చేశారు.పెళ్లి జరగబోతుందని ఆ అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తీరా పెళ్లి సమయం వచ్చేసింది. పెళ్లి మండపానికి బంధువులతో పాటు వధూవరులు కూడా వచ్చారు.ఇంకొక గంటలో పెళ్లి అనగా అందరికి పెళ్లి కొడుకు షాక్ ఇచ్చాడు.ముహూర్త సమయానికి వరుడు కనిపించకుండా పోయాడు.ఎవరికీ చిన్న మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు.అతను ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని,ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని తల్లిదండ్రులు బలవంతంగా ఒప్పించారని ఒకసారి అతని స్నేహితుడి దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పీటలపై పెళ్లి ఆగిపోయింది.

ఈ పెళ్లి ఆగిపోతే తమ పరువు పోతుందని భావించిన వధువు తండ్రి తన కుమార్తెను వివాహం చేసుకోవాలని వరుడు తండ్రిని ప్రాధేయపడ్డాడు.ముందు దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఎవరు ఒప్పుకోలేదు.కానీ పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిందంటే పరువు మొత్తం పోతుందని చివరికి అందరు ఒప్పుకున్నారు. దీంతో 65 యేళ్ల రోషన్ లాల్ వధువు జీవితంతో పాటు వియ్యంకుడు కుటుంబ గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు 21 యేళ్ళ వధువును పెళ్లి చేసుకున్నాడు.ఇలా వియ్యకుండు కావాల్సిన వాడు అల్లుడు అయ్యాడు.ఈ విషయం తెలిసి అందరు ఇదేమి చోద్యం అనుకుంటున్నారు.ఈ అబ్బాయి కాకపోతే మరొక అబ్బాయి దొరుకుతాడు.పరువు కోసం కూతురి జీవితాన్ని నాశనం చేస్తాడా అని అందరు అతనిని తిడుతున్నారు.అయితే ఈ ఇద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.21 ఏళ్ల అమ్మాయికి 65 ఏళ్ల ముసలోడితో పెళ్లి చేయడం గురించి అలాగే పరువు కోసం పిల్లల జీవితాలను నాశనము చేసే తల్లిదండ్రుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.