డబ్బు కోసం 80 ఏళ్ల తాతని పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల అమ్మాయి.. చివరికి ఏమైందంటే?

545

వెర్రి వెయ్యి విధాలు అని ఊరికే అనలేదు.కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది.ఒక్కోసారి అది వెర్రో లేక తెలివితక్కువ తనమో అర్థం కాదు.అలాంటి ఒక వింత పరిస్థితి గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.ఇంతకముందు ఒకసారి చైనా లో సొంత తాతను పెళ్లి చేసుకున్న మనువరాలు అనే ఒక కథ విన్నాం కదా.ఇప్పుడు మళ్ళి అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. 75 ఏళ్ల ముసలోడిని 25 ఏళ్ల అందమైన అమ్మాయి పెళ్లి చేసుకుంది. మరి వారి కథ ఏమిటో తెలుసుకుందామా.

Image result for old man marriage a young girl

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ గా మారింది.ఆ ఫొటోలో అపోలో డైరెక్టర్ రాజేష్ కుమార్ అనే వ్యక్తి ఒక 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో తప్పేముంది అని అనుకుంటున్నారా.. ఆ రాజేష్ కుమార్ వయసు ఎంతనో తెలుసా..75 ఏళ్ళు.అయితే ఈ వార్త చుసిన చాలా మంది ఇదెక్కడి న్యాయం అని కామెంట్స్ పెడుతున్నారు.అయితే ఇది ఎంతవరకు నిజమో అని తెలుసుకోడానికి ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ లో తెలిసింది ఏమిటి అంటే.. ఆ రాజేష్ అనే వ్యక్తి అపోలో డైరెక్టర్ కాదు. అతను ఒక బిజినెస్ మెన్. బాగా డబ్బున్నవాడు.అతను చాలా కష్టపడి పైకి వచ్చాడు. అతనికి మొదటి భార్య అంటే చాలా ఇష్టమంట. అయితే అతని మొదటిభార్య చనిపోయిన తర్వాత అతను తన కూతురి కన్నా తక్కువ వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీని గురించి అతనిని అడగగా అతను చెప్పిందేమిటి అంటే.. అవును నా కన్నా చాలా తక్కువ వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. దీని గురించి ప్రజలు ఏం అనుకుంటారనేది నాకనవసరం. అమ్మాయికి నాకు ఇష్టం ఉందా లేదా అనేదే నేను చూసుకుంటాను. మిగతా వాళ్ళ గురించి నాకనవసరం. నా కొడుకు కోడలికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. కానీ నా బతుకు నా ఇష్టం. నలుగురు ఏమో అనుకుంటారనే విషయం గురించి నేను పెద్దగా పట్టించుకోను. నాకు ఈ వయసులో ఆడదాని తోడు అవసరం అనిపించింది అందుకే చేసుకున్నా అని ఖరాఖండిగా చెప్పేశాడు. ఇదే విషయం గురించి పెళ్లి కూతురిని అడగగా ఆమె ఎలాంటి విషయం చెప్పలేదు. దీని గురించి మాట్లాడటానికే ఆమె ఇబ్బందిపడింది. ఇంతలా ఇబ్బంది పడిన ఆ అమ్మాయి ఏమనుకొని ఇతనిని పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయికే తెలియాలి. ఈ విషయం తెలిసిన వాళ్లైతే డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది లేకుంటే ఎవరైనా ముసలోడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారా చెప్పండి అని కామెంట్స్ పెడుతున్నారు.మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు.ఈ సంఘటన గురించి అలాగే ఈ ఆమధ్య ఇలా జరుగుతున్న విచిత్రమైన పెళ్లిల గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.