ఊహకందని ఘోరం: గర్భంతో ఉన్న మేకపై 8మంది గ్యాంగ్ రేప్, మృతి

1635

చండీగఢ్: హర్యానాలోని మేవాట్‌లో ఊహించని ఘోరం చోటు చేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు ఎనిమిది మంది యువకులు. మేకపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గర్భంతో ఉన్న నోరులేని ఆ మూగజీవిపై వారు ఆకృత్యానికి ఒడిగట్టారు. ఈ ఎనిమిది మంది యువకులు పశువాంఛకు తాళలేని మూగజీవి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ నెల 25న ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై మేక యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దారుణానికి పాల్పడిన వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో అయిదుగురు పరారీలో ఉన్నారు. ఈ సంఘటన గురుగ్రామ్‌కు 73 కిలోమీటర్ల దూరంలోని మరోడ గ్రామంలో జరిగింది. పట్టుబడిన ముగ్గురిని స్థానికులు కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఎనిమిది మందిపై 377 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి నంజీన్ బాషిన్ తెలిపారు.

Image result for goat

తన షెడ్డు నుంచి మేక అదృశ్యమైందని మేక యజమాని చెప్పాడు. గతంలో తన నాలుగు మేకలలో మూడు దొంగిలించబడ్డాయని, ఈ మేక ఒక్కటే మిగిలి ఉండేనని, బుధవారం రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటికి అనుకొని ఉన్న మేకల షెడ్డు నుంచి శబ్ధం వినిపించిందని, ఆ తర్వాత చూస్తే మేక కనిపించలేదని, దీంతో తాను, మరికొందరు కలిసి దాని కోసం వెతికామన్నారు.

Pregnant goat dies after being gangraped by 8 men in Haryana

ఓ చోట ముగ్గురు తన మేకను సెక్సువల్‌గా వేధిస్తున్నట్లు గుర్తించానని సదరు మేక యజమాని చెప్పాడు. వారిని పట్టుకొని, గ్రామస్తులం చితకబాదామన్నారు. మరో ఐదుగురు కూడా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆ ముగ్గురు తెలిపారన్నారు. బ్రెయిన్ హ్యామరేజ్ కారణంగా మేక చనిపోయిందని, అది 50 వారాల గర్భంతో ఉందని వెటర్నరీ సర్జన్ రామ్ వీర్ భరద్వాజ్ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో మేకకు బ్లడ్ బ్లీడ్ అయినట్లుగా గుర్తించినట్లు తెలిపారు..

జ‌గ‌న్ పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు ఆపాలి వైసీపీ సరికొత్త అటాక్