మనదేశంలో పాటించే 7 అసహ్యకరమైన మూఢ నమ్మకాలు

665

మన దేశంలో ఎన్నో ఆచారాలు పద్దతులు ఉన్నాయి.అలాగే మూడ నమ్మకాలు కూడా ఉన్నాయి.ఆచారాలు పద్ధతులకు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది.కానీ మూడ నమ్మకాలకు ఎలాంటి రీజన్స్ ఉండవు.గుడ్డిగా వాటిని నమ్ముతారు.అయితే వీటిని నమ్మే వారి నిస్సాహయతను క్యాష్ చేసుకోడానికి మంత్రగాళ్లు, దొంగబాబాలు కొన్ని పనికిరాని, ప్రయోజనం చేకూర్చలేని సలహాలిస్తారు.ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబందించిన కొన్ని విషయాలలో వీటిని ఎక్కువగా పాటిస్తారు.వాళ్ళకు ఏదైనా చిన్న జ్వరం లాంటిది వచ్చిన కూడా ఏదో అయ్యిందని పనికిరాని మూడ నమ్మకాలను ఉపయోగించి తంత్రాలు తయాత్తలు కడతారు.అలాంటివి ఎన్నో ఉన్నాయి.అందులో కొన్ని వినడానికి అసహ్యంగా కూడా ఉంటాయి.వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

15151491_1775750639345179_1485156668_n

పిల్లలు పుట్టని దంపతుల పాట్లు అన్నీ ఇన్నీ కావు.దానికోసం వారు ఏదైనా చేస్తారు. ఇప్పటికీ చాలా మంది గ్రామప్రజలు పిల్లలు పుట్టడం లేదని, అప్పుడే పుట్టిన శిశువు బొడ్డుతాడును తెచ్చుకొని దానితో టీని కాచి అది తాగుతారు.అలా చేస్తే గర్భం వస్తుందని వారి నమ్మకం.ఇది ఒట్టి అపోహ మాత్రమే.దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.దీని వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.చిన్న పిల్లలకు టీకాలిచ్చి జ్వరం రాకుండా ఉండడానికి మనిషి మలాన్ని దాని మీద పూస్తారు.ఇలా చేస్తే పిల్లలకు ఇన్పెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు ఇలా చేస్తే చాలా ప్రమాదకరం.అప్పుడే పుట్టిన పాపాయి బొడ్డును కట్ చేసి అక్కడ ఆవుపేడను పులుముతారు.

15175400_1775750649345178_1767852146_n

ఇది ధనుర్వాదానికి కారణం అవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.బోదకాలు వచ్చినప్పుడు ఆ కాలితో ఏనుగు పేడను తొక్కుతారు.బోదకాలికి-ఏనుగు పేడకు సంబంధమే లేదు.ఇది అనవసర నమ్మకం.తేలు కుడితే దాని తోకను కట్ చేసి దాని మొండాన్ని కుట్టిన చోట కడతారు.ఇలా చెయ్యడం వలన భయంతో ఇంకాస్త నొప్పి వస్తుంది తప్ప ప్రయోజన శూన్యం.పిల్లలకు పళ్లు వస్తున్నప్పుడు విరేచనాలు పట్టుకుంటాయి. ఈసమయంలో పులిగోరును పిల్లల మెడలో కడతారు.దీని వలన పులిగోరు గుచ్చుకోవడం వల్ల పిల్లలకు గాయాలు అవ్వడం మినహా ఎటువంటి ప్రయోజనం ఉండదు.విషం తాగిన వారికి విరుగుడు కోసం మనిషి మలాన్ని తాపిస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మలం అంటే శరీరంలోని వ్యర్థ పదార్థం దాని వల్ల విషం విరుగుడు అవుతుంది అనుకోవడం అవివేకం.ఇలా చేస్తే రోగాలు వచ్చే అవకాశం ఉంది తప్ప విషం ఎఫెక్ట్ మాత్రం పోదు.మన శరీరంలో ఎక్కడైనా కాలితే ఆ ప్లేస్ లో ఆవుపేడ పూస్తారు..ఇది అంటురోగాలకు కారణం అవుతుంది తప్ప మన గాయం తగ్గదు.ఇవేనండి మనలో చాలా మంది పాటించే కొన్ని అసహ్యకరమైన మూడనమ్మకాలు. వినడానికే కొంచం అసహ్యంగా ఉంది కదూ.ఇప్పటికైనా వీటి వలన ఉపయోగం ఉండదు అని తెలుసుకుని మూడ నమ్మకాలను వదిలేయండి.మరి మేము చెప్పిన విషయల మీద మీరేమంటారు.ఈ పనికిరాని మూడ నమ్మకాల మీద అలాగే టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా కూడా ఇప్పటికి మూడ నమ్మకాలను పాటించే వారి మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.