టూ వీలర్ కు 63వేల రూపాయిల ఫైన్ రాసిన పోలిస్..దాంతో ఆ వెహికల్ ఓనర్ చేసిన పనికి తలలు పట్టుకుంటున్నా పోలీసులు..

545

ట్రాఫిక్ ను నియంత్రించే బాధ్యత ట్రాఫిక్ పోలీసులది.ఎవరైనా రూల్స్ తప్పితే వాళ్ళకు జరిమానా విదించడం ట్రాఫిక్ పోలిసుల విధి.ప్రభుత్వం కూడా వాళ్లకు ఈ మద్య సకల సదుపాయాలు కల్పించింది.అయితే సామాన్యుల పట్ల కొందరు పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.అయితే పోలీసులకు కూడా చుక్కలు చూపించే సామాన్యులు కొందరు ఉంటారు.ఈ మద్యనే ఫైన్ వేశాడని ఒక సామాన్యుడు పోలీసులతో ఎలా అడుకున్నాడో ఆ విషయం ఎంత వైరల్ అయ్యింది మనమందరం చూసాం.ఇప్పుడు మరొక సామాన్యుడు పోలిసులకే జలక్ ఇచ్చాడు.తన బండిపై ఫైన్ వేస్తే అతను చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది,మరి ఏం జరిగిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for traffic police checking

కర్నాటక రాష్ట్రం మైసూర్ సిటీకి చెందినది ఒక టూ వీలర్ వెహికల్ మీద నో హెల్మెట్, అధిక వేగం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ అంటూ ఇలా ఏకంగా 635 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క టూ వీలర్ పై ఇంత అధిక మొత్తంలో కేసులు నమోదు కావటం దేశంలో ఇదే ప్రధమం.ఆ వేహికల్ ఓనర్ మధుకుమార్.ఆ బండి ఏవిధంగా నడుపుతున్నాడో తెలియదు కానీ కెమెరా ఉన్న ప్రతి పోలీస్ కంట్లోనూ ఈ వాహనం పడింది. దీంతో అలా కనిపించిన ప్రతీసారి చలానాలు విధిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆగస్ట్ 3వ తేదీ శుక్రవారం రాచనగరి పోలీసులకు ఈ వాహన దారుడు దొరికాడు. పట్టుకున్న వాహనాన్ని వదల్లేదు.ఇక అన్ని ట్రాఫిక్ వైలేషన్స్ ను కలుపుకుని మొత్తంగా ఓ పెద్ద చీటీ మధుకుమార్ చేతిలో ఉంచారు. అతను ఒక్కసారిగా షాక్ ఇంతకీ జరిమానా ఎంతో తెలుసా- 63వేల 500 రూపాయలు.దెబ్బకు కళ్లుతిరిగి పడ్డాడు.

Image result for traffic police checking

వెహికల్ నెంబర్ KA 09 HD 4732 తరువాత బండితోపాటు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు మధుకుమార్. మొత్తం 63వేల 500 రూపాయలు చెల్లించి బండి తీసుకువెళ్ళమని అతనికి పోలీసులు తేల్చిచెప్పారు. ఏ మాత్రం డిస్కొంట్ లేదని కూడా స్పష్టం చేశారు. తరువాత ఓ నిర్ణయానికి వచ్చిన మధుకుమార్ ఇక రెండో ఆలోచన లేకుండా ఇక ఈ బండి అమ్మినా ఇంత డబ్బు రాదు.కనుక మీకు కట్టే ఫైన్ తో కొత్త బండి కూడా కొనుక్కోవచ్చు.బండిని మీరే ఉంచుకోండి అంటూ స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. అసలు అన్ని సార్లు రూల్స్ ఎలా బ్రేక్ చేశానో నాకే తెలియదు అంటున్నాడు మధుకుమార్.

ఓ వైపు పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూనే అంత డబ్బు కట్టే స్థోమత కూడా లేదంటున్నారు. ఇక మధుకుమార్ వ్యవహారంతో ఇప్పుడు పోలీసులు తల పగిలిపోతుంది. స్టేషన్ లో ఆ బండి భద్రంగా దాచారు. పోలీసులు ఇప్పుడు ఆ బండిని వేలం వేసినాకూడా అంత డబ్బు రాదు. అసలు జరిమానాలో సగం కూడా రాదని ఖాకీలే చెబుతున్నారు.విన్నారుగా పోలీసులు వేసిన ఫైన్ కట్టలేక స్కూటీని ఎలా వదిలేసి పోయాడో.మరి ఈ ఘటన గురించి అలాగే పోలిసులకే చుక్కలు చూపించిన ఈ సామాన్యుడి గురించి అలాగే సామాన్యుల పట్ల తీవ్రంగా వ్యవహరిస్తున్న పోలిసుల గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.