ఆరేళ్ల పిల్ల రూ.55 కోట్ల ఇల్లు కొనేసింది ఆమె ఏం చేస్తుందో తెలిస్తే మతిపోవడం ఖాయం

95

కొందరు పుట్టుకతోనే కోటీశ్వరులు అవుతారు, మరికొందరు పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు అదృష్టం కలిసిరావడంతో కోటీశ్వరులు అవుతారు. ఇక్కడ ఓ చిన్నారి ఆమె పుట్టిన తర్వాతే ఆ కుటుంబాన్ని కోటీశ్వరులుగా మార్చేసింది, నిజంగా ఇది మిరాకిల్ అని చెప్పాలి. ఆరు నెలలకే పదాలు వల్లించే వాళ్లు కొందరైతే 8 నెలలకే చక్కగా పదాలు వల్లించేవాళ్లు మరికొందరు ఉంటారు. రెండు మూడేళ్లకే జీకేలో రాటుదేలుతుంటారు ఇంకొందరు. కొందరైతే ఐదేళ్లు నిండగానే చిట్టిచిట్టి పనులు చేసి, చిల్లర కూడా సంపాదిస్తుంటారు. అలాంటి ఓ చిన్నారి కథ ఇది. ఆ పిల్ల వయసు కేవలం ఆరేళ్లే. కానీ కష్టార్జితంతో ఏకంగా రూ. 55 కోట్లు విలువైన ఇంటిని కొనిపడేసింది. ఇంతకీ ఆమె ఏం చేస్తుంది అసలు స్కూలుకు వెళ్లాల్సిన వయసులో 55 కోట్లు ఎలా సంపాదించింది నిజంగా ఇది వండర్ అని చెప్పాలి. మరి ఆ స్టోరీ ఏమిటో చూద్దాం.

Worth Rs 55 Crores........

దక్షిణ కొరియాకు చెందిన ఆ చిన్నారి పేరు బోరామ్. చిన్నప్పటి నుండి బొమ్మలన్నా, వాటిపై వీడియోలన్నా పిచ్చి. ఆమె పిచ్చిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో బోరామ్ యూట్యూబ్ చానల్ పెట్టేసింది. దానికి ఏకంగా 1.36 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీడియో బ్లాగులో అయితే ఏకంగా 1.76 కోట్ల మంది చేరారు. 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న బోరామ్ టాయ్స్ నిపుణురాలు. మార్కెట్లోకి వచ్చిన కొత్త టాయ్స్ బాగోగుల విశ్లేషిస్తూ వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. కోట్లమంది వీక్షకులు వాటిని చూస్తుండంతో యాడ్స్ ద్వారా కోట్ల ఆదాయం వస్తుంటుంది.

ఈ క్రింద వీడియోని చూడండి

బోరామ్ నెలకు సగటున రూ. 10 కోట్లు తన ఖాతాలో వేసుకుంటుంది. అలా సంపాదించి డబ్బుతో ఇటీవల రూ. 55 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసింది. సియోల్ శివారు గాంగ్నామ్ ప్రాంతంలో ఉన్న ఆ ఐదంతస్తుల ఇంటి విస్తీర్ణం 2,770 గజాలు. అయితే బోరామ్ అప్పుడప్పుడు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ఆ పిల్ల బాల్యాన్ని ఆస్వాదించకుండా డబ్బుల యంత్రంగా మార్చారంటూ తల్లిదండ్రులపై గతంలో కేసు కొందరు కేసు పెట్టారు. అయితే ఆమె ఇష్టాన్ని తల్లిదండ్రులు గుర్తించడంతో పాటు ఆమెని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది దేశ మీడియాలో కూడా ఎంతో హైలెట్ గా నిలిచింది.. ఆ చిన్నారి వీడియోలు చూసేందుకు లక్షలాది మంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలా ఆమె సోషల్ మీడియాలో పాపులర్ స్టార్ అయిపోయింది. ఇక స్కూల్లో విద్యార్దులు కూడా ఆమె వీడియోలు చూస్తు ఆమెని అనుసరిస్తున్నారు.ఇలా ఆరు సంవత్సరాలలో ఆ తల్లిదండ్రులు అనేక అవార్డులు అందుకున్నారు. చూశారుగా ఆ చిన్నారి సక్సెస్ స్టోరీ, తల్లిదండ్రులు చిన్నతనం నుంచి పిల్లల్లో ఉన్న ఇష్టాన్ని టాలెంట్ ని వెతికితే వారు చాలా తక్కువ సమయంలోనే హైట్స్ రీచ్ అవుతారు అని చెప్పవచ్చు. మరి బొరాయ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది. ఇలాంటి వండర్ కిడ్స్ ఎవరైనా ఉంటే వారి గురించి కామెంట్ ల రూపంలో తెలియచేయండి.