ఈమె వయస్సు 72 ఏళ్లు.. ఇప్పటివరకు ఎన్నిసార్లు గర్భవతి అయిందో తెలిస్తే షాకవుతారు..

525

ఆమె వయస్సు 52 ఏళ్లు… ఇప్పటికే 9 మంది సంతానం.. మళ్లీ గర్భం దాల్చింది. పదవ బిడ్డను జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వ ఆస్పత్రిలో విషయం తెలిస్తే కుటుంబ నియంత్రణ చేస్తారన్న భయంతో ఆమె భర్తతో కలిసి అదృశ్యమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆమె కోసం తన బంధువులు గాలిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు… ఆమె లక్ష్యం ఏమిటి…? తమిళనాడు రాష్ట్రంలోని వెతియన్గుడికి చెందిన ఆరాయి వయస్సు 52 ఏళ్లు. ఇప్పటికే ఆమె తొమ్మిదిమందికి జన్మనిచ్చింది. ఇప్పుడు పదవ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమైంది.

52 year old woman pregnant for the 10th time, escapes from hospital

గర్భంతో ఉన్న ఆరాయి కడుపులో కొంత ఇబ్బందిగా ఉండటంతో సింగవనం అనే గ్రామంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు…. డెలివరీ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి తెలిపారు. అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఆమెకు 9మంది సంతానం ఉన్నారన్న సంగతి తెలిస్తే వైద్యులు ఎక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారేమోనని ఆమె భర్త ఆనందన్‌తో కలిసి హాస్పిటల్ నుంచి పారిపోయింది.

Image result for pregnancy

ఇప్పటికే 52ఏళ్ల ఆరాయి పదిసార్లు గర్భం దాల్చించి. అయితే 10 మంది పిల్లలకు జన్మనివ్వగా అందులో ఒక బిడ్డ మృతి చెందడంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. చివరిసారిగా 13 ఏళ్ల క్రితం ఆరాయి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అందరికీ ఇంట్లోనే జన్మనిచ్చింది ఆరాయి. అందులో నలుగురికి ఇప్పటికే వివాహం కూడా అయ్యింది. ఇన్నిసార్లు గర్భం దాల్చినా ఎప్పుడూ హాస్పిటల్‌కు వెళ్లింది లేదని ఆమె బంధువులు చెబుతున్నారు. 16మంది పిల్లలకు జన్మనివ్వాలనేది ఆ దంపతుల కోరిక అని అది తరుచూ తమతో చెప్పేదని బంధువులు చెప్పారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నాలుగు నెలల క్రితం ఆమె తక్కువ రక్తంతో ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. అయితే ఆ సమయంలో రెండు యూనిట్ల రక్తం కూడా ఎక్కించినట్లు వైద్యులు తెలిపారు. ఇది సింగనవనం హాస్పిటల్‌లో రక్తం ఎక్కించేందుకు వెసులుబాటు లేకపోవడంతో పుడుకొట్టాయ్ మెడికల్ కాలేజీకి తరలించి అక్కడ రక్తం ఎక్కించామని ఆ తర్వాత ఆరాయి దంపతులు కనిపించకుండా పోయి మళ్లీ రెండునెలల క్రితం కనిపించినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత మళ్లీ కనిపించిందని … వెంటనే పుదుకొట్టాయ్ ప్రభుత్వాస్పత్రిలో చేరాలని సూచించగా… ఇక మళ్లీ కనిపించకుండా పోయిందని చెబుతున్నారు వైద్యులు.