50 ఏళ్లకు దొరికిన విమానం ఇప్పుడు అందులో ఏమున్నాయో చూస్తే షాక్

67

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. అందుకే విమాన ప్రయాణం అంటేనే జనం బెంబెలెత్తిపోతున్నారు. ముఖ్యంగా కనెక్టింగ్ విమానాలకు ట్రాఫిక్ పెరిగింది అని చెబుతున్నారు ఉద్యోగులు. అలాగే ఆర్మీ వైమానిక దళాలకు చెందిన విమానాలు కూడా పెద్ద ఎత్తున సెక్టార్లలో ప్రమాదాలకు గురి అవుతున్నాయి, కొన్ని విమానాలు మాత్రం సముద్రం గుండా కొండల మధ్యన వెళ్లడంతో కనిపించకుండా పోతే, వాడిజాడ కూడా తెలుసుకోవడం కష్టం.. కాని తాజాగా దాదాపు 50 ఏళ్ల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమానం అవశేషాలను గుర్తించారు వైమానిక దళ సిబ్బంది… ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్‌-12-534 విమానం 1968 ఫిబ్ర‌వ‌రి 7న గ‌ల్లంతైంది. అప్ప‌టి నుంచి ఆ విమానం ఆచూకీ తెలియ‌లేదు. తాజాగా ఆదివారం ఈ విమాన శకలాలు ఢాకాలో బయటపడ్డాయి. 50 ఏళ్ల క్రితం గ‌ల్లంతైన విమానం ఆచూకీపై అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాచారం లేదు.

Related image

2003లో హిమాలయ‌న్ మాంట‌నేరింగ్ ఇనిస్టిట్యూట్‌ సభ్యులు త‌మ ఆచూకీలో ఈ విమానంలో జ‌ర్నీ చేసిన సిపాయ్‌ బేలీరామ్‌ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఆ విమానం ఎక్క‌డైనా దొరుకుతుంద‌న్న చిన్న ఆశ ఎక్క‌డో మిగిలి ఉంది. దీంతో భార‌త వాయుసేన మ‌రోసారి గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసింది. దీంతో 2007లో ఈ విమానంలో ఉన్న వారిలో మ‌రో రెండు మృత‌దేహాలు కూడా ల‌భ్య‌మ‌య్యాయి. ఇక 2009 నుంచి ఈ విమానం ఆచూకి చ‌ర్య‌లు ఆపేశారు.

Image result for flight

గ‌త జూలైలో బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకా గ్లేషియ‌ర్‌లో ఈ విమానానికి సంబంధించిన శ‌క‌లాలు ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో ఎయిర్‌ఫోర్స్ మ‌రోసారి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా ఆదివారం విమానానికి సంబంధించిన ప్ర‌ధాన భాగాలు దొరికాయి. ఏరో ఇంజిన్‌, ఎలక్ట్రిక్‌ సర్క్యూట్స్‌, ఇంధన ట్యాంక్‌ యూనిట్‌, ఎయిర్‌బ్రేక్‌ అసెంబ్లీ, కాక్‌పిట్‌ డోర్‌ తదితర భాగాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.భార‌త ఎయిర్‌ఫోర్స్ చ‌రిత్ర‌లో జ‌రిగిన అత్యంత ఘోర‌మైన విమాన ప్ర‌మాదాల్లో ఒక‌టిగా దీనిని చెపుతారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో వెళుతున్న ఈ విమానం కొద్ది సేప‌ట్లో ల్యాండ్ అవుతుంద‌న‌గా మాయ‌మైంది. ల్యాండింగ్‌కు ముందు వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో విమానాన్ని వెనక్కి మళ్లించాలని గ్రౌండ్‌ కంట్రోల్‌ సిబ్బంది పైలట్‌కు సమాచారమిచ్చారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆ ఆదేశాల‌తో ఫైలెట్ విమానాన్ని వెంట‌నే ఛండీగ‌డ్‌కు మ‌ళ్లించారు. అయితే మ‌ధ్య‌లోనే ఈ విమానానికి కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ త‌ర్వాత 50 ఏళ్ల పాటు ఈ విమానం ఆచూకి తెలియ‌కుండా పోయింది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు దీని ఆచూకి తెలిసింది. గల్లంతయిన వారి కుటుంబాలకు మాత్రం ఇది మిస్టరీగానే వారికి ఉండిపోయింది, చాలా మంది ఆ కుటుంబాల వారు ఇప్పటికీ తమకు విషాదమైన ఘటనగా దీనిని చెబుతారు. ఇక ఆ విమానానికి సంబంధించి కేవలం ఇంజన్ భాగం అలాగే టాప్ భాగాలు మాత్రమే ఉన్నాయని, అందులో సిబ్బందికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలియచేశారు అధికారులు.