ప్ర‌పంచంలో 5 వింత జైళ్లు.. అక్క‌డ ఖైదీల‌కు వారు విధించే శిక్ష‌లు చూస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

802

శ్రీకృష్ణ జ‌న్మ‌స్దలం అంద‌రూ ఉప‌యోగించే మాట దానిపేరే జైలు… ఈ పేరు విన‌గానే అంద‌రికి భ‌యం వేస్తుంది, ఆ త‌ర్వాత కంగారుతో కూడిన ద‌డ వ‌స్తుంది.. నిజంగా జైలు అనే పేరు విన‌గానే టెన్ష‌న్ వ‌చ్చి కాసేపు మ‌తి స్దిమితం కోల్పోతారు.. కానీ అన్నీ తీహార్ జైలులా ఉండ‌వ‌ని, కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు, 5 స్టార్ హూట‌ల్స్ ఎలా ఉంటాయో అలాంటి జైళ్లు కూడా ఉంటాయ‌ట‌… ఇక మాములు సాధార‌ణ జైళ్ల‌కు వీటికి అస‌లు పొంత‌నే ఉండ‌ద‌ట‌.. కొన్ని దేశాల్లో జైళ్ల‌కు వెళితే జీవితంలో జైలుకు రాకూడ‌దు అనిపిస్తుంది… కాని కొన్నిదేశాల్లో జైళ్ల‌కు వెళితే మాత్రం జీవితాంతం ఇక్క‌డే ఉండాల‌నిపిస్తుంద‌ట‌.కొన్ని జైళ్ల‌ల్లో ఎంత పెద్ద త‌ప్పు చేసినా రాజ‌భోగాలు అన్నీ క‌ల్పిస్తార‌ట‌.. వీఐపీల‌కు ఇచ్చే స‌క‌ల సౌక‌ర్యాలు స‌దుపాయాలు ఇస్తార‌ట‌.. ద‌ర్జాగా అన్నీ సౌక‌ర్యాలు అక్క‌డ దేశ ప్ర‌భుత్వాలే క‌ల్పిస్తాయి ఖైదీలకు .. మ‌న దేశంలో అయితే నాయ‌కుల‌కు దొంగ‌చాటుగా ఇలాంటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తారు అనే ప్ర‌చారం ఉంది.. కాని ఇత‌ర దేశాల‌లో అంతా బ‌హిరంగ ర‌హ‌స్యంగానే ఉంటాయి. అలాంటి ప్ర‌పంచంలో ఉన్న టాప్ క్లాస్ జైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

“జ‌స్టిస్ సెంట‌ర్ లియోబ‌న్ ప్రిజ‌న్”ఈ జైలు ఆస్ట్రియా దేశంలో ఉంది..ఈ జైలు ఫైవ్ స్టార్ హూట‌ల్ ని మించి ఉంటుంది..ఈ జైలులో దాదాపు 205 మంది ఖైదీల‌ను ఉంచ‌వ‌చ్చు.. ఇక్క‌డ ఆడుకోవ‌డానికి ఇండోర్ గేమ్స్ అలాగే వ్యాయామాల‌కు జిమ్ ఉంటుంది.. అలాగే ఎంత సేపు అయినా రిలాక్స్ గా కూర్చోవ‌చ్చు.. వారికి కావలసిన‌ పుస్త‌కాలు తీసుకువ‌స్తారు, అలాగే వారికి చ‌దుకుకొనేందుకు రోజూ పేప‌ర్లు ఉంటాయి… ఇక్క‌డ జైలు అధికారులు ఇచ్చే డ్రైస్సెస్ వేసుకోవాలి అనే నిబంధన లేదు… ఖైదీల‌కు ఇష్టం వ‌చ్చిన డ్రెస్సులు వేసుకోవ‌చ్చు స్పెష‌ల్ కిచెన్ స్పెష‌ల్ బాత్రూం స‌దుపాయం వారికి ఉంటుంది. వారికి న‌చ్చిన‌ది వండుకోవ‌చ్చు అవే తిన‌చ్చు.”జేవియా ఫ్యూల్స్ బ్రూట‌ర్ ప్రిజ‌న్”ఈ జైలు బ‌య‌ట నుంచి చూస్తే అచ్చం రాజుల కోట‌లా ఉంటుంది.. ఇక్క‌డ ఖైదీలకు చాలా విలాస‌వంత‌మైన గ‌దులు కేటాయిస్తారు.. ఎంత అంటే? ఓ చిన్న‌సైజు డూప్లెక్స్ ఇళ్లు ప్ర‌దేశం ఎంత ఉంటుందో అంత పెద్ద పెద్ద గ‌దులు ఇస్తారు.. ఇది జ‌ర్మ‌నీ దేశంలో ఉంది… ఇక్క‌డ అపార్ట్ మెంట్లు గేటెడ్ క‌మ్యునిటీల్లో నివ‌సిస్తే ఎటువంటి స‌దుపాయాలు ఉంటాయో అలాంటి స‌దుపాయాలు ఇక్క‌డ ఖైదీల‌కు ఉంటాయి… ఇక్క‌డ‌కు రావ‌డానికి ఖైదీలు ఆనందంగా భావిస్తారు.. అయితే ఒక‌సారి వ‌చ్చిన ఖైదీలు మ‌ర‌లా ఇక్క‌డ‌కు రారు, ఎందుకంటే వారు ఇక జీవితంలో త‌ప్పులు అనేవి చేయ‌రు.. వారికి ఇక్క‌డ అటువంటి శిక్ష‌ణ ఇస్తారు జైలు అధికారులు.

Related image

“సులెంటినా ప్రిజ‌న్”ఈ జైలు స్వీడ‌న్ దేశంలో ఉంది.. అతి విలాస‌వంత‌మైన జైలుగా దీనికి పేరు ఉంది.. ఇక్క‌డ ఖైదీల‌ను పోలీసులు ఏమీ అన‌రు.. ఖైదీల‌కు పూర్తి స్వాతంత్య్రం ఉంది.. ఇక్క‌డ ఖైదీలు చ‌దువుకునేందుకు పుస్త‌కాలు ఇస్తారు అలాగే వారికి స‌క‌ల స‌దుపాయాలు ఉంటాయి.. ఆహారం కూడా వారికి తెచ్చిపెట్ట‌రు వారికి న‌చ్చింది వండుకు తిన‌మ‌నేసౌల‌భ్యం క‌ల్పించారు.. అలాగే ఇక్క‌డ టీవీ సౌక‌ర్యం కూడా ఉంది.

“అరంజుట్ ప్రిజ‌న్ స్పెయిన్”ఈ జైలులో ఆడ‌వారికి ప్ర‌త్యేకంగా స‌దుపాయాలు ఉన్నాయి.. ఇక్క‌డ మ‌హిళా ఖైదీల‌కు ప్ర‌స‌వం అయితే వారి బిడ్డ‌ల‌ను వారితో పాటే దాదాపు మూడు సంవ‌త్స‌రాల వ‌ర‌కూ ఉంచుకోవ‌చ్చు.. ఆ పిల్ల‌లు ఆడుకోవ‌డానికి స‌క‌ల స‌దుపాయాలు క‌ల్పిస్తారు.. ఆట బొమ్మ‌ల నుంచి మంచి ఆహారం వ‌ర‌కూ అన్నీ అందిస్తారు జైలు అధికారులు త‌ర్వాత వారిని బ‌య‌ట‌కు పంపించేస్తారు.. ఆ పిల్ల‌ల సంర‌క్ష‌ణ మాత్రం ఆమె కుటుంబం చూసుకుంటుంది.. ఇక శిక్ష పూర్తి అయ్యేలోపు పిల్ల‌ల‌ను చూసేందుకు అనుమ‌తి ఇస్తారు జైలులో.

“బ‌స్టోరీ ప్రిజ‌న్”బ‌స్టోరీ అనే ద్వీపంలో ఈ జైలు ఉంది.. అందుకే దీనిపేరు బ‌స్టోరీ ప్రిజ‌న్ అని పెట్టారు.. ఈ ద్వీపంలో ఖైదీల‌కు చాలా స్వేచ్చ ఉంటుంది… వారు చేప‌లు ప‌ట్టి ఆ చేప‌ల‌ను వండుకుంటారు.. అలాగే ఖైదీలు గుర్ర‌పు స్వారీ చేసుకోవ‌చ్చు, ఇలాంటి ఎన్నో సౌక‌ర్యాలు ఆ జైల్లు క‌ల్పిస్తున్నాయి.. చూశారుగా ఇలాంటి జైళ్లు మ‌న దేశంలో ఉంటే ప‌రిస్దితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోండి.. మ‌న ఖ‌జానా అంతా జైళ్ల‌కే స‌రిపోతుంది.. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి..