ఏపీ తెలంగాణ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక 48 గంట‌లు హై అల‌ర్ట్

531

గత ఐదురోజులుగా సాయంత్రం సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలు మధ్యాహ్నం వరకు ఎండగా ఉంటూ.. సాయంత్రానికి పెద్ద పెద్ద ఉరుములతో కురుస్తున్న భారీ వర్షంలో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. సిటీలో సాయంత్రం పూట‌ వర్ష బీభత్సం కొనసాగుతోంది. నగరంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా రెండు రోజులుగా కుండపోత వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లుతున్నాయి.

Image result for heavy rains

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, పంజాగుట్ట, బోరబండ, ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. రోడ్లపై నిలిచిన వాన నీటిని పంపించడానికి సిబ్బంది శ్రమిస్తున్నారు. పలుచోట్ల మ్యాన్‌హోళ్ల మూతలు తెరిచి వరద నీటిని పంపిస్తున్నారు. ఈ స‌మ‌యంలో పాదచారులు బిక్కు బిక్కు మంటున్నారు. ఇక రోజు మాదిరి ఈరోజు కూడా భారీ వర్షం కురవడంతో నగరంలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతోపాటు భారీ పిడుగు కూడా పడింది. ఛాదర్‌ఘాట్ ప్రాంతంలోని ఓల్డ్ మలక్‌పేట రేస్‌కోర్టు సమీపంలో ఓ ఇంటిపై పిడుగు పడటంతో ఇంటి గోడలు బీటలు వారాయి. భారీ శబ్దం రావడంతో ఇంట్లో నివసిస్తున్నవారు బయటకు పరుగులు తీశారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. రోడ్లపై నిలిచిన వాన నీటిని పంపించడానికి సిబ్బంది శ్రమిస్తున్నారు. పలుచోట్ల మ్యాన్‌హోళ్ల మూతలు తెరిచి వరద నీటిని పంపిస్తున్నారు. ఈ స‌మ‌యంలో పాదచారులు బిక్కు బిక్కు మంటున్నారు. ఇక రోజు మాదిరి ఈరోజు కూడా భారీ వర్షం కురవడంతో నగరంలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతోపాటు భారీ పిడుగు కూడా పడింది. ఛాదర్‌ఘాట్ ప్రాంతంలోని ఓల్డ్ మలక్‌పేట రేస్‌కోర్టు సమీపంలో ఓ ఇంటిపై పిడుగు పడటంతో ఇంటి గోడలు బీటలు వారాయి. భారీ శబ్దం రావడంతో ఇంట్లో నివసిస్తున్నవారు బయటకు పరుగులు తీశారు.

Image result for heavy rains

మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఏపీ సరిహద్దు రాష్ట్రం ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోకూడా బుధవారం, గురువారం అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తాజా బులిటిన్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే పలు ఛత్తీస్‌గడ్‌తో పాటు పశ్చిమబెంగాల్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. అందుకే మ‌రో 48 గంట‌లు భారీ వర్ష సూచ‌న ఏపీ తెలంగాణ‌కు కూడా ఇస్తున్నారు, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వాతావ‌ర‌ణ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి