సంగారెడ్డిలో ఘోరం: లోయలో పడ్డ 40 మంది ప్రయాణిస్తున్న బస్సు.. షాక్ లో కేసీఆర్

417

ఇటీవ‌ల తెలంగాణ‌లో కొండ‌గ‌ట్టు వ‌ద్ద బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగి ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు ఆర్టీసీ ప్రయాణికులు త‌మ ప్రాణాలు పోగొట్టుకున్నారు, అనేక మంది ఈ సంఘ‌ట‌నపై విచారం వ్య‌క్తం చేశారు.. దైవ ద‌ర్శ‌నం నుంచి వ‌స్తూ లోయ‌లో బ‌స్సు ప‌డిపోవ‌డంతో పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం సంభ‌వించింది.

తాజాగా ఇలాంటి మ‌రో రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది .. సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలం దేగులవాడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితుల్లో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పొగమంచు వల్ల మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. కంగ్టి నుంచి కర్ణాటక వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్ర‌భుత్వ అధికారులు పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని వారికి మెరుగైన వైద్యం అందిచేందుకు త‌ర‌లించారు. ద‌గ్గ‌ర్లో ఆస్ప‌త్రిలో వారికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.. ఇక ఇలా రోడ్డు ప్ర‌మాదం జ‌ర‌గ‌డం పై తెలంగాణలో బ‌స్సు ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి అని కోరుతున్నారు ప్ర‌జ‌లు.

ముఖ్యంగా ఓవ‌ర్ స్పీడ్ అలాగే వాహ‌నాలు అడ్డ‌దిడ్డంగా పార్క్ చేసి ఉండ‌టం వ‌ల్ల ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి అని చెబుతున్నారు చాలా మంది రాత్రిపూట కూడా మ‌ద్యం సేవించి ఎవ‌రూ వాహ‌నాలు న‌డ‌ప‌కూడ‌దు అని ఇలా వాహ‌నాలు న‌డిపితే క‌చ్చితంగా వారికి శిక్ష ప‌డాలి వారి లైసెన్స్ వాహ‌నం సీజ్ చేయాలి అని కోరుతున్నారు, ఇక ఆర్టీసీ త‌రపున దూర‌పు ప్రాంతాల‌కుబ‌స్సులు వెళితే క‌చ్చితంగా సీనియ‌ర్ డ్రైవ‌ర్లు మాత్ర‌మే ఉండాలి అని ష‌రతులు పాటించాలి అని చెబుతున్నారు