450 ఏళ్ల త‌ర్వాత స‌మాధి నుంచి బ‌య‌ట‌కు వచ్చిన మ‌నిషి ఎక్క‌డో తెలిస్తే షాక్

361

మ‌న‌కు క‌నిపించే వాటిలో చాలా వ‌ర‌కూ వాస్త‌వాలు ఉంటాయా లేదా అనేది ఓ సందేహం.. చూసింద‌ల్లా నిజ‌మా కాదా అని కూడా అనుకుంటాం. నిజంగా ఇప్పుడు ఇలాంటిదే మ‌నం చ‌ర్చించుకోబోతున్నాం ..గోవాలో ఓ విచిత్ర‌మైన చ‌ర్చి గురించి ఇప్పుడు చెప్పుకోవాలి.ఇక్క‌డ ఓ వ్యక్తి మ‌ర‌ణించి 450 ఏళ్లు అయినా ఆ శ‌వాన్ని చ‌ర్చిలో భ‌ద్రంగా ఉంచారు. మ‌రి ఈ విచిత్ర‌మైన ఘ‌ట‌న గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గోవాలోని ప‌న్నాజీలో ఓ చ‌ర్చిలో ప్రాన్సియ‌స్ జేవియ‌ర్ అనే అత‌ని పార్ధీవ దేహం భ‌ద్ర‌ప‌రిచి ఉంటుంది.. అయితే అత‌ను ఏమీ ఇటీవ‌ల మ‌ర‌ణించిన వ్య‌క్తి కాదు, సుమారు ఆయ‌న మ‌ర‌ణించి 450 సంవ‌త్స‌రాలు అయింది. ప్రాన్సియ‌ష్ జేవియ‌ర్ గురించి ఈ చర్చికి వ‌చ్చే ప్ర‌తీ ఒక్క‌రూ తెలుసుకుంటారు. ఇప్ప‌టికీ 450 ఏళ్లు అయినా స‌రే ఎటువంటి తేడా ఆయ‌న శ‌రీరంలో కనిపించ‌దు అని చెబుతున్నారు. ఆయ‌న్ని చూసిన‌వారు…చర్చి బెలిసికా అనే ప్లేస్ లో ఆయ‌న పార్దీవ దేహాన్ని ఉంచారు. ఇక ఆయ‌న‌కు అనేక శ‌క్తులు ఉన్నాయి అని, అందుకే ఆయ‌న ఎంతో గొప్ప వ్య‌క్తిగా కీర్తిస్తారు. అందుకే ఆయ‌న శ‌రీరం ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలా నిలిచి ఉంది అంటే, ఆ శ‌క్తులే కార‌ణం అని చెబుతుంటారు ఇక్క‌డ వారు… ఆయ‌నని చూసేందుకు ప్ర‌తీ సంవ‌త్స‌రం క్రిస్ట‌మ‌స్ కు వేలాది మంది జ‌నం వ‌స్తారు. ఓసారి ఆయ‌న చ‌రిత్ర గురించి తెలుసుకుంటే.

ప్రాన్సియ‌స్ జేవియ‌ర్ అనే వ్య‌క్తి ఓ సోల్జ‌ర్, ఆయ‌న ఇగ్నాంటియా స్టూడెంట్, ఈ ఇగ్నాంటియా అనే అత‌ను ది క‌మ్యూనిటీ ఆఫ్ జీసెస్ అనే సంస్ద‌ను రూపొందించాడు. ఈ స‌మ‌యంలో ఆ దేశ‌పు రాజు, ఫ్రాన్సియ‌స్ జేవియ‌ర్ ని త‌మ క‌మ్యూనిటీ గురించి భోద‌న చేయ‌మ‌ని ఇండియాకు పంపించాడు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ప‌లు చోట్ల ఆ దేశ‌పు ఆచారాలు ప‌ద్ద‌తులు తెలియ‌చేశాడు. చివ‌ర‌కు ఓ రోజు చైనాలో స‌ముద్ర ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఆయ‌న ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించాడు ఆయ‌న మృత‌దేహం స‌ముద్రం నుంచి చాలా క‌ష్టం మీద రెండు రోజుల‌కు తీశారు, కాని విచిత్రం ఏమిటి అంటే ఆయ‌న శ‌రీరం పైకి తీసిన త‌ర్వాత ఉబ్బిన‌ట్లు కూడా క‌నిపించ‌లేదు, ఇక ఆయ‌న చ‌నిపోక ముందు త‌న స్నేహితుల‌తో త‌నకు ఎంతో న‌చ్చిన గోవా ప్రాంతం గురించి చెప్పార‌ట, త‌న‌కి అక్క‌డ ఓ చ‌ర్చిలో ద‌హన సంస్కారాలు చేయాలి అని కోరార‌ట‌.దీంతో ఆయ‌న స్నేహితులు జేవియ‌ర్ భౌతిక ఖాయాన్ని ఇక్క‌డ చ‌ర్చిలో పెట్టి కార్య‌క్ర‌మాలు చేశారు, కాని ఆయ‌న కార్య‌క్ర‌మాలు చేసిన మూడు సంవ‌త్స‌రాల‌కు ఆచ‌ర్చిని తొలిగించారు.. దీంతో ఆయ‌న శ‌వపేటిక‌ను మ‌రో చ‌ర్చికి మార్చారు. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కూ 3 చ‌ర్చిల్లో ఆయ‌న దేహ‌పు పెట్టిని మార్చారు. ఇప్ప‌టికీ ఆయ‌నలో ఎటువంటి మార్పు లేదు అని ఆయ‌న కు శ‌క్త‌లు ఉన్నాయి అని, అందుకే ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి త‌మ బాధ‌లు చెప్పుకుంటే తీరిపోతాయి అని చెబుతున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు