తండ్రి కోసం ఆ న‌లుగురు కుమార్తెలు శవాన్ని పట్టుకొని ఏం చేసారో తెలుసా.?

500

పుట్టిన‌ప్పుడు మ‌న కుటుంబం ఉంటుంది.. అయితే జీవిత చ‌ర‌మాకంలో మ‌న వెంట కూడా కొంద‌రు ఉంటారు… ఇక చ‌నిపోయిన త‌ర్వాత మ‌న కోసం ఎంత మంది బాధ‌ప‌డ‌తారో అదే నీవుజీవితంలో సాధించిన పెద్ద అచీవ్ మెంట్.. ఇక తల్లిదండ్రులు మ‌న కుటుంబాల కోసం చేసే సేవ మ‌రువ‌లేని వారి సేవ‌ను మ‌నం దేనితోని కొల‌వ‌లం. ఇక అల్లారుముద్దుగా పెంచిన తండ్రి చివరి కోరిక తీర్చడంతో ఓ కుటుంబం కులాగ్రహానికి గురైంది. తండ్రి శవాన్ని పాడె మీద వేసుకొని భుజాల మీద మోసిన నలుగురు కూతుళ్లను ‘పెద్దలు’ కులం నుంచి వెలి వేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బుందీ జిల్లాలో చోటు చేసుకుంది. రేగర్ సామాజిక వర్గానికి చెందిన దుర్గా శంకర్ టైలర్బగా ప‌ని చేస్తున్నాడు అక్క‌డే స్ధానికంగా కాలనీలో నివాసం ఉండేవాడు. అనారోగ్యం కారణంగా ఆయన గ‌త రాత్రి మరణించాడు.

కొడుకులు లేకపోవడంతో.. దుర్గా శంకర్ తన నలుగురు కూతుళ్లనే కొడుకుల్లా భావించేవాడు. తను చనిపోయాక వారే పాడె మోయాలనేది ఆయన చివరి కోరిక. తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చడానికి నలుగురు కూతుళ్లు ముందుకొచ్చారు. కానీ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తే.. కులం నుంచి బహిష్కరిస్తామని పెద్దలు హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గకుండా.. వారు తమ తండ్రి అంతిమ యాత్ర నిర్వహించారు.

అంతిమ సంస్కారాలు అయిపోయాక, తప్పు చేశామని ఒప్పుకోవాలని కులపెద్దలు వారికి సూచించారు…. కానీ వారు అందుకు అంగీకరించలేదు. దీంతో మృతుడి భార్య, నలుగురు కూతుళ్లు స్నానాలు చేయడానికి వీల్లేకుండా.. శ్మశానం దగ్గర్లోని తమ కమ్యూనిటీ కాంప్లెక్స్‌కు తాళం వేశారు. వారి కులస్తులెవరూ వారికి భోజనం పెట్టడానికి ముందుకు రాలేదు. దీంతో వారు ఇంటికెళ్లి స్నానాలు చేయాల్సి వచ్చింది.

తండ్రి చివరి కోరిక తీర్చినందుకు మమ్మల్ని దోషుల్లా చూస్తున్నారని, ఎవరూ భోజనం తీసుకురాక‌పోవ‌డంతో సంప్రదాయానికి విరుద్ధంగా.. ఇంట్లో వంట వండాల్సి వచ్చిందని మృతుడి చిన్నకూతురు కళావతి బాధ‌ప‌డింది… ప్రస్తుతం ఆమె బీఏ ఫైనలియర్ చదువుతోంది… దుర్గా శంకర్ కుటుంబ సభ్యులను కులం నుంచి బహిష్కరించలేదని కులపెద్దలు చెప్పారు. ఆ కుటుంబీకులెవరూ తమను కమ్యూనిటీ కాంప్లెక్స్ తాళాలు అడగలేదని చెబుతున్నారు. చూశారుగా ఇంకా ఇలాంటి న‌మ్మ‌కాలు కుల ప‌ట్టింపులు వెలి అనేవి అక్క‌డ‌క్క‌డా జ‌రుగుతున్నాయి.. ఇలాంటివి
ఎట్టిప‌రిస్దితుల్లో ఎంక‌రేజే చేయ‌కూడ‌దు..