‘లడ్డూ’ కావాలా బాబూ… గంటకు రూ.3 వేలు.. రాత్రికి రూ.7 వేలు… వగలాడి గాలం…

3800

సోషల్ మీడియా అనేది వచ్చాకా మంచి కన్నా చెడునే ఎక్కువగా అవుతుంది.దాని ద్వారా మంచిని చూసుకోవాలి కానీ ఎక్కువ మంది చెడు వైపుకే వెళ్తున్నారు.ముఖ్యంగా ఇతరులను మోసం చెయ్యాలనుకునే వారికి సోషల్ మీడియా అనేది బాగా ఉపయోగపడుతుంది.టెక్నాలజీని ఉపయోగించుకుని దారుణమైన మోసాలు చేస్తున్నారు.ఈ మద్య రోజుకొక కొత్త రకం యాప్స్ వస్తున్నాయి.ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను పట్టుకుందామని టెక్నాలజీని వాడాలని చూస్తే ఆ యాప్స్ కూడా వాళ్లకు తగట్టు క్రియేట్ చేసుకుంటున్నారు.ఒక అమ్మాయి కూడా ఇలా ఉపయోగించే అబ్బాయిలను బకరా చేస్తుంది.ఇంతకు ఆ అమ్మాయి ఏం చేస్తుంది.ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for college girls at broker house

లడ్డూ కావాలా బాబూ’ అంటూ గుర్తు తెలియని నంబరు నుంచి ఓ వాట్సాప్ సందేశం వస్తుంది. ఆ సందేశాన్ని ఓపెన్ చేస్తే ఓ అందమైన అమ్మాయి ఫోటో.. దానికి కిందనే గంటకు రూ.3 వేలు.. రాత్రికి రూ.7 వేలు అని ఉంటుంది. ఆ తర్వాత దానికింద మొబైల్ నంబర్ ఉంటుంది.ఓ మాయలేడి పంపించే ఫోటోను చూడగానే సొంగ కార్చుకుని ఎంజాయ్ చేద్దామని భావిస్తే మాత్రం మీరు మోసపోయినట్టే. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎంజాయ్ చేద్దామని భావించి, ఆ డబ్బును జమ చేయగానే, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా బేగంపేటలోని ఓ లొకేషన్ షేర్ అవుతుంది.

Image result for brothel houses

సదరు అపార్టుమెంట్‌లోని ఫలానా ఫ్లోర్‌కు వెళ్లాలని, ఏ తలుపు తీసుంటే దానిలోకి నిర్భయంగా రావాలని చెబుతుంది. ఇక అక్కడికి వెళ్లిన వారు, తాము ఫ్యామిలీస్ ఉంటున్న అపార్టుమెంట్‌కు వచ్చామని, మోసపోయామని తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ఈ క్రమంలో వాగ్వాదాలు, ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. దాదాపు వంద మందిని ఈ మాయలేడి మోసం చేసింది. మోసపోయిన యువకుల బాధ ఒకలా ఉంటే, అపార్టుమెంట్‌లో ఉంటున్న వారి బాధలే ఎక్కువగా ఉన్నాయి. పగలు, రాత్రి లేకుండా గంటకొకరు వచ్చి తలుపు కొడుతుంటే, వారికి సమాధానం చెప్పలేకపోతున్న పరిస్థితి.

ఇంట్లోని మగవారు ఆఫీసులకు పోలేక కాపలా కాయాల్సి వస్తోందని ఆ కుటుంబంలోని వారు వాపోతున్నారు.ఇక సదరు వగలాడి నంబరును ట్రేస్ చేస్తుంటే ఒక రోజు చెన్నైలో, మరో రోజు నాగపూర్‌లో, ఇంకో రోజు బెంగళూరులో ఉన్నట్టు చూపిస్తోంది. ఇక కేసును ఛేదించడం తమ వల్ల కాదని భావించిన బేగంపేట సీఐ అశోక్‌రెడ్డి, ఇటీవల సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించారు. యువతి తయారు చేసుకున్న వెబ్ సైట్‌ను తొలగించగా, ఆమె మరో సైట్‌ సృష్టించుకుంది. అతి త్వరలోనే ఆమె ఆట కట్టిస్తామని చెబుతున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.చూశారుగా ఈ కిలాడి లేడి ఎవరో కాని చాలా తెలివిగల దానిలా ఉంది కదూ.మరి ఈ అమ్మాయి గురించి ఆమె చేస్తున్న మోసం గురించి అమ్మాయి అనంగానే డబ్బులు జమచేసి మోసపోయిన అభాగ్యుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.